బీట్ రూట్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

బీట్‌రూట్ అనేది బచ్చలికూర, పాలకూరల కుటుంబానికి చెందినది. బీట్‌రూట్ ఆకులు,  బీట్‌రూట్ ఈ రెండింటినీ తినవచ్చు. కానీ దీని ఆకులు చేదుగా ఉంటాయి. బీట్‌రూట్ మాత్రం తియ్యగా ఉంటుంది. ఇవి ఏడాది పొడవునా దొరుకుతాయి. తెలుపు, పసుపు రంగులలో కూడా ఈ దుంపలు దొరుకుతాయి. ఈ రకాలు రంగురంగుల వంటకాలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అయితే క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేసే బీటాసైనిన్‌ మాత్రం ఎర్రని  బీట్‌రూట్ దుంపలలో మాత్రమే ఉంటుంది. బీట్‌రూట్‌‌లో ఉండే పోషక విలువలు 100 […]

Share:

బీట్‌రూట్ అనేది బచ్చలికూర, పాలకూరల కుటుంబానికి చెందినది. బీట్‌రూట్ ఆకులు,  బీట్‌రూట్ ఈ రెండింటినీ తినవచ్చు. కానీ దీని ఆకులు చేదుగా ఉంటాయి. బీట్‌రూట్ మాత్రం తియ్యగా ఉంటుంది. ఇవి ఏడాది పొడవునా దొరుకుతాయి. తెలుపు, పసుపు రంగులలో కూడా ఈ దుంపలు దొరుకుతాయి. ఈ రకాలు రంగురంగుల వంటకాలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అయితే క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేసే బీటాసైనిన్‌ మాత్రం ఎర్రని  బీట్‌రూట్ దుంపలలో మాత్రమే ఉంటుంది.

బీట్‌రూట్‌‌లో ఉండే పోషక విలువలు

100 గ్రాముల బీట్‌రూట్‌‌లో ఈ క్రింది పోషక విలువలు ఉంటాయి:

36 కిలో కేలరీలు లేదా 154 కిలో జౌల్స్

7 గ్రా. ప్రోటీన్

1 గ్రా. కొవ్వు

6 గ్రా. పిండి పదార్థాలు

5 గ్రా. ఫైబర్

380 మిల్లీ గ్రాముల పొటాషియం

150 ఎంసిజి ఫోలేట్

బీట్‌రూట్ వల్ల కలిగే 5 ప్రయోజనాలు

1. క్యాన్సర్ నిరోధక లక్షణాలు 

బీట్‌రూట్‌లో ఊదా రంగును అందించే ప్లాంట్ పిగ్మెంట్ అయిన బీటాసైనిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన ఏజెంట్. ఇది మూత్రాశయ క్యాన్సర్‌తో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌లు అభివృద్ధి అవకుండా కాపాడుతుంది.

2. రక్తపోటును తగ్గిస్తుంది

బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. నైట్రేట్లు రక్త నాళాలను ఫ్రీగా ఉంచి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ధమనులలో ఉండే బ్లాక్స్ తొలగించి, రక్తపోటు తగ్గేలా చేసి.. గుండె జబ్బులు, స్ట్రోక్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది. నైట్రేట్ అధికంగా ఉండే ఆహారాల వంటి బీట్‌రూట్‌లు గుండెపోటు వచ్చిన వారికి కూడా సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

3. వ్యాయామం చేయడానికి శక్తినిస్తుంది

బీట్‌రూట్‌ రసం తాగడమే తన విజయ రహస్యమని పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ డేవిడ్ వీర్  ప్రకటించినప్పటి నుండి బీట్‌రూట్ జ్యూస్ చాలా పాపులర్ అయ్యింది. అథ్లెట్లు బీట్‌రూట్ జ్యూస్‌ తీసుకున్నప్పుడు వాళ్లకి శక్తినిచ్చి, ఎక్కువసేపు వ్యాయామం చేయగలిగేలా చేస్తుందని పరిశోధనలతో కూడిన అధ్యయనాలు తెలుపుతున్నాయి. కండరాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, బీట్‌రూట్‌లోని నైట్రేట్‌లు కండరాల కణాలకు మరింత ఆక్సిజన్‌ అందించి, కండరాలు మరింత సమర్థవంతంగా కోలుకోవడానికి సహాయపడతాయి. కాబట్టి, ఇది రికవరీకి కూడా సహాయపడుతుంది. మన ఆహారంలో బీట్‌రూట్‌ ఉంటే మనకు అవసరమైనంత శక్తి మనకు లభిస్తుంది.

4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

బీట్‌రూట్‌లలో గ్లుటామైన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ప్రేగులను ఆరోగ్యకరంగా ఉంచే అమైనో ఆమ్లం. దీనిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంది. అలాగే ప్రేగు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా ఆంత్రాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.

̣5. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు

రెడ్ బీట్‌రూట్‌లు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే 10 అత్యంత శక్తివంతమైన  కూరగాయలలో ఒకటిగా స్థానం పొందాయి. దీని ఎరుపు రంగుకు కారణమైన బీటాలైన్ సమ్మేళనాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అంటే ఏమిటంటే.. అవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడతాయి.

బీట్‌రూట్ అందరికీ మంచిదేనా?

కొంతమందికి బీట్‌రూట్ తినడం వల్ల బీటురియా, మలం, మూత్రం ఎరుపు రంగులో, అన్నీ గులాబీ రంగులో గానీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఏ మాత్రం ప్రమాదకరం కాదు. దీనిలో సహజమైన ఆక్సలేట్ అనే సమ్మేళనం చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటుంది. కిడ్నీలో ఆక్సలేట్ కలిగిన రాళ్ళు ఉన్నవారు బీట్‌రూట్ వంటి అధిక ఆక్సలేట్ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి.