ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటున్నారా..?

మన శరీరంలో ప్రోటీన్ ఎంత మోతాదులో ఉండాలో అదే మోతాదులో ఉండాలి. అలా కాకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉంటే కొత్తగా ఆరోగ్య సమస్యలు మొదలు అవుతాయి. ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండడం కోసం శరీరంలోని ప్రోటీన్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. మానవ శరీరంలో ఎన్నో విషయాలు ఉంటాయి. కొన్ని మనకు ఎంతో ఉపయోగపడే విషయాలు ఉంటే.. కొన్ని మాత్రం అంతగా యూజ్ కాని విషయాలు ఉంటాయి. ఉపయోగపడే విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఒకటి […]

Share:

మన శరీరంలో ప్రోటీన్ ఎంత మోతాదులో ఉండాలో అదే మోతాదులో ఉండాలి. అలా కాకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉంటే కొత్తగా ఆరోగ్య సమస్యలు మొదలు అవుతాయి. ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండడం కోసం శరీరంలోని ప్రోటీన్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. మానవ శరీరంలో ఎన్నో విషయాలు ఉంటాయి. కొన్ని మనకు ఎంతో ఉపయోగపడే విషయాలు ఉంటే.. కొన్ని మాత్రం అంతగా యూజ్ కాని విషయాలు ఉంటాయి. ఉపయోగపడే విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఒకటి మన శరీరంలో ఉండే ప్రోటీన్. ప్రోటీన్ అనేది శరీరానికి చాలా అవసరం అందుకోసమని మనం ఇష్టం వచ్చిన విధంగా ప్రోటీన్ ను తీసుకుంటామంటే కుదరదు. అందుకోసమే మనం తినే ఆహార పదార్థాలలో ఎంత మొత్తంలో ప్రోటీన్ ఉంటుందో మనం జాగ్రత్తగా లెక్కేసుకోవాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చిన విధంగా లెక్క లేకుండా తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ప్రొటీన్స్ తీసుకునే సమయంలో చాలా జాగ్రత్త అవసరం. 

వచ్చే సమస్యలివే… 

ఏదైనా పోషక పదార్థం తగ్గితే ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ పెరిగితే ఎక్కడైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తారు. ప్రొటీన్ పెరగడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే… ఎవరికైనా ఆహారంలో ప్రొటీన్ అనేది ఒక ముఖ్యమైన పోషకం మరియు దాని లోపం వల్ల మీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అంతే కాకుండా మీ జుట్టు మరియు చర్మాన్ని కూడా అది దెబ్బతీస్తుంది. మీరు మీ కండర ద్రవ్యరాశిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే మీకు అలసట కూడా వస్తుంది. ప్రొటీన్ అనేది తక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రొటీన్ ను ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. మనం తీసుకునే ఆహారంలో కనుక ప్రొటీన్ అనేది ఎక్కువ అయితే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధిక ప్రొటీన్ ఉన్న ఆహారాలు నిర్జలీకరణ (డయజేషన్) సమస్యలు వస్తాయి. ప్రొటీన్ తో పాటు ఫైబర్ మరియు తగినంత నీరు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫైబర్ తక్కువగా ఉంటే చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. ప్రజలు అధిక ప్రొటీన్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల వారి మూత్రంలో కాల్షియం చాలా కోల్పోతారు. అధిక ప్రొటీన్ తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. అవేంటంటే.. 

మూత్రపిండాలపై ఒత్తిడి

మానవ శరీరంలో మూత్రపిండాలు చాలా ముఖ్యం. మన శరీరం కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు మూత్రపిండాల పని తీరు అనేది చాలా అవసరం. మూత్రపిండాలు కనుక సరిగ్గా పని చేయకపోతే మన శరీరంలోని మొత్తం సిస్టం వర్క్ చేసినా కానీ మనల్ని సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకోసమే మూత్రపిండాల ఆరోగ్యం చాలా ముఖ్యం. అధిక ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఇది హాని కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ముందుగా ఉన్న మూత్రపిండ సమస్యలతో బాధపడే వ్యక్తులకు ఇది మరిన్ని సమస్యలు కలిగిస్తుంది. వారిలో మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ప్రొటీన్ ను తీసుకునేటపుడు ఎంత మొత్తంలో తీసుకుంటున్నామో చూసుకోవడం చాలా అవసరం. 

డీ హైడ్రేషన్

మన శరీరానికి హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. మన బాడీ కనుక డీ హైడ్రేట్ అయితే చాలా కష్టం అవుతుంది. అందుకోసమే ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. మన శరీరంలో ఉన్న నీటి లెవల్స్ నే హైడ్రేషన్ అని పిలుస్తారు. అధిక-ప్రొటీన్ ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా అవి మూత్రం ద్వారా నీటి నష్టాన్ని పెంచుతాయి. అప్పుడు మీరు నీటిని తీసుకునే మోతాదును పెంచాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు కనుక మోతాదును పెంచకపోతే మీరు డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కావున మనం ఆహారం తీసుకునేటపుడు అందులో ఉండే ప్రొటీన్ లెవెల్స్ ను చూసుకోవాలి. 

జీర్ణ సమస్యలు

మనం ఆరోగ్యంగా ఉండేందుకు మనం తిన్న ఆహారం జీర్ణం కావడం చాలా అవసరం. అదే మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే మనం ఏం తిన్న కానీ అది సరిగ్గా జీర్ణం కాదు. అప్పుడు మనం తీసుకున్న విటమిన్స్, ఖనిజాలు అనేవి మన శరీరానికి ప్రయోజనం చేకూర్చవు. తద్వారా మనకు అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసమే మనలో జీర్ణవ్యవస్థ అనేది చాలా ముఖ్యం. అధిక ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకున్నపుడు జీర్ణ వ్యవస్థకు సమస్యలు వస్తాయి. అధిక స్థాయిలో ప్రొటీన్లను తీసుకున్నప్పుడు అనేక మంది మలబద్ధకంతో సహా జీర్ణక్రియలో అసౌకర్యాన్ని అనుభవించవచ్చు.

ఎముకల ఆరోగ్యం

మనకు ఎముకల ఆరోగ్యం కూడా ముఖ్యమైనదే. అధిక ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా కాల్షియం నష్టానికి దారితీస్తుంది. ఇలా డెయిలీ కాల్షియం నష్టం జరగడం ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకోసమే అధిక ప్రొటీన్స్ ఉన్న ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.