హైడ్రాక్సీక్లోరోక్విన్ తో గుండెకు చేటు

కరోనా సమయంలో ఆ మందులు వాడారా? చాలా రిస్క్వాటిని వాడటం వల్ల గుండెకు అత్యంత హానికరం క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మరియు అజిత్రో మైసిన్ లాంటి మందులు కరోనా లాంటి మహమ్మారిని తగ్గించడంలో సరైన ప్రభావాన్ని చూపిస్తాయి అనేందుకు ఆధారాలు ఎలాంటివి లేవు. అయితే కోవిడ్- 19 చికిత్స మరియు నిరోధించడానికి వీటిని తెగ వాడేశారు. ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేందుకు పరిశోధనలు కూడా అప్పట్లో జరగలేదు. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికీ వీటిని డాక్టర్లు […]

Share:

కరోనా సమయంలో ఆ మందులు వాడారా? చాలా రిస్క్
వాటిని వాడటం వల్ల గుండెకు అత్యంత హానికరం

క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మరియు అజిత్రో మైసిన్ లాంటి మందులు కరోనా లాంటి మహమ్మారిని తగ్గించడంలో సరైన ప్రభావాన్ని చూపిస్తాయి అనేందుకు ఆధారాలు ఎలాంటివి లేవు. అయితే కోవిడ్- 19 చికిత్స మరియు నిరోధించడానికి వీటిని తెగ వాడేశారు. ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేందుకు పరిశోధనలు కూడా అప్పట్లో జరగలేదు. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికీ వీటిని డాక్టర్లు ఉపయోగించమని చెప్పే వారు. దీంతో వీటిని ప్రజలు కూడా కరోనా వచ్చినా, రాకున్నా బాగా ఉపయోగించారు. అయితే తాజాగా వీటిపై కొన్ని పరిశోధనలు జరిగాయి. వీటి వాడకం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని వాటిల్లో కనుగొన్నారు. ఈ మందుల కారణంగా క్రమరహిత హృదయ స్పందనలు మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం వంటివి రోగులపై ప్రతికూల దుష్ప్రభావాలు ఉండవచ్చు అని ఆ కొత్త అధ్యయనం తెలిపింది. కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన సమీక్ష పరిశోధన అందుబాటులో ఉన్న ఉత్తమ సాక్ష్యాధారాల ఆధారంగా.. ఈ మందులతో పాటు వాటి నిర్వహణతో సంబంధం ఉన్న సంభావ్య హాని యొక్క అవకాశాలను అందిస్తుంది.

“వైద్యులు మరియు రోగులు..  క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీ క్లోరోక్విన్ యొక్క అనేక అరుదైన లేదా  ప్రాణాంతక దుష్ప్రభావాల గురించి తెలుసుకోవాలి అని సన్నీబ్రూక్ హెల్త్ సైన్సెస్ సెంటర్, క్లినికల్ ఫార్మకాలజీ మరియు టాక్సికాలజీ విభాగం మరియు ICES సీనియర్ శాస్త్రవేత్త డేవిడ్ జుర్లింక్ అన్నారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ఔషధాల యొక్క సంభావ్య ప్రతికూల ప్రభావాలలో క్రమరహిత హృదయ స్పందనలు, రక్తంలో తగ్గిన గ్లూకోజ్ స్థాయిలు, ఆందోళన, గందరగోళం, భ్రాంతులు మరియు మతి స్థిమితం పోవడం వంటి న్యూరో సైకియాట్రిక్ ప్రభావాలు వచ్చే అవకాశాలు అనేకం ఉన్నాయి అని ఆయన హెచ్చరించారు.

కొంత మంది వ్యక్తుల శరీరాలు క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లను అతి త్వరగా ప్రాసెస్ చేయలేవని, మరియు కొద్ది శాతం మందిలో వాటిని వేగంగా జీవక్రియ చేసి, చికిత్సకు వారి ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుందని డాక్టర్ చెప్పారు. క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అధిక మోతాదులో చాలా విషపూరితమైనవి మరియు మూర్ఛలు, కోమా మరియు గుండె ఆగిపోవడానికి కారణం అవుతాయి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను విచక్షణా రహితంగా ఉపయోగించడం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్  రుమటాయిడ్ ఆర్థ రైటిస్, లూపస్ మరియు ఇతర దీర్ఘ కాలిక వ్యాధులు వస్తాయి అని వెల్లడించారు. ప్రధానంగా ఔషధాలను సూచించే రోగులకు చికిత్సలు చేయించుకోవడంలో ఆలస్యం అయితే పరిస్థితి చేయి దాటుతుందని పరిశోధకులు తెలిపారు.

సమీక్ష ప్రకారం.. మహమ్మారి కరోనా (COVID-19) ఉన్న రోగులలో ఈ చికిత్సలు ప్రయోజనకరంగా ఉండ వచ్చనే సాక్ష్యం లేదు. అలాగే మరోవైపు మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధిని మరింత తీవ్రతరం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి అని అన్నారు. “మహమ్మారి కరోనా (COVID-19) చికిత్సలో క్లోరోక్విన్ లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్ యొక్క సంభావ్యత పట్ల ఆశావాదం (కొంతమందిలో, ఉత్సాహం కూడా) ఉన్నప్పటికీ, మందులు వ్యాధి యొక్క గమనాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం గురించి చాలా తక్కువ స్థాయిలో పరిశీలనలు జరిగాయి అని జుర్లింక్ చెప్పారు. అందుకే వీటిని వాడటంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం అయితేనే డాక్టర్ల సలహాతో తక్కువ మోతాదులో తీసుకోవాలి అని ఆయన అన్నారు.