మీరు అందంగా మెరిసిపోవడానికి నాచురల్ 10 బెస్ట్ బ్యూటీ టిప్స్..

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. మచ్చలేని మోము ఆకర్షణీయం. అందుకోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే కేశాలను, చర్మాన్ని అందంగా మెరిపించవచ్చు.. 10 బెస్ట్ నాచురల్ బ్యూటీ ప్యాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 1. నిర్జీవంగా మారిన ముఖాన్ని, మృత కణాలు తొలగించడానికి.. ఒక చెంచా తేనెలో కొద్దిగా నిమ్మరసం […]

Share:

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. మచ్చలేని మోము ఆకర్షణీయం. అందుకోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే కేశాలను, చర్మాన్ని అందంగా మెరిపించవచ్చు.. 10 బెస్ట్ నాచురల్ బ్యూటీ ప్యాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. నిర్జీవంగా మారిన ముఖాన్ని, మృత కణాలు తొలగించడానికి.. ఒక చెంచా తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మీ ముఖాన్ని తాజాగా ఉంచడంతోపాటు మెరిసేలా చేస్తుంది. 

2. ఒక చెంచా చొప్పున కాఫీ పొడి, కొబ్బరి నూనె, పంచదార మూడింటిని తీసుకొని ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకొని స్క్రబ్ చేయాలి. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి ఈ ప్యాక్ అద్భుతంగా సహాయపడుతుంది. ఇంకా మీ చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మారుస్తుంది.

3. గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఆ ఆకులను పాడేయకుండా లేదంటే ఆ టీ బ్యాగ్స్ ను పారేయకుండా.. ఆకులు చల్లారిన తరువాత ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకుని వాటిని ఐస్ క్యూబ్స్ గా తయారు చేసుకుని వాటిని ముఖం మీద రుద్దుకుంటే.. చక్కటి గ్లోయింగ్ వస్తుంది. మూసుకుపోయిన చర్మ రంధ్రాలు కూడా తెరుచుకుంటాయి.

4. ఒక చెంచా యోగర్ట్ లో కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. తరవాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మం పొడిబారకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది.

5. మీ ముఖం కందిపోయిన లేదంటే ఎండ దెబ్బకి వాడిపోయిన.. వెంటనే అలోవెరా జెల్ ను కొద్దిగా రాసుకుంటే చాలు. మీ ముఖం పై చర్మాన్ని కూలింగ్ చేస్తుంది. ఇంకా డామేజ్ అయిన మీ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. 

6. మృదువైన పెదాల కోసం కొబ్బరి నూనెలో కొద్దిగా తేనె కలిపి పెదాలపై స్క్రబ్ చేయాలి. ఇది మీ పెదాలను హైడ్రేట్ చేయడంతో పాటు మృదువుగా ఉంచుతాయి. 

7. మీ చర్మం నిర్జీవంగా మారితే బాదం నూనెలో కొద్దిగా పంచదార కలిపి స్క్రబ్ చేసుకోవాలి. ఇది మీ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడమే కాకుండా సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకునే లాగా చేస్తుంది. 

8. ఆలివ్ ఆయిల్ లో కొద్దిగా ఆవకాడో గుజ్జును కలపాలి. ఇది మీ  జుట్టుకు రాసుకొని పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేస్తే మీ జుట్టు మృదువుగా , పట్టుకుచ్చులా మెరిసిపోతుంది..

9. కొబ్బరి నూనెను కొద్దిగా గోరువెచ్చ చేసి ఆ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించాలి. తరువాత మర్దన చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీ జుట్టు కుదుళ్లకు తగినంత రక్త సరఫరా అయ్యి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

10. మీరు తలస్నానం చేసిన తరువాత చివరిలో ఒక మగ్గు నీటిలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలపాలి. ఆ నీటిని తల మీద పోసుకుంటే.. మీ జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోవడంతో పాటు ఒత్తుగా కూడా పెరుగుతుంది.