ఒత్తిడిని దూరం చేసే చక్కని అలవాట్లు

ఇప్పుడున్న వురుకుల పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. స్కూల్ చదువుతున్న పిల్లవాడి దగ్గర నుంచి ఉద్యోగం చేస్తున్న వారు, ఇంటి పని చేసే గృహిణులు ఇలా అనేకమంది ఎన్నో రకాలైన కారణాలవల్ల ప్రతిరోజు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒత్తిడి అనేది చాలా వరకు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ముఖ్యకారకం. ఆరోగ్యకరమైన జీవితం ఈ ఒత్తిడి వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణులు చెప్పే కొన్ని ముందస్తు జాగ్రత్తల వల్ల మనం […]

Share:

ఇప్పుడున్న వురుకుల పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. స్కూల్ చదువుతున్న పిల్లవాడి దగ్గర నుంచి ఉద్యోగం చేస్తున్న వారు, ఇంటి పని చేసే గృహిణులు ఇలా అనేకమంది ఎన్నో రకాలైన కారణాలవల్ల ప్రతిరోజు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒత్తిడి అనేది చాలా వరకు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ముఖ్యకారకం. ఆరోగ్యకరమైన జీవితం ఈ ఒత్తిడి వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణులు చెప్పే కొన్ని ముందస్తు జాగ్రత్తల వల్ల మనం ఒత్తిడి నుంచి బయట పడే అవకాశం ఉంది, అవేంటో ఈరోజు తెలుసుకుందాం.. 

ఉదయాన్నే లేవడం: 

‘ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్’ అని చిన్నతనంలో మనం నేర్చుకున్న పాఠాలు నిజానికి సగటు మనిషికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఉదయాన్నే లేవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి చక్కగా నిద్రపోయి ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం అనేది, మనం రోజువారి చేసే పని మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది.  చిన్న పని కూడా హడావిడిగా చేయాల్సిన అవసరం ఉండదు. మన ప్రణాళిక ప్రకారమే పనులు పూర్తవుతాయి. దీనివల్ల రోజంతా ఎంతో హాయిగా, ఒత్తిడి లేకుండా, సాఫీగా, మనశ్శాంతిగా ఉండొచ్చు. అందుకే ఉదయాన్నే లేవడం ఒక అలవాటుగా మార్చుకుంటే మన జీవన శైలి కూడా చాలా చక్కగా మారుతుంది.

ప్రతిరోజు డైరీ రాసుకోండి: 

మీరు రోజు వారు చేయాలనుకునే కొన్ని విషయాలను ఈరోజు మొదలవుతుంది అనిపించుకుని ఒత్తిడి తగ్గించేందుకు, రోజు స్టార్ట్ చేసే ముందు డైరీలో కొన్ని మంచి విషయాలు రాసుకోండి. ముఖ్యంగా మీ ఆనందాన్ని పెంపొందించే అంసాలను డైరీలో ఉండేలా చూసుకోండి. డైరీ రాయడం ఒక మంచి పద్ధతి. చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా సరే డైరీ రాసే అలవాటు చేసుకోవచ్చు. మన గురించి మనకి మరింత బాగా తెలుసుకునేందుకు కూడా ఈ డైరీ మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి తగ్గించే ప్రక్రియలో డైరీ కూడా భాగంగా మారుతుంది. 

ఎక్సర్సైజ్-యోగ: 

మనిషి జీవితంలో ఎక్సర్సైజ్ అనేది ఒక భాగంగా అయిపోవాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల ఎక్ససైజ్ శరీరానికి ఎంతో మంచిది. వాకింగ్ చేయడం, ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్లడం, కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం. ఇవన్నీ మనం రోజు ఒక అరగంట కనీసం చేయగలిగితే, మనకి తెలియకుండా మనలో ఉండే ఒత్తిడి బయటికి వెళ్లిపోతుంది. మళ్లీ ఉత్సాహంగా మన పనులను మనం ఒత్తిడి లేకుండా చేసుకోగలుగుతాము. 

మంచి అలవాట్లు: 

అలవాట్లు మనిషి జీవితాన్ని మారుస్తాయి అనడంలో సందేహమే లేదు. మన రోజువారి జీవన శైలిలో మనకి నచ్చిన అలవాట్లు అలవర్చుకోవడం వల్ల, మనిషి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైన క్షణాలకు దూరమచ్చు. ముఖ్యంగా, ఒత్తిడిని దూరం చేసే అలవాట్లు ప్రతి ఒక్కరు జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. ఖాళీ సమయం దొరికినప్పుడు అవసరమైన విషయాలు గుర్తు చేసుకోకుండా కొన్ని అలవాట్లను ఈ రోజే మొదలు పెట్టండి. బుక్స్ చదవడం, రీసెర్చ్ చేయడం, కథలు రాయడం, ఇలాంటివి చేయడం వల్ల అనవసరమైన ఆలోచనలను కలిగించే ఒత్తిడికు దూరంగా ఉండొచ్చు. 

దేవుడిని స్మరించడం: 

రోజంతా హుషారుగా, హడావిడి లేకుండా, ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా గడిపేందుకు చాలా మంది తమ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. తమదైన శైలిలో దేవున్ని స్మరిస్తూ, పాటలు పాడడం, తమ మతంలో ఉండే కొన్ని మంత్రాలు జపించడం, మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఒత్తిడిని దూరం చేయడంలో దేవున్ని స్మరించడం ఒక చక్కని ఉపశమనమని చెప్పాలి. అందుకే చాలామంది కూడా, ఉదయాన్నే లేవగానే, తమ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ, మంత్రాలు పటిస్తూ, ప్రశాంతంగా తమ కాలాన్ని గడుపుతుంటారు.