మొటిమలు లేదా వైట్‌‌హెడ్స్‌ని తొలగించుకోండి

వైట్ హెడ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని పోగొట్టుకోవడానికి ఈ 5 చిట్కాలను ప్రయత్నించి చూడండి. వైట్ హెడ్స్ బాధాకరంగానో, భయంకరంగానో కనిపించకపోవచ్చు. కానీ అవి ఇబ్బందిపెడతాయి. వైట్‌హెడ్స్‌ను ఎలా తొలగించాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఈ 5 పద్ధతులను ప్రయత్నించండి! వైట్‌హెడ్స్‌ రావడానికి కారణాలేమిటి? హెయిర్ ఫోలికల్స్‌లో సెబమ్ ఉత్పత్తి పెరగడం, సెల్ షెడ్డింగ్ వంటి వివిధ కారణాల వల్ల వైట్ హెడ్స్ ఏర్పడవచ్చు. యుక్త వయస్సులో మొటిమలు సాధారణం. ఇది ఆండ్రోజెన్ హార్మోన్ల వల్ల […]

Share:

వైట్ హెడ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని పోగొట్టుకోవడానికి ఈ 5 చిట్కాలను ప్రయత్నించి చూడండి.

వైట్ హెడ్స్ బాధాకరంగానో, భయంకరంగానో కనిపించకపోవచ్చు. కానీ అవి ఇబ్బందిపెడతాయి. వైట్‌హెడ్స్‌ను ఎలా తొలగించాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఈ 5 పద్ధతులను ప్రయత్నించండి!

వైట్‌హెడ్స్‌ రావడానికి కారణాలేమిటి?

హెయిర్ ఫోలికల్స్‌లో సెబమ్ ఉత్పత్తి పెరగడం, సెల్ షెడ్డింగ్ వంటి వివిధ కారణాల వల్ల వైట్ హెడ్స్ ఏర్పడవచ్చు. యుక్త వయస్సులో మొటిమలు సాధారణం. ఇది ఆండ్రోజెన్ హార్మోన్ల వల్ల జరుగుతుంది. దీనిని పునరుత్పత్తి హార్మోన్లుగా సూచిస్తారు. సెబమ్ చర్మపు ఉపరితలంపైకి చేరుకోలేక పోయినప్పుడు, చర్మరంధ్రాలు మూసుకొని పోతాయి. మూసివున్న రంధ్రాల వెనుక ఎక్కువ సెబమ్ పేరుకుపోవడంతో వైట్‌హెడ్స్ అభివృద్ధి చెందుతాయి.

పట్టించుకోకపోతే వైట్‌హెడ్స్ ఇన్‌ఫెక్షన్‌గా మారవచ్చు. తెల్లగా, మధ్యలో ఎర్రగా ఉన్న మొటిమల రూపంలో ఇవి బయటకు వస్తాయి. హార్మోన్లలో మార్పులు, కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులు, సెబమ్, చెమట, జిడ్డు, కొన్ని మందులు, కాలుష్యం, సూర్యరశ్మి వైట్‌హెడ్స్ కి దారితీసే కొన్ని సాధారణ కారకాలు.

దీనిని ఎదుర్కోవడానికి ఈ ఐదు పదార్థాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి

1. సాలిసిలిక్ యాసిడ్

సాలిసిలిక్ యాసిడ్ అనేది బీటా-హైడ్రాక్సీ యాసిడ్. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది, రంధ్రాలను క్లియర్ చేస్తుంది. ఇది తేలికపాటి మొటిమల వంటి వైట్ హెడ్స్‌కు ఉత్తమంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది దెబ్బతిన్న చర్మం పై పొరను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మంలోకి చొచ్చుకొని పోవడం ద్వారా మీ రంధ్రాలకు అడ్డుపడే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. దాని పూర్తి ప్రభావం కనిపించాలంటే దీన్ని కొన్ని వారాల పాటు ఉపయోగించాల్సి ఉంటుంది.

2. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇది వైట్‌హెడ్స్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఇది హానికరమైన ప్రభావాలేమీ లేని సహజ పదార్ధం కాబట్టి.. మీ ముఖానికి నేరుగా అప్లై చేయడం సులభం. క్లెన్సర్‌లు, మాస్క్‌లు, స్పాట్ ట్రీట్‌మెంట్‌లతో సహా చర్మ సంరక్షణ కోసం కొన్ని ఉత్పత్తులలో టీ ట్రీ ఆయిల్ కూడా ఉంటుంది.

3. ఆవిరి పట్టటం

వైట్‌హెడ్స్ బెడద వదిలించుకోవడానికి మీకు సహాయపడే అత్యంత సహజమైన చికిత్సలలో ఒకటి ఆవిరి. ఇది మూసుకుపోయిన రంధ్రాలను తెరవడానికి, వైట్ హెడ్స్ వంటి సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఆవిరి రంధ్రాలను తెరవడానికి సహాయపడటమే కాకుండా, ఇది మీకు శుభ్రమైన, మృదువైన చర్మాన్ని కూడా అందిస్తుంది.

4. రెటినోయిడ్ క్రీములు

రోజువారీ ఫేస్ క్రీమ్‌గా ఉపయోగించినప్పుడు, రంధ్రాలను తెరవడానికి సహాయపడుతుంది. డెర్మటాలజీ, థెరపీలో ప్రచురించబడిన 2017 అధ్యయనంలో టాపిక్ రెటినాయిడ్స్ వైట్ హెడ్స్ వంటి మొటిమల చికిత్సలో సహాయపడతాయని కనుగొన్నారు. అవి వైట్‌హెడ్స్ కి చికిత్స చేయడానికి సహాయపడతాయి. కాబట్టి, వీటిని ప్రయత్నించే ముందు డెర్మటాలజిస్టును తప్పక సంప్రదించండి. 

5. అలోవెరా – కలబంద

కలబందలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మంలో చమురు ఉత్పత్తిని తగ్గిస్తుంది, కాలక్రమేణా వైట్‌హెడ్స్‌ను తగ్గిస్తుంది. మీరు ఒక చెంచా కలబంద గుజ్జును ఒక టీస్పూన్ నిమ్మరసంతో మిక్స్ చేసి, అప్లై చేయవచ్చు. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడగాలి.

ఈ ఉత్పత్తులు, చిట్కాలు చాలా బాగా పని చేస్తాయి, వైట్‌హెడ్స్ బెడద వదిలించుకోవడానికి సహాయపడతాయి. ఇక్కడ తెలిపిన ఏదైనా చిట్కాను ఉపయోగించే ముందు డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.