చుండ్రును, చిట్లిన చివరలను పెరుగుతో చేసిన ఈ మాస్క్‌లు ఎలా తగ్గిస్తాయో తెలుసుకోండి

పెరుగులో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అందువల్ల దీన్ని జుట్టు యొక్క సంరక్షణ కోసం ఎన్నో రకాలుగా వాడుతుంటారు. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంలోని మృత కణాలను తొలగించి జుట్టు ఆరోగ్యంగాను, అందంగానూ పెరిగేలా చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండే పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగులో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అందువల్ల దీన్ని జుట్టు యొక్క సంరక్షణ కోసం ఎన్నో […]

Share:

పెరుగులో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అందువల్ల దీన్ని జుట్టు యొక్క సంరక్షణ కోసం ఎన్నో రకాలుగా వాడుతుంటారు. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంలోని మృత కణాలను తొలగించి జుట్టు ఆరోగ్యంగాను, అందంగానూ పెరిగేలా చేస్తుంది.

ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండే పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగులో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అందువల్ల దీన్ని జుట్టు యొక్క సంరక్షణ కోసం ఎన్నో రకాలుగా వాడుతుంటారు. ఇది జుట్టు బాగా పెరిగేలా చేయడమే కాకుండా, చుండ్రు, స్ప్లిట్ ఎండ్స్ తగ్గేలా చేస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంలోని మృత కణాలను తొలగించి జుట్టు ఆరోగ్యంగాను, అందంగానూ పెరిగేలా చేస్తుంది. ఇది తలను జుట్టును తేమగా ఉంచి, పొడిబారకుండా చేస్తుంది. మీ జుట్టు పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా ఈ మాస్క్ అప్లై చేశాక మీ జుట్టు మీకే నచ్చేస్తుంది!

జుట్టుకు పెరుగును ఎలా అప్లై చేయాలి?

పెరుగుతో హెయిర్ మాస్క్‌  

మీ జుట్టు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెరిగేలా చేసి చుండ్రు నుండి ఉపశమనాన్నిస్తుంది. చివర్లు చిట్లడాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టును కుదుళ్ళ నుండి బలంగా చేస్తుంది. ఈ మాస్క్‌ అప్లై చేయడానికి ముందు జుట్టును తడిపి, చిక్కులు పోయేలా దువ్వండి. తర్వాత, ఒక గిన్నెలో పెరుగును తీసుకుని, తేనె, ఆలివ్ ఆయిల్ లేదా నిమ్మరసం వీటిలో మీకు నచ్చిన పదార్థాలతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. కుదుళ్ళ నుండి చివరి వరకు మొత్తం పట్టేలా బాగా పట్టించండి. ఈ మిశ్రమం జుట్టుకంతటికీ సమానంగా పట్టేలా రాయండి. మాడుపైన మొత్తం ఇంకేలా, సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టులో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మీ జుట్టును షవర్ క్యాప్ లేదా ప్లాస్టిక్ ర్యాప్‌తో కప్పి, ఈ మాస్క్‌ను  20-30 నిమిషాలు ఉంచి, ఆ తరువాత నీటితో కడిగేసుకోవాలి.

పెరుగు, అరటి పండు మాస్క్

పెరుగులో నిమ్మకాయను కలపడం ఇష్టంలేకపోతే, పెరుగులో అరటిపండును కలిపి మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. అరటిపండును మెత్తని గుజ్జులా చేసి పెరుగుతో కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయాలి. ఒక అరగంట పాటు అలాగే ఉంచి మంచి షాంపూతో జుట్టును శుభ్రం చేయాలి. ఇది మీ జుట్టును మెరిసేలా చేసి, పోషణనిస్తుంది. పెరుగు చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె కుదుళ్లకు  పోషణను అందిస్తుంది.

పెరుగు, అలోవెరాతో మాస్క్

పెరుగు, అలోవెరా కలిపి వేసే హెయిర్ మాస్క్ కుదుళ్లను హైడ్రేట్ చేసి, జుట్టును దృఢంగా చేస్తుంది. జుట్టు బాగా పెరగడానికి, జుట్టు చివరలు చిట్లిపోకుండా ఉంచడానికి సహాయపడుతుంది. కలబంద (అలోవెరా) ఒక సహజమైన కండీషనర్. ఇది జుట్టుకు అవసరమైన విటమిన్లను, ఖనిజాలను అందిస్తుంది. పెరుగు అనేది సహజమైన ఎక్స్‌ఫోలియంట్. ఇది చర్మంపైన ఉండే మృత కణాలను తొలగించడానికి, హెయిర్ ఫోలికల్స్‌ తెరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ మాస్క్‌ను తయారు చేయడానికి పెరుగు, అలోవెరా జెల్ సమాన భాగాలుగా తీసుకొని బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి, మీ తలకు మసాజ్ చేసి, 20-30 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత షాంపూ రాసుకొని, నీటితో బాగా శుభ్రం చేసి ఎప్పటిలాగే కండిషనర్ అప్లై చేయండి.