డైలీ రన్నింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

నేడు వేగవంతమైన జీవితంలో ఆరోగ్యంగా, శరీరాన్ని దృఢంగా ఉంచడకోవడం అనేది చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి సరైన పోషకాహారం అందించడం మరియు రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం ఎంతో అవసరం. వ్యాయామం చేయడం వలన  వివిధ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి చేసే వ్యాయామాలలో మొదటిది రన్నింగ్. రన్నింగ్ అనేది బాడీనీ ఫిట్ గా ఉంచే ఒక మంచి వర్క్ఔట్. రన్నింగ్ నీ మన డైలీ లైఫ్ […]

Share:

నేడు వేగవంతమైన జీవితంలో ఆరోగ్యంగా, శరీరాన్ని దృఢంగా ఉంచడకోవడం అనేది చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి సరైన పోషకాహారం అందించడం మరియు రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం ఎంతో అవసరం. వ్యాయామం చేయడం వలన  వివిధ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి చేసే వ్యాయామాలలో మొదటిది రన్నింగ్.

రన్నింగ్ అనేది బాడీనీ ఫిట్ గా ఉంచే ఒక మంచి వర్క్ఔట్. రన్నింగ్ నీ మన డైలీ లైఫ్ లో ఒక భాగంగా చేసుకోవడం అనేది చాలా మంచిది. రన్నింగ్ కీ డైలీ లైఫ్ లో కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా ఎముకలు మరియు కండరాలు దృడంగా ఉంటాయి.

ఎలా మొదలు పెట్టాలి? 

కొత్తగా రన్నింగ్ చేయడం ప్రారంభించిన వారు అనుకున్న సమయం కన్నా ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించండి, 5K రేస్లు లక్యంగా పెట్టుకోండి. రన్నింగ్  నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రతి నెల హాఫ్ మారథాన్‌లు లేదా మారథాన్‌లలో పాల్గొనండి. 

మీరు మీ శరీరాన్ని ఎక్కువగా ఒత్తిడికి గురికానివ్వొద్దు అది మీ కండరాలకు మరింత ప్రమాదాలని తెచ్చిపెడుతుంది. మీ శరీరం మీకు ఇచ్చే సంకేతాల ప్రకారం జాగ్రత్తలు వహించడం, మీ ఫిట్నెస్ స్థాయికి తగ్గట్టుగా రన్నింగ్ డిస్టెన్స్ నీ ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు రోజూ రన్నింగ్ తో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడంపై  దృష్టి పెట్టడం మరియు ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉండటం ఎంతో అవసరం. క్రమక్రమంగా స్టామినా పెంచుకోడం, పోస్ట్-రన్ స్ట్రెచ్‌లను చేయడం, మీరు తీసుకున్న శిక్షణ ప్రకారం రన్నింగ్ నిర్వహించడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ రన్నింగ్ లో విజయాలు సాదించవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు రన్నింగ్ చేసిన దానికి తగ్గట్టుగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇలా అంటున్నారు “డైలీ ఎవరైతే రన్నింగ్ చేస్తారో వాళ్ళ రోజువారి పనులు ఎంతో మెరుగ్గా మరియు వేగవంతంగా చేయడానికి ప్రయత్నిస్తారు. అన్ని విషయాల్లో చాలా ఓర్పుతో ఉంటారు మెంటల్ గా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారు. గోల్ నీ రీచ్ అవ్వాలని రన్నింగ్ చెయ్యడం కన్నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యడం చాలా మంచిది. రెగ్యులర్ గా రన్నింగ్ చేసెవారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. శరీర ప్రయోజనాలని పక్కన పెడితే, రన్నింగ్ అనేది మనిషిలో ఒత్తిడిని తగ్గించడానికి, మానసికంగా ఆరోగ్యంతో ఉండటానికి, వారి రొటీన్ లైఫ్ మెరుగ్గా మారడానికి, మానసిక స్పష్టతను పెంచడానికి ఉపయోగపడుతుంది.”

ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి

1.ప్రతీవారం రన్నింగ్ డిస్టెన్స్ పెంచుకోవడం : ప్రతీవారం మీ రన్నింగ్ మైలేజ్ నీ 10-20 శాతం పెంచుకోవడంగా లక్ష్యం పెట్టుకోండి. మీ రన్నింగ్ స్పీడ్ లో అటువంటి మార్పులు లేకుండా చూసుకోండి. మీ మైలేజ్ తక్కువగా ఉన్నప్పుడు మీ శరీరం కోలుకోవడంలో సహాయపడటానికి ‘డౌన్ వీక్స్’ షెడ్యూల్ చేసుకోండి. మీరు కనీసం వారానికి మూడు లేదా నాలుగు సార్లు రన్నింగ్ చెయ్యడం ద్వారా మీ మైలేజ్ పెరుగుతుంది. మీరు వారానికి నాలుగు కంటే ఎక్కువ రోజులు రన్నింగ్ చేస్తే అందులో కొన్ని రోజులైనా టాస్క్ లు పెట్టుకోవాలి. 

2.మంచి ఆహారాన్ని తీసుకోండి : మీ రన్నింగ్ నీ పెరుగుపరచడానికి ఖచ్చితంగా పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాల అవసరం. ఆరోగ్యకరమైన ఆహరం కోసం మీ భోజనంలో తాజా కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, వోట్స్ మరియు ఎనర్జీ బార్‌లు వంటివి ఎంచుకోండి. 

3.హైడ్రేటెడ్‌గా ఉండండి : మీరు రన్నింగ్ చేసినప్పుడు మీ శరీరం వాటర్ లెవెల్స్ నీ కోల్పోతుంది. మీరు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడానికి పుష్కలంగా నీరు అలాగే కొబ్బరి నీరు మరియు హెర్బల్ టీలు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవడం మంచిది.

4.మీ బాడీనీ స్ట్రెచింగ్ చేసుకోండి : ప్రతి వ్యాయామాన్ని వార్మప్‌తో ప్రారంభించి, కూల్‌డౌన్‌తో ముగించడం చాలా ముఖ్యం. రన్నింగ్ తర్వాత, మీ బాడీనీ స్ట్రెచ్ చేసుకోవడం వలన లాక్టిక్ యాసిడ్ పెరగకుండా ఉంటుంది, కండరాల నొప్పి, వాపు లాంటివి తగ్గుతాయి.

5.శిక్షణ తీసుకోండి : మీరు వేగంగా మరియు ఎక్కువ సేపు రన్నింగ్ చేయడానికి శిక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. రన్నింగ్ ఎలా చేయాలో అనే విషయంపై మీరు పూర్తీ అవగాహన కలిగి ఉండటం చాల అవసరం. రోజులు గడిచేకొద్దీ మీ రన్నింగ్ గోల్స్ నీ ఇంకా పెంచుకోండి.

6.తగినంత విశ్రాంతి తీసుకోండి : మీరు రన్నింగ్ చేసి అలిసిపోయిన తరువాత మీ శరీరానికి విశ్రాంతి మరియు నొప్పులని నయం చేసుకోవడానికి తగిన సమయాన్ని ఇవ్వండి. రన్నింగ్ తరువాత మీ శరీరం కోలుకోవడానికి నిద్ర, సరైన పోషకాహారాన్ని ఇవ్వండి. 

 7. లక్ష్యాల్ని పెట్టుకోండి : రన్నింగ్ చేసినప్పుడు మీరు గోల్స్ పెట్టుకోవడం వలన మీరు మానసికంగా ఎంతో చురుగ్గా మీ డైలీ వర్క్స్ లో ఎంతో ఆక్టివ్  ఉంటారు.