గుండె ఆరోగ్యంగా ఉండాలంటే…

ఈ మధ్య కాలంలో చాలా మందికి శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీంతో లేనిపోని రోగాలు వచ్చి హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. వైరస్‌ సోకిన వారు, కోలుకున్న తర్వాత పోస్ట్ కరోనా సింప్టప్స్‌ తో బాధపడుతున్నారు. కనీసం నెలలో ఒక్కసారైనా హాస్పిటల్‌ పాలవుతున్నారు. కరోనా తర్వాత మరీ ముఖ్యంగా హార్ట్‌ అటాక్‌ (కార్డియాటిక్ అరెస్ట్‌) మరణాలు  ఎక్కువయ్యాయి. పాత కాలంలో వయసు మీద పడిన వారికే హార్ట్‌ అటాక్‌లు వచ్చేవి. […]

Share:

ఈ మధ్య కాలంలో చాలా మందికి శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీంతో లేనిపోని రోగాలు వచ్చి హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. వైరస్‌ సోకిన వారు, కోలుకున్న తర్వాత పోస్ట్ కరోనా సింప్టప్స్‌ తో బాధపడుతున్నారు. కనీసం నెలలో ఒక్కసారైనా హాస్పిటల్‌ పాలవుతున్నారు. కరోనా తర్వాత మరీ ముఖ్యంగా హార్ట్‌ అటాక్‌ (కార్డియాటిక్ అరెస్ట్‌) మరణాలు  ఎక్కువయ్యాయి. పాత కాలంలో వయసు మీద పడిన వారికే హార్ట్‌ అటాక్‌లు వచ్చేవి. కానీ, ఇప్పుడు పది, ఇంటర్‌‌ చదువుతున్న స్టూడెంట్లకు మొదలు 60 ఏళ్లు పైబడిన వారు కూడా కార్డియాటిక్‌ అరెస్ట్‌ లకు గురవుతున్నారు. దీనికి కరోనా ఒక కారణం అయితే, మారిన జీవన శైలి కూడా మరో కారణం అని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో శరీరంలోని అత్యంత ముఖ్యమైన గుండెను కాపాడుకోవడంపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. దీని కోసం శారీరక శ్రమ అవసరం అని వైద్యులు పేర్కొంటున్నారు.  

డైలీ ఎక్సర్‌‌సైజ్‌ గుండె మేలు

రోజూ క్రమం తప్పకుండా వ్యామాయం చేయడం వల్ల గుండెకు మంచిదని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. కార్డియోవాస్కులర్‌‌ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవడం వల్ల గుండె కండరాలు బలపడతాయని, హార్ట్ పనితీరు మరింత సమర్థవంతంగా ఉంటుందన్నారు. ఫలితంగా శరీరంలోని అవయవాలు, గుండె కణజాలాలకు ఆక్సిజన్‌, పోషకాలు సరైన రీతిలో శరీరానికి అందుతాయి. వయసులో ఉన్నప్పుడు డైలీ ఎక్సర్‌‌సైజ్‌ చేయడంతో పాటు హెల్దీ ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. 

మెటబాలిజం మెరుగుపడుతుంది

సరైన శారీరక శ్రమ లేకపోవడంతో జీర్ణ ప్రక్రియ (మెటబాలిజం) మందగించడం వల్ల చాలా మంది బరువు రుగుతున్నారని ఆత్మాంతన్‌ వెల్‌నెస్‌ సెంటర్‌‌ సహా వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌‌ నిఖిల్‌ కపూర్‌‌ అన్నారు. ‘‘వ్యాయామం చేయడం వల్ల ఊబకాయం, గుండె సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ  వయసున్న ఉన్న పురుషులు వివిధ ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అయితే, సాధారణ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనను తగ్గించవచ్చు. పలు రకాల ఎక్సర్‌‌సైజ్‌ల వల్ల క్రమశిక్షణ అలవర్చుకోవడం, ఎనర్జీ గేయిన్‌ చేయడం, కండరాలు బలపడటం, ఎముకలు గట్టి పడతాయి” అని ఆయన పేర్కొన్నారు. 

గుండెను మర్చిపోతే ఎలా?

మనం మన శరీరంలోని ప్రతి కండరం బలంగా ఉండటానికి అవసరమైన అన్ని పనులు చేస్తామని, కానీ, బాడీలోని అతి పెద్ద కండరం అయిన గుండెను సంరక్షించడాన్ని మర్చిపోతుంటామని ఆరెంజ్‌ థియరీ ఫిట్‌నెస్‌ ఇండియా చీఫ్ ఎక్స్‌ పీరియన్స్‌ ఆఫీసర్‌‌ దృష్టి చబ్రియా అన్నారు. ‘మన గుండె కూడా ఒక కండరమే. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం బరువు తగ్గడంతో పాటు హెల్దీ కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గుండెకు చాలా మంచి చేస్తుంది. డైలీ లైఫ్‌లో ఎక్సర్‌‌సైజ్‌ను భాగం చేయడం ద్వారా గుండె కండరాలను బలంగా మార్చుకోవడంతో పాటు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలను మరింత రక్తం చేరి, హెల్దీగా తయారవుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది” అని దృష్టి తెలిపారు. 

ఎన్ని లాభాలో

డైలీ ఎక్సర్‌‌సైజ్‌లు చేయడం వల్ల రక్తపోటు (బీపీ) తగ్గించడం, పెరగకుండా కట్టడి చేస్తుందని దృష్టి పేర్కొన్నారు. అలాగే, ‘‘చెడు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ హెచ్‌డీఎల్‌ ను పెంచుతుంది. బరువు అదుపులో ఉంటుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. జీవనశైలి ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉంటుంది. దీని వల్ల డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెర, ఇన్సులిన్‌ స్థాయిలు నియంత్రించడంతో పాటు రక్తనాళాలు, గుండె పనితీరును మెరుగుపడేలా చేస్తుంది. దీని ద్వారా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది” అని దృష్టి చబ్రియా పేర్కొన్నారు. అలాగే, ‘‘అవరసమైన ఏరోబిక్ ఎక్సర్‌‌సైజ్‌లు చేయడం మంచి హార్ట్‌ బీట్‌ రేటు అదుపులో ఉంచడానికి సహాయ పడుతుంది. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించి ఎక్సర్‌‌సైజ్‌లు కూడా చేయాలి. కార్డియో ఎక్సర్‌‌సైజ్‌లకు ప్రాధాన్యత ఇస్తే మన గుండెను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మరోవైపు, శారీరక శ్రమ కూడా ముఖ్యం” అని దృష్టి వెల్లడించారు.