కొలెస్ట్రాల్ అదుపులో ఉంచే ఆహార పదార్థాలు

రోజువారి ఆహార పదార్థాలలో అనవసరమైన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ మన శరీరంలో తగ్గించేందుకు కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఈరోజు తెలుసుకుందాం.. పాలకూర: ముఖ్యంగా ఆకుకూరలు తినడం మన రోటిన్ లో ఒక భాగంగా చేస్తారు. బ్లడ్ తక్కువ ఉన్నవారు ఎక్కువగా ఆకుకూరలు తినడం వల్ల అందులో ఉన్న ఐరన్, బ్లడ్ ఎప్పుందించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు సంబంధించిన వ్యాధులను […]

Share:

రోజువారి ఆహార పదార్థాలలో అనవసరమైన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ మన శరీరంలో తగ్గించేందుకు కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఈరోజు తెలుసుకుందాం..

పాలకూర:

ముఖ్యంగా ఆకుకూరలు తినడం మన రోటిన్ లో ఒక భాగంగా చేస్తారు. బ్లడ్ తక్కువ ఉన్నవారు ఎక్కువగా ఆకుకూరలు తినడం వల్ల అందులో ఉన్న ఐరన్, బ్లడ్ ఎప్పుందించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర లో నైట్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ పాలకూర తినడం వల్ల అందులో ఉండే పోషకాలు రక్త ప్రసరణ జరిగేందుకు తోడ్పడతాయి. 

వెల్లుల్లిపాయ:

వెల్లుల్లిపాయలో సల్ఫర్ అనేది ఉంటుంది. అందులో ఉండే అలసిన్ కాంపౌండ్, మన శరీరంలోని రక్తప్రసరణ జరిగే నరాలను విశాలంగా ఉండేలా చేస్తుంది. ఈ క్రమంలోనే, ప్రతి ఒక్క శరీర అవయవానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా వెల్లుల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్ అనేవి గుండె సంబంధించిన ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది, ముఖ్యంగా కొలెస్ట్రాల్ ను దూరం చేసి, అనారోగ్య సమస్యలను నిర్మూలిస్తుంది. అందుకే వెల్లుల్లి తినడం కారణంగా గుండెకు సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. 

వాల్నట్: 

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అయితే ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్ అనేది ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ తో నిండి ఉండే ఒక మంచి ఆహార పదార్థం. ఇందులో ఉండే ప్రోటీన్.. ఫైబర్.. మెగ్నీషియం వంటివి మనకి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా నిరోధిస్తుంది. ఎక్కువగా తినకుండా ఉండేందుకు, అనవసరమైన కొలెస్ట్రాల్ నిలువలను తగ్గించడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా ఎక్కువ సేపు ఎనర్జిటిక్ గా ఉండడానికి కూడా వాల్నట్ సహాయపడుతుంది. 

యాపిల్: 

రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు అనే సామెత నిజమే. ఎందుకంటే ఇందులో ఉండే పాలిఫినోల్స్ అనేవి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అందుకే రోజు ఒక ఆపిల్ తినడం చాలా మంచి విషయం. 

తృణధాన్యాలు: 

తృణధాన్యాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తక్కువ చేయడమే కాకుండా, శరీరం మెదడు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. వోట్స్, బార్లీ వంటివి బీటా-గ్లూకాన్‌ను అందిస్తాయి, ఇది ‘చెడు’ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ప్రభావవంతమైన ఫైబర్.

గింజలు: 

చిక్కుళ్ళు, బీన్స్, ధాన్యాలు, అంతేకాకుండా చిక్‌పీస్ వంటివి ఈజీగా కరిగిపోయే ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు. కూరగాయలలో ప్రోటీన్‌స్ పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పాటు చేసి, కొలెస్ట్రాల్‌ను లాక్ చేసి మీ శరీరం నుండి దూరంగా ఉంచుతుంది. 

సబ్జా గింజలు: 

మీకు ఈ సబ్జా గింజల గురించి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ప్రతి సీజన్లో మనం తాగే వాటిలో తినే వాటిలో సబ్జా గింజలు ఉపయోగిస్తూనే ఉన్నాము. ఈ సబ్జా గింజలలో శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా ఇది త్వరగా జీర్ణం అవ్వడమే కాకుండా, కొలెస్ట్రాల్ నిలువలను బయటికి పంపించే ప్రక్రియలో సహాయపడుతుంది. అంతేకాదు రాత్రి పడుకునే ముందు మనం తీసుకునే ఆహారంలో గాని తాగే పానీయంలో గాని సబ్జా గింజలు వేసుకుంటే, అందులో ఉండే అమినో ఆసిడ్ మనకు చక్కని నిద్రను అందించడంలో కూడా సహాయపడుతుందట.