మీ చ‌ర్మాన్ని పాడుచేసే ఆహారాలు ఇవీ..!

చర్మానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో పోషకాహారం ఒక ముఖ్య పాత్రని పోషిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి. మీ చర్మం కనుక రోజు రోజుకి క్షీణిస్తున్నట్లు మీకు అనిపిస్తే వెంటనే తీసుకునే ఆహారాలు మార్చాలి. ఖచ్చితంగా కొన్ని ఆహారాలు తీసుకోవడం మూలానే ఇలా జరుగుతుంది. కావున మీరు వెంటనే ఆహారాలను మార్చాలి. ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ఒకరు సోషల్ మీడియా ద్వారా మనం ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో వివరించారు. కొన్ని రకాల ఆహారాలు తరచుగా ఆక్సీకరణ ఒత్తిడి, […]

Share:

చర్మానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో పోషకాహారం ఒక ముఖ్య పాత్రని పోషిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి. మీ చర్మం కనుక రోజు రోజుకి క్షీణిస్తున్నట్లు మీకు అనిపిస్తే వెంటనే తీసుకునే ఆహారాలు మార్చాలి. ఖచ్చితంగా కొన్ని ఆహారాలు తీసుకోవడం మూలానే ఇలా జరుగుతుంది. కావున మీరు వెంటనే ఆహారాలను మార్చాలి. ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ఒకరు సోషల్ మీడియా ద్వారా మనం ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో వివరించారు. కొన్ని రకాల ఆహారాలు తరచుగా ఆక్సీకరణ ఒత్తిడి, వాపు మరియు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, కావున వాటికి మనం దూరంగా ఉండాలని ఆ న్యూట్రీషనిస్ట్ తెలిపింది. వాటి ప్రభావాల కారణంగా వయసు పెరిగిపోయినట్టు కనిపిస్తుందని, ఈ ప్రభావాలు జన్యుశాస్త్రం మరియు జీవనశైలితో సహా వివిధ కారకాలతో ప్రభావితమవుతాయని కూడా న్యూట్రీషనిస్ట్ పేర్కొంది. మీ చ‌ర్మాన్ని ముస‌లిత‌నంగా మార్చేసే కొన్ని ఆహారాల‌ను చూద్దాం.

ఈ ఆహారాలను తక్కువగా తీసుకోండి..

మనం యంగ్ గా కనిపించేందుకు ఎటువంటి ఆహారాలను తీసుకోకూడనే విషయంలో ఒక్కోరు ఒక్కోలా సజెస్ట్ చేస్తుంటారు. వాళ్లు చెప్పారు వీళ్లు చెప్పారని కాకుండా.. న్యూట్రీషనిస్ట్ చెప్పిన విషయాలను పాటిస్తేనే మంచిది. 

షుగర్

ఎక్కువగా షుగర్ ని వాడడం వల్ల ప్రమాదకరమైనటువంటి కాంపౌండ్స్ ఏజెస్ లాంటివి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. దాని వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అలాగే టిష్యూ డామేజ్ పెరిగి మన మొహం వాలిపోయినట్లు కనిపిస్తుంది. అందుకే షుగర్ మరియు షుగర్ తో తయారైన పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. 

చీజ్

ఎక్కువ కాలం నిల్వ చేసినటువంటి చీజ్ లో శ్యాచురేటేడ్ ఫ్యాట్స్ అలాగే సోడియం కలిగి ఉంటాయి. ఇవి వాపు మరియు హృదయ రోగ సంబంధిత సమస్యలను కలుగజేస్తాయి. అంతే కాకుండా వృద్దాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు త్వరగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకోసం చీజ్ ను ఎక్కువ కాలం స్టోర్ చేసి తీసుకోవడం మానేయాలి. లేకపోతే అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

కూల్ డ్రింక్స్

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. బయట ఎండకు ఉన్నా కానీ ఉపశమనం కోసం కూల్ డ్రింక్స్ సేవిస్తున్నారు. వీటిలో షుగర్ ఉన్న సోడాలు, ఎనర్జీ డ్రింకులు, మొదలయినవి ఉంటున్నాయి. ఈ డ్రింక్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరగడానికి అలాగే గ్లైకేషన్‌కు ఈజీగా దారి తీస్తుంది. దానితో పాటుగా వయసు పెరగకుండానే వృద్దాప్యంలో వచ్చే సమస్యలు కూడా మన మీద దాడి చేస్తాయి. అందుకోసమే షుగర్ కంటెంట్ ఉండే కూల్ డ్రింక్స్ ను తీసుకోవడం మానేయాలి.

సాసెస్

మారిన లైఫ్ స్టైల్ ను అనుసరించి ప్రతి ఒక్కరూ సాసెస్ తింటున్నారు. మనం బేకరీ ఐటెమ్స్ తిన్నా లేక డెయిరీ ఐటెమ్స్ తిన్నా కానీ అందులో సాసెస్ ఉంటున్నాయి. కొన్ని సాస్ లలో అనారోగ్యకరమైనటువంటి ఫ్యాట్లు, షుగర్ లు, అలాగే కొన్ని అడిటివ్స్ ఉంటాయి. వీటి వల్ల వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు వృద్దాప్య సమస్యలు వస్తూ ఉంటాయి.

బేక్ చేసిన ఆహారాలు

బేకరీ ఐటెమ్స్ ను ఎక్కువగా బేక్ చేయాల్సి ఉంటుంది. కేవలం బేకరీ ఐటెమ్స్ అని మాత్రమే కాకుండా చాలా పదార్థాలను బేక్ చేస్తున్నారు. బేక్ చేసిన ఆహారాలలో ఉండే పిండి పదార్ధాలు, షుగర్, అలాగే అనారోగ్యకరమైన ఫ్యాట్ల ద్వారా వాపు, బరువు పెరగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా వృద్దాప్య సమస్యలకు ఇవి దారి తీస్తాయి. 

ఈ విషయం గుర్తుంచుకోవాలి..

ఇక్కడ మనం ఒక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా లేదా మనకు వృద్దాప్య సమస్యలు ముందుగానే రాకుండా ఉండాలన్నా కానీ సమతుల డైట్ తప్పనిసరిగా పాటించాలి. అలాగే మనం తినే ఆహారం విషయంలో నియంత్రణ అనేది చాలా అవసరం. మనం కనుక కంట్రోల్ లో ఉండి ఆహారం తీసుకుంటే మన వయసు పెరుగుతున్నా కానీ మనం ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నియంత్రించవచ్చు.