లెన్స్ పెట్టుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిస్టం ముందు వర్క్ చేసేవారు. ముఖ్యంగా 10 మందిలో ఆరుగురు ఐ సైట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వారే. అయితే గ్లాసెస్ కి బదులు చాలా మంది సులభంగా ఉండేందుకు కాంటాక్ట్ లెన్స్ అనేది ప్రత్యేకించి ఉపయోగిస్తూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు కంఫర్ట్ చూసుకున్న వారు ముఖ్యంగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తూ ఉంటారు కదా. అయితే కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం..  […]

Share:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిస్టం ముందు వర్క్ చేసేవారు. ముఖ్యంగా 10 మందిలో ఆరుగురు ఐ సైట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వారే. అయితే గ్లాసెస్ కి బదులు చాలా మంది సులభంగా ఉండేందుకు కాంటాక్ట్ లెన్స్ అనేది ప్రత్యేకించి ఉపయోగిస్తూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు కంఫర్ట్ చూసుకున్న వారు ముఖ్యంగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తూ ఉంటారు కదా. అయితే కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.. 

చాలా జాగ్రత్తగా ఉండాలి: 

ఎవరైతే కాంటాక్ట్ లెన్స్ అనేవి ఉపయోగిస్తున్నారో వాళ్ళు చాలా మంచి కేర్ తీసుకోవాలి, లేదంటే మరి ఎక్కువ అవస్థపడే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మైక్రోబైల్ ఇన్ఫెక్షన్స్, కొరియర్ అల్సర్, ఇన్ఫెక్షన్స్, ఐ బ్లాక్, అంతేకాకుండా బ్లైండ్ వచ్చే అవకాశం లేకపోలేదు. కాంటాక్ట్ లెన్స్ అనేవి కేవలం కొద్ది రోజుల పరిమితి వరకే యూస్ చేయాలని ఉంటుంది. అంతకుమించి వాడితే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు. అయితే ఈ రేంజ్ వీక్లీ ఉండొచ్చు, మంత్లీ ఉండొచ్చు, లేదంటే ఇయర్లీ కూడా ఉండొచ్చు. అంటే వీక్ కి ఒకసారి మాత్రమే ఆ లెన్స్ యూస్ చేయాలి. లేదంటే ఒక మంత్ తర్వాత మార్చుకోవాలి, లేదంటే ఒక సంవత్సరం తర్వాత లెన్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కొన్ని సమయపరిమితులతో కాంటాక్ట్ లెన్స్ అనేవి ఉపయోగిస్తూ ఉండాలి. ఇంకా ఎంతసేపు కాంటాక్ట్ లెన్స్ యూస్ చేస్తున్నామని దాన్ని బట్టి కూడా మనం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలట. అంటే సుమారు ఎనిమిది గంటలు సమయం మాత్రమే రోజులో మనం కాంటాక్ట్ లెన్స్ యూస్ చేయడం జరగాలి. అంతకుమించి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే కొంతవరకు రిస్క్ అయితే ఉంటుందంటున్నారు. 

శ్రద్ధ లేకపోతే ముప్పు తప్పదు: 

ప్రతి సంవత్సరం కాంటాక్ట్ లెన్స్ యూస్ చేస్తున్న వారిలో కనీసం ఐదు శాతం మంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఐదు శాతం మంది ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అంటే, దానికి ఖచ్చితమైన కారణం కేవలం మనం పెట్టుకునే లెన్స్ కేర్ సరిగ్గా తీసుకోకపోవడం మాత్రమే. కాంటాక్ట్స్ అనేది మనం రోజువారి ప్రాపర్ గా యూస్ చేయడం రాకపోతే, అశ్రద్ధ చేస్తే గనక బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి లెన్స్ లో చేరి మన కంటూ చూపును దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. ఇదే విధంగా చాలా మంది కంటి చూపు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. 

ఇలా లెన్స్ జాగ్రత్తగా చూసుకోండి: 

1. రోజువారి కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్న వారు ఖచ్చితంగా ఒక టైమింగ్ పెట్టుకోవాలి. 

2. ముఖ్యంగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్నప్పుడు, రాత్రి సమయంలో మనం కాంటాక్ట్ లెన్స్ తీసి నిద్రపోవాలని సంగతి మర్చిపోకూడదు. అంటే నిద్రపోతున్నప్పుడు కాంటాక్ట్ లెన్స్ తీసి నిద్రపోవాలని సంగతి మనం గుర్తుంచుకోవాలి లేదంటే కంటి చూపుకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 

3. లెన్స్ ఓవర్ యూస్ మనం తప్పకుండా నిరోధించవలసిన విషయం. ప్రత్యేకించి రోజులో సగటుకు ఎనిమిది గంటలు మాత్రమే లెన్స్ ఉపయోగించేలా మనం చూసుకోవాలి. మిగిలిన గంటలు మనం గ్లాసెస్ పెట్టుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. అంటే కాంటాక్ట్ లెన్స్ ఓవర్ ఎక్కువ సమయం వాడటానికి మనం మక్కువ చూపించకూడదు. ఎక్కువసేపు వాడడం వల్ల నష్టాలు తప్పిస్తే లాభం ఉండదు. 

4. మనం లెన్స్ రెన్యువల్ చేయించుకోవడం తప్పనిసరి. వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ఇలా మూడు విడతలుగా మన కాంటాక్ట్ లెన్స్ అనేది తప్పనిసరిగా మార్చుకుంటూ ఉండాలి. సంవత్సరాల తరబడి ఓకే కాంటాక్ట్ లెన్స్ యూస్ చేయడం నిజంగా కంటి చూపుకి ముప్పు అంటున్నారు నిపుణులు.