uterine cancer: FDA బ్యాన్ చేయనున్న హెయిర్ స్ట్రైట్నింగ్ ఉత్పత్తులు

ప్రతి ఒక్కరూ తమ జుట్టు సంరక్షణ కోసం ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మగవారు అలాగే ఆడవారు ఇద్దరు కూడా తమ జుట్టు సంరక్షణ కోసం ఎన్నో పాటిస్తూ ఉంటారు.  అయితే ప్రస్తుతం ప్రజలు కోరుకునే విధంగా, కెమికల్స్ అలాగే టాక్సిక్స్ లేకుండా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ మాక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రొడక్ట్స్ (hair-straightening products) ను బ్యాన్ (Ban) చేసేందుకు ప్రతిపాదించింది FDA. మరి […]

Share:

ప్రతి ఒక్కరూ తమ జుట్టు సంరక్షణ కోసం ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మగవారు అలాగే ఆడవారు ఇద్దరు కూడా తమ జుట్టు సంరక్షణ కోసం ఎన్నో పాటిస్తూ ఉంటారు.  అయితే ప్రస్తుతం ప్రజలు కోరుకునే విధంగా, కెమికల్స్ అలాగే టాక్సిక్స్ లేకుండా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ మాక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రొడక్ట్స్ (hair-straightening products) ను బ్యాన్ (Ban) చేసేందుకు ప్రతిపాదించింది FDA. మరి ముఖ్యంగా,హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రొడక్ట్స్ (hair-straightening products) గర్భాశయ క్యాన్సర్ (uterine cancer) కి దారితీస్తున్నట్లు తేలింది.

FDA బ్యాన్ చేయనున్న హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రొడక్ట్స్: 

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఫార్మాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ రసాయనా (Chemicals)లను విడుదల చేసే హెయిర్ స్మూతింగ్, హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఉత్పత్తు (Products)లను నిషేధించాలని ప్రతిపాదించింది, వీటిని రిలాక్స్ర్స్ అని కూడా పిలుస్తారు. చేసిన కొన్ని రీసెర్చ్ ప్రకారం, సాధారణంగా మందులు మరియు సౌందర్య సాధనాలలో ఉపయోగించే ఫార్మాల్డిహైడ్ అత్యంత ప్రమాదకరమైనదే కాకుండా అవి గర్భాశయ క్యాన్సర్ (uterine cancer)‌తో సహా అనేక రకాల క్యాన్సర్‌లకు కారకాలని తేలింది. ఇటువంటి రసాయనా (Chemicals)లు ఉన్న ఉత్పత్తు (Products)లను పదే పదే వాడడం వల్ల అనేక చర్మ మరియు కంటి సమస్యలకు కారణం కావచ్చు. అందుకే ఇటువంటి హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రొడక్ట్స్ (hair-straightening products) ను బ్యాన్ (Ban) చేయాలని ప్రతిపాదించింది FDA. 

అయితే చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం, ఆడవాళ్లు ఎవరైతే కెమికల్స్ ఎక్కువగా ఉన్న హెయిర్ స్ట్రైట్నింగ్ ఉత్పత్తు (Products)లను వాడతారో, వారిలో గర్భాశయ క్యాన్సర్ (uterine cancer) రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మరి ముఖ్యంగా ఒక స్టడీ ప్రకారం, కొంతమంది మహిళలను తాము ఉపయోగిస్తున్న హెయిర్ డైస్, స్ట్రైట్నర్లు (hair-straightening products), మరికొన్ని ఉత్పత్తు (Products)ల గురించి ఆరా తీయడం జరిగింది. అయితే ఎవరైతే కెమికల్స్ ఉన్న హెయిర్ స్ట్రైట్నింగ్ ఉత్పత్తు (Products)లను వాడారో, వారిలో క్యాన్సర్ రిస్క్ రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఆఫ్రికన్ మహిళలు ఎక్కువగా హెయిర్ స్ట్రైట్నింగ్ ఉత్పత్తు (Products)లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా హెయిర్ స్ట్రైట్నింగ్ ఉత్పత్తు (Products)లు వాడేవారికి నిజానికి 4.05 శాతం మందికి, 70 సంవత్సరాల వయసు కన్నా ముందే గర్భాశయ క్యాన్సర్ (uterine cancer) వచ్చే రిస్క్ ఉన్నట్లు తేలింది.

గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి?: 

గర్భాశయ క్యాన్సర్ (uterine cancer), ప్రత్యేకంగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని పిలుస్తారు, ఇది గర్భాశయంలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్, గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధి చెందే ప్రదేశమే గర్భాశయం. ఊబకాయం లేదా మారుతున్న జీవనశైలి, PCOS వంటి కొన్ని రుగ్మతలు, ఆలస్యంగా పీరియడ్స్ అవడం, ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనా (Chemicals)లకు గురికావడం వంటి కారకాల వల్ల గర్భాశయ క్యాన్సర్ (uterine cancer) వచ్చే అవకాశం ఉంటుంది. 

భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ (uterine cancer) ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది, ఇది ప్రధానంగా జీవనశైలి, స్థూలకాయం ,శారీరక శ్రమ లేకపోవడం, మహిళల్లో పీరియడ్స్ అవకుండా మెడిసిన్స్ వాడడం, వంటివి ముఖ్య కారణాలు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, ఈస్ట్రోజెన్ థెరపీ, టామోక్సిఫెన్ థెరపీ, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పిల్లలు లేకపోవడం, వారసత్వ పరిస్థితులు వంటి అనేక కారణాలు గర్భాశయ క్యాన్సర్ (uterine cancer)‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి. 

అందువల్ల, హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఉత్పత్తు (Products)ల కారణంగా సంభవించే ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకోవడం మరియు వీలైతే వాటి వినియోగాన్ని తగ్గించడం, నివారించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, మహిళలలో అసాధారణ యోని రక్తస్రావం, పెల్విక్ నొప్పి లేదా ఒత్తిడి వంటివి గర్భాశయ క్యాన్సర్ (uterine cancer) సంకేతాలు. కాబట్టి ఇలాంటివి ఏవైనా సంకేతాలు కనిపిస్తే కనుక వైద్యుడిని సంప్రదించడం ఎంతో ఉత్తమం.

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.