ఫ్యాటీ లివర్ డైట్ చార్ట్, ఏమి తినాలి, ఏమి తినకూడదు

ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు.. అది ఎలా వస్తుందిదానిని నివారించే మార్గాల గురించి తెలుసుకోండి ఫ్యాటీ లివర్ అంటే ఏమిటే, ఆ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎలా వస్తుంది, మరి దానిని నివారించాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.  కాలేయం మన శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది మన రక్తంలోని రసాయనాల మొత్తాన్ని సమతుల్యం చేస్తుంది. అయితే ఫ్యాటీ లివర్ అనేది కాలేయ పనితీరును ప్రభావితం చేసే తీవ్రమైన కాలేయ సమస్య. ఫ్యాటీ లివర్ […]

Share:

ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు.. అది ఎలా వస్తుంది
దానిని నివారించే మార్గాల గురించి తెలుసుకోండి

ఫ్యాటీ లివర్ అంటే ఏమిటే, ఆ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎలా వస్తుంది, మరి దానిని నివారించాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం. 

కాలేయం మన శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది మన రక్తంలోని రసాయనాల మొత్తాన్ని సమతుల్యం చేస్తుంది. అయితే ఫ్యాటీ లివర్ అనేది కాలేయ పనితీరును ప్రభావితం చేసే తీవ్రమైన కాలేయ సమస్య. ఫ్యాటీ లివర్ వ్యాధి కాలేయంలో ఎక్కువ కొవ్వు పేరుకు పోవడం వల్ల వస్తుంది. దీనికి ప్రధాన కారణాలు మద్యం సేవించడం, అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారం తీసుకోవడం మొదలైనవి. దీని వల్ల కడుపు నొప్పి, ఆకలి లేక పోవడం, అలసట, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, సులభంగా గాయాలు తగ్గకపోవడం, రక్తస్రావం కావడం లాంటి అనేక సమస్యలకు దారి తీయవచ్చు. ఫ్యాటీ లివర్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే దీనిని చాలా సీరియస్‌గా తీసుకుని తగ్గించుకోవాలి.
ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవడానికి మంచి డైట్ తీసుకోవడం, ఆల్కహాల్ మానేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యకరమైన కాలేయం, జీవనశైలి కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లు:
పండ్లు కేవలం రుచికరమైనవే కాకుండా వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించి.. లివర్ పనితీరును మెరుగుపరిచడంలో పండ్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ద్రాక్ష, అవకాడో, బ్లూబెర్రీస్, క్రాన్‌బెర్రీస్, అరటిపండ్లు, బొప్పాయిలు, యాపిల్స్, పుచ్చకాయలు మొదలైన పండ్లను ఆహారంలో సమృద్ధిగా చేర్చుకోవడం వల్ల కాలేయాన్ని డీటాక్సిఫై చేసుకోవచ్చు.

కూరగాయలు:

ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వ్యక్తి ఆహారంలో బ్రోకలీ, బఠానీలు, చిలగడదుంపలు, సోయాబీన్స్, సోయా ఉత్పత్తులు, బీన్స్, కాలీఫ్లవర్లు, వెల్లుల్లి, టమోటాలు,  బచ్చలికూర, ఇతర ఆకుకూరలు కచ్చితంగా ఉండాలి. వీటిలో ఫైబర్స్, ఇతర ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వు నిల్వలను తొలగించి, దాని సాధారణ పనితీరును పునరుద్ధరించడంలో సహాయపడతాయి.

కాఫీ మరియు గ్రీన్ టీ:

కాఫీ అనేది రోజు గడవడానికి మీకు సహాయం చేయడమే కాదు. ఇందులో పారాక్సంథైన్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఈ రసాయనం ఫ్యాటీ లివర్ ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా శరీర జీవక్రియ పెంచడంలో గ్రీన్ టీకి సాటి మరొకటి లేదు. గ్రీన్ టీలోని లక్షణాలు కాలేయంలో కొవ్వు నిల్వలను కరిగించేస్థాయి. కాబట్టి ఈ రెండింటిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి.

గింజలు:

గింజలలో పోషక విలువలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా కాలేయ వ్యాధులను కూడా నివారిస్తాయి. వాల్‌నట్స్, ట్రీ నట్స్, వేరుశెనగ, బాదం, హాజెల్ నట్స్ మొదలైనవి కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన శరీరం కోసం వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఫ్యాటీ లివర్ వ్యాధి దీర్ఘకాలికంగా అనేక సమస్యలను కలిగిస్తుంది. ముందుగానే దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే కాలేయ వైఫల్యానికి దారితీయవచ్చు. అందువల్ల చక్కటి జీవనశైలి కోసం మనమందరం సహజమైన నివారణ పద్ధతులను ఎంచుకోవాలి.

తెలిసిందిగా.. ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు.. అది ఎలా వస్తుంది, దాన్ని ఏ విధంగా నివారించాలో, అయితే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చెయ్యండి, వారికి ఉపయోగపడవచ్చు.