రిలేష‌న్‌షిప్‌లో మాన‌సికంగా కుంగిపోతున్నారా?

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మన పార్ట్నర్ తో మనం ఎలా ఉంటున్నాం అనేదాన్ని బట్టి ఒక హెల్తీ రిలేషన్ అనేది బలపడుతుంది కదా. ఈ రిలేషన్ షిప్ లో ముఖ్యంగా ఇరువైపుల నుంచి కూడా ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్ ఉండాల్సి ఉంటుంది. చాలా విషయాలు మన రిలేషన్షిప్ హెల్తీగా ఉండడానికి.. పదిలంగా ఉంచేందుకు, సంతోషంగా, ఎల్లప్పటికీ ఒకేలా ఉండటానికి తోడ్పడతాయి, అయితే ఇప్పుడు రిలేషన్షిప్ అనే బంధాలు ముఖ్యంగా మెంటలీగా కాకుండా ఫిజికల్ గా కూడా […]

Share:

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మన పార్ట్నర్ తో మనం ఎలా ఉంటున్నాం అనేదాన్ని బట్టి ఒక హెల్తీ రిలేషన్ అనేది బలపడుతుంది కదా. ఈ రిలేషన్ షిప్ లో ముఖ్యంగా ఇరువైపుల నుంచి కూడా ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్ ఉండాల్సి ఉంటుంది. చాలా విషయాలు మన రిలేషన్షిప్ హెల్తీగా ఉండడానికి.. పదిలంగా ఉంచేందుకు, సంతోషంగా, ఎల్లప్పటికీ ఒకేలా ఉండటానికి తోడ్పడతాయి, అయితే ఇప్పుడు రిలేషన్షిప్ అనే బంధాలు ముఖ్యంగా మెంటలీగా కాకుండా ఫిజికల్ గా కూడా ఇంపాక్ట్ ఉంటాయంటున్నారు నిపుణులు. రిలేషన్ షిప్ లో ఉంటున్న వారికి కొన్ని ముఖ్యమైన అంశాల కారణంగా సగటు మనిషి తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.. 

నేనే కరెక్ట్: 

రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఈ అంశమైతే తప్పకుండా వస్తుంది. ఒక విషయంలో తాము కరెక్ట్ అంటే, కాదు నేనే కరెక్ట్, అనే ఉద్దేశం వ్యక్తపరుస్తూ ఉంటాం. అయితే, ఏ విషయంలో అయినా ఒకరు తప్పు అవచ్చు, ఒకరు ఓప్పు అవ్వచ్చు. కానీ ఒక్కోసారి తాము తప్పు చేస్తున్నాం అని ఒప్పుకోవడానికి నిరాకరించడం, కేవలం తాము చేసింది మాత్రమే కరెక్ట్ అంటూ వాదించడం.. రిలేషన్షిప్ లో ఉన్న పార్ట్నర్స్ మధ్య ఎక్కువగా జరిగే అంశం ఇది. అంతేకాకుండా తాము కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నెన్నో మార్గాలు, సాక్ష్యాలు వెతకడం ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా, పార్ట్నర్స్ మధ్య బంధం బలహీన పడడమే కాకుండా, సగటు మనిషి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. తాము కరక్ట్ అంటే తాము కరెక్ట్ అని వాదించుకునే బదులు సర్దుకుపోతూ, నువ్వు చేసిందే కరెక్ట్ అంటూ ఒప్పుకోవడం బెటర్. 

గతాన్ని తవ్వడం: 

ఒకచోట కలిసి ఉంటున్న క్రమంలో గతాన్ని తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్న పార్ట్నర్స్ మధ్య తప్పకుండా గతం గురించిన సంభాషణ ఉంటూనే ఉంటుంది. అయితే గతంలో నువ్వు అలా చేసావు.. ఇలా చేసావు, నువ్వు ఈ తప్పు చేశావు, నువ్వు ఇలా చేసిన మూలంగానే ఇప్పుడు ఇలా జరిగింది, అని ఒకరి మీద ఒకరు లేనిపోని విషయాలు మాట్లాడుకుంటూ, గతాన్ని తవ్వుతూ, పదేపదే కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ, మానసికంగానే కాకుండా, శారీరిక ఎనర్జీని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గతాన్ని తవ్వడం మానేసి ప్రస్తుతం లో జీవిస్తూ ఆనందంగా బ్రతకడం ఎంతో ఉత్తమం. 

అలగడం: 

చాలామంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం అలగడం వంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్న విషయాలు పర్సనల్గా తీసుకొని, తమలో తామే అయ్యిందానికన్నా ఎక్కువగా ఊహించుకుని, సతమతమైపోతూ ఉంటారు. అంతేకాకుండా అలగడంతో పాటుగా ఎదుట మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే చిన్న విషయాలను పర్సనల్గా తీసుకొని ఫీల్ అవ్వడం కంటే, ఆ విషయాల గురించి నేరుగా మాట్లాడి క్లారిఫై చేసుకోవడం ఎంతో ఉత్తమం. దీనివల్ల టైం వేస్ట్ అవ్వడమే కాకుండా, హ్యాపీ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళం అవుతాము. 

ఒకరి ఆనందం కోసం మీరు బాధపడకూడదు: 

అయితే చాలామంది రిలేషన్షిప్ లో ఉన్న పార్ట్నర్స్ మధ్య జరిగేది ఇది. తన పార్ట్నర్ని సంతోషపెట్టడానికి పదే పదే ట్రై చేస్తూ ఉన్నప్పటికీ, మరోవైపు తాను మాత్రం బాధపడుతూ ఉంటారు. ఈ విషయాలు కారణంగా కూడా, ఒకరు తమ మనసులో మానసికంగా బాధపడటమే కాకుండా, ఎదుట వారి కోసం తమ ఎనర్జీని ఇంకాస్త త్యాగం చేస్తున్న వారం అవుతారు. కాబట్టి రిలేషన్ లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అంశాలలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.