వర్షాకాలంలో వచ్చే కళ్ళకలక నుంచి తప్పించుకుందాం

వర్షాకాలం మండలాయింది అంటే చాలు, ఎన్నో అంటూ వ్యాధులు మన చుట్టూ చేరి మనల్ని కలవర పెడుతూ ఉంటాయి కదా. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా ఎన్నో వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియా కారణంగా కళ్ళకలక వచ్చే అవకాశం లేకపోలేదు.  కళ్ళకలక ఎందుకు వస్తుంది:  ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ఒక అంటూ వ్యాధి లాంటిది. కానీ ఈ మూలం విషయానికి వస్తే, వర్షాకాలంలో ఎక్కువగా వర్షపు నీరు కలుషితం అవుతూ ఉంటుంది. ఆ నీరు […]

Share:

వర్షాకాలం మండలాయింది అంటే చాలు, ఎన్నో అంటూ వ్యాధులు మన చుట్టూ చేరి మనల్ని కలవర పెడుతూ ఉంటాయి కదా. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా ఎన్నో వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియా కారణంగా కళ్ళకలక వచ్చే అవకాశం లేకపోలేదు. 

కళ్ళకలక ఎందుకు వస్తుంది: 

ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ఒక అంటూ వ్యాధి లాంటిది. కానీ ఈ మూలం విషయానికి వస్తే, వర్షాకాలంలో ఎక్కువగా వర్షపు నీరు కలుషితం అవుతూ ఉంటుంది. ఆ నీరు మన చేతులకు అంటుకున్న తర్వాత మన చేతులు కంట్లో పెట్టుకున్న వెంటనే ఇన్ఫెక్షన్ అనేది మొదలవుతుంది. కలుషిత నీరులో ఉండే బ్యాక్టీరియా మరియు వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే మన కళ్ళు సురక్షితంగా ఉంచుకోవడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కలుషిత నీరు మన దరిదాపుల్లో ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. 

అయితే ఇలాంటి వ్యాధుల భారీ పడకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం: 

1. పరిశుభ్రత ముఖ్యం: 

ఇలాంటి అంటూ వ్యాధుల సంక్రమనకు ముఖ్య కారణాలు అశుభ్రత కాబట్టి మనం ఎల్లప్పుడూ స్వీయ పరిశుభ్రత పాటించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మనం బయటికి వెళ్లి వచ్చినప్పుడు ఇంట్లో ఏవైనా వస్తువుల్ని ముట్టుకున్నప్పుడు తరచుగా మన చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనం ఎక్కువగా మన చేతుల్ని కళ్ళల్లోకి పెట్టకుండా ఉంచుకోగలగాలి. ఎందుకంటే ఒకవేళ మన చేతులకు ఏదైనా బ్యాక్టీరియా ఉన్నప్పటికీ మన కళ్ళల్లోకి వెళ్ళకుండా ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ స్వీయ పరిశుభ్రత ఎంతో ముఖ్యం. 

2. ముఖం అదేవిధంగా కళ్ళు ముట్టుకోకండి: 

మనలో చాలామందికి ఉన్న అలవాటే ఇది. మనం పని చేస్తున్నప్పుడు గాని, వంట చేస్తున్నప్పుడు గాని, ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు గాని ఇలా చాలాసార్లు మనం మనకి తెలియకుండానే మన చేతుల్లో మన ముఖం మీద అలాగే మన కళ్ళల్లో పెడుతూ ఉంటాం. ఇలాంటి అలవాటు మనం మానుకోగలగాలి. ఎందుకంటే మనం ముఖం మన కళ్ళు మన శరీరంలో చాలా సెన్సిటివ్. మనం పనులు చేతిలో చేసిన తర్వాత ఆ చేతులు మనం ముఖం మీద పెట్టుకోవడం ద్వారా కూడా బ్యాక్టీరియా అలాగే వైరస్ అనేవి కళ్ళల్లోకి వెళ్లి అవకాశం ఉంది. దాని ద్వారా కూడా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అలవాటు మానుకోగలగాలి. 

3. పరిసరాలు శుభ్రంగా ఉండాలి: 

మనం ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాలు శుభ్రంగా లేకపోతే అది వ్యర్థమే కదా. ముఖ్యంగా వర్షాకాలంలో బ్యాక్టీరియా వైరస్ వంటివి ఇళ్లల్లోకి ఈజీగా ప్రవేశిస్తాయి. అయితే బ్యాక్టీరియా వైరస్లు ఇంట్లో ఉండకుండా ఉండాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోని నిలువ ఉన్న నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. 

4. గ్లాసెస్ పెట్టుకోండి: 

మనం బయటికి వెళ్లినప్పుడు బయట పొల్యూషన్, బ్యాక్టీరియా, వైరస్ లో మన కళ్ళల్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే, మనం తప్పకుండా కళ్ళజోడు పెట్టుకుని వెళ్లడం మంచిది. సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకోవడం వల్ల మన కళ్ళకు హాని కలిగించే బ్యాక్టీరియాలు సంక్రమించకుండా నిరోధించగలుగుతాం. వర్షాకాలంలో బ్యాక్టీరియా సంక్రమణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కాస్త ఇలాంటివి పాటించడం తప్పనిసరి చేసుకోండి. 

5. ఎక్స్పైరీ డేట్ చూసుకోండి: 

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సిస్టం ముందు కూర్చుని గంటల తరబడి పని చేయడం ద్వారా పని ఒత్తిడి కారణంగా కళ్ళు స్ట్రెస్ అవుతున్నాయని కళ్ళకు సంబంధించిన డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఒక్కసారి దాని ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోయినప్పటికీ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. కానీ కల విషయంలో ఎలాంటి పొరపాటు చేయడం చాలా తప్పు. అందుకనే మనం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కళ్ళ డ్రాప్స్ వాడడం ద్వారా కూడా కళ్ళకు హాని కలిగే అవకాశం ఉంటుంది. 

6. ఇలాంటివి తప్పనిసరి: 

మనం కొన్ని కొన్ని ఐటమ్స్ ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటాము. కళ్ళజోడు, ఐ డ్రాప్స్, కాస్మెటిక్స్, టవల్స్, ఇలా మరెన్నో ఉంటాయి. అయితే ముఖ్యంగా వర్షాకాలంలో ఇటువంటి వస్తువులు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల, ముఖ్యంగా వారి ద్వారా బ్యాక్టీరియా అనేది మనకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. కళ్ళు చాలా సెన్సిటివ్ కాబట్టి, కళ్లకు సంబంధించిన బ్యాక్టీరియా మరింత త్వరగా ఒకరి నుంచి మరొకరికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వర్షాకాలంలో ఇలాంటివి తప్పని సరి చేసుకోండి.