మైగ్రేన్ నొప్పిని తగ్గించే పద్ధతులు ఇవే

మైగ్రేన్ ఒక రకంగా తీవ్రమైన తలనొప్పి. మైగ్రేన్ వచ్చిన వారు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, రోజు ఎలా గడుస్తుందో కూడా వారికి తెలియని పరిస్థితుల్లో ఉంటారు. వచ్చినవారు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మైగ్రేన్ నొప్పి ఎలా తగ్గించుకోవాలో, నిపుణులు సూచిస్తున్న టెక్నిక్స్ ఏమిటో చూద్దాం.. మైగ్రేన్ వస్తే ప్రమాదమా:  డాక్టర్ సోనియా తాంబే, ఎండి, డిఎం (న్యూరాలజీ), కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మరియు ఎపిలెప్టాలజిస్ట్, కావేరీ హాస్పిటల్స్, ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు, మైగ్రేన్ […]

Share:

మైగ్రేన్ ఒక రకంగా తీవ్రమైన తలనొప్పి. మైగ్రేన్ వచ్చిన వారు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, రోజు ఎలా గడుస్తుందో కూడా వారికి తెలియని పరిస్థితుల్లో ఉంటారు. వచ్చినవారు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మైగ్రేన్ నొప్పి ఎలా తగ్గించుకోవాలో, నిపుణులు సూచిస్తున్న టెక్నిక్స్ ఏమిటో చూద్దాం..

మైగ్రేన్ వస్తే ప్రమాదమా: 

డాక్టర్ సోనియా తాంబే, ఎండి, డిఎం (న్యూరాలజీ), కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మరియు ఎపిలెప్టాలజిస్ట్, కావేరీ హాస్పిటల్స్, ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు, మైగ్రేన్ అసౌకర్యం గురించి వివరంగా తెలిపారు అంతేకాకుండా, అలాగే దాన్ని తగ్గించాలో వివరించారు. మైగ్రేన్ అనేది తీవ్రమైన మెదడికి సంబందించిన పరిస్థితి, అందులోనూ ఈ వానాకాలంలో సూర్యుడి వెచ్చదనం లేకపోవడంతో ఎక్కువగా తలనొప్పి ఇబ్బందులు ఉంటాయి. చాలా చల్లగా ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి ఎక్కువై, చల్లని వాతావరణంలో మైగ్రేన్ వస్తుంది. తలనొప్పి రావటానికి చల్లని గాలి మొహాన్ని తాకినా చాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఈ మైగ్రేన్ని తీవ్రమైన వ్యాధుల లిస్టులో ఆరవ స్థానంలో ఉంచింది. మైగ్రేన్ జీవిత కాలం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అందులోనూ ప్రధానంగా 3:1 నిష్పత్తిలో ఆడవారిని ప్రభావితం చేస్తుంది అని సర్వే తేల్చింది. బాగా ఉండే తలనొప్పి తో పాటు కదలిక ఉన్నా వాళ్ళు నొప్పులు, కళ్ళు, చెవుల నొప్పులు ఉండి వికారం వాంతులతో సంబంధం ఉన్న ఇతర నొప్పుల దాడులు ఉండి ఇబ్బంది పెడతాయి. అలాగే, అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గుతుంది. మైగ్రేన్ దాడి 4 గంటల నుండి 72 గంటల వరకు కొనసాగచ్చు, మైగ్రేన్ నొప్పి వచ్చిన తర్వాత మనిషి లో అలసట సహజం. 

మైగ్రేన్ నొప్పిని తగ్గించే పద్ధతులు: 

పరిశోధనల ప్రకారం, వ్యాయామం చేసేటప్పుడు శరీరం ఎండార్ఫిన్‌లను ఉత్పత్తి చేస్తుంది, ఇది తలనొప్పి మరియు దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు మైగ్రేన్ అటాక్‌ని తగ్గిస్తాయి. మందులతో యోగా వంటి మైండ్‌ఫుల్ వ్యాయామాలు మైగ్రేన్ దాడులను తగ్గిస్తాయి. తాయ్ చి అనే పురాతన చైనీస్ కళ  మైగ్రేన్‌ ని తగ్గిస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ వంటి కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండండి. ఒత్తిడి మైగ్రేన్‌ ని పెంచుతుంది. అందుకే ఒత్తిడి తీసుకోకండి. ఒంటరిగా ఉండకుండా సామాజిక పరస్పర చర్యలలో పాల్గొనండి. మసిల్ వ్యాయామం, మసాజ్, గోరువెచ్చని నీటి స్నానం చేయడం శరీరాన్ని రిలాక్స్‌ చేస్తాయి. లోతైన శ్వాస తీసుకోవడం, సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోవటం, కళ్ళు మూసుకుని, విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో ఉన్నట్లు ఊహించుకోవడం ప్రతిరోజూ కనీసం 5-10 నిమిషాలు చేయండి. మైగ్రేన్ ఖచ్చితమైన నివారణ లేని దీర్ఘకాలిక స్థితి కాబట్టి జీవనశైలిలో మార్పులు చేసుకుని ఒత్తిడి తగ్గించుకుని మందులను దగ్గరపెట్టుకుంటే మైగ్రేన్ నొప్పిని తట్టుకోవడంలో సహాయపడతాయి. 

మందులతో కాకుండా మైగ్రేన్ తగ్గించటానికి కొన్ని చిట్కాలు: 

నిశ్శబ్ద వాతావరణంలో ఉండటం: మైగ్రేన్ మొదటి సంకేతం వచ్చిన వెంటనే, విరామం తీసుకుని వీలైతే మీరు చేస్తున్న పనులకు దూరంగా ఉండండి. లైట్లు ఆఫ్ చేయండి, వెలుగు మైగ్రేన్ నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది. చీకటి నిశ్శబ్ద గదిలో విశ్రాంతి తీసుకోండి. వీలైతే పడుకోండి. 

ఒక కప్పు కాఫీ: తేలికపాటి తలనొప్పి మొదలైనప్పుడు, కెఫీన్ మాత్రమే మైగ్రేన్‌ను తగ్గించగలదు. అయితే, ఎక్కువ కెఫిన్ తీసుకోవడం అనేది తగ్గించుకోండి. 

బాగా నిద్రపోండి: మైగ్రేన్‌లు తరచుగా రాత్రిపూట సరిగా నిద్రలేకపోవడం వల్ల కలుగుతాయి, కాబట్టి మంచి నిద్రను అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఒకసారి అయినా సమయంలో నిద్ర పోవడం అలవాటు చేసుకోండి. తగిన సమయానికి పడుకోవటం లేవటం అలవాటు చేసుకోండి. బెడ్‌రూమ్‌లో ఆఫీసు పని చేయడం లేదా బెడ్‌రూమ్‌లో టీవీ చూడడం మానుకోండి. భోజనం మానకండి. ఆరోగ్యకరమైన శరీర బరువును మైంటైన్ చేయండి. ఆహారంలో తాజా పండ్లు కూరగాయలు ఉండేలా చూసుకోండి.