రంజాన్ సందర్భంగా ఉపవాసం పాటించే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చిట్కాలు

రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాసం ఉంటారు. కాబట్టి, మీరు ఏమి తింటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం” అని ది హెల్త్ ప్యాంట్రీ వ్యవస్థాపకురాలు, పోషకాహార నిపుణుడు మరియు డయాబెటిస్ అధ్యాపకురాలు ఖుష్బూ జైన్ తిబ్రేవాలా అన్నారు. రంజాన్ సమయంలో.. ముస్లిం భక్తులు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు కఠినమైన ఉపవాసం పాటించే పవిత్ర మాసం. భోజనం సమయం సాధారణంగా 12 నుండి 15 గంటల వరకు ఉంటుంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా రక్తంలో […]

Share:

రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాసం ఉంటారు. కాబట్టి, మీరు ఏమి తింటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం” అని ది హెల్త్ ప్యాంట్రీ వ్యవస్థాపకురాలు, పోషకాహార నిపుణుడు మరియు డయాబెటిస్ అధ్యాపకురాలు ఖుష్బూ జైన్ తిబ్రేవాలా అన్నారు.

రంజాన్ సమయంలో.. ముస్లిం భక్తులు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు కఠినమైన ఉపవాసం పాటించే పవిత్ర మాసం. భోజనం సమయం సాధారణంగా 12 నుండి 15 గంటల వరకు ఉంటుంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించలేని వారికి హానికరం కావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజా లేదా రోజంతా ఉపవాసాలు పాటించడం మంచిదేనా ? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపవాసాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా తమ వైద్యులను కలవాలని ఫంక్షనల్ వెల్‌నెస్ ప్రాక్టీషనర్ మరియు పీక్ పెర్ఫార్మర్స్ క్లబ్ వ్యవస్థాపకురాలు దేవయాని విజయన్ అన్నారు. “రక్తంలో షుగర్ హెచ్చుతగ్గుల ప్రమాదాన్ని తగ్గించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు లేదా డైట్ చార్ట్‌ను సెట్ చేసుకోవడం కూడా మంచిది. చికిత్స చేసే వైద్యుడు మందుల సమయాలను  మార్చవచ్చు, ఎందుకంటే భోజన సమయాలు భిన్నంగా ఉంటాయి ” అని దేవయాని చెప్పారు .

ది హెల్త్ ప్యాంట్రీ వ్యవస్థాపకురాలు, పోషకాహార నిపుణులు మరియు మధుమేహం అధ్యాపకురాలు ఖుష్బూ జైన్ తిబ్రేవాలా మాత్రం రంజాన్ ఉపవాసం అనేది”టైప్ 2 డయాబెటిస్‌కు అద్భుతమైనది” అని పేర్కొన్నారు. “రోజులో కేవలం ఒక సారి భోజనం తినడం ద్వారా, ఇన్సులిన్ పెరుగుదల స్థితి నుండి దూరంగా మారవచ్చు” అని ఆమె పేర్కొంది.  కాకపోతే రంజాన్ నెల రోజుల ఉపవాసం కాబట్టి, మీరు ఏమి తింటున్నారో ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. “మా డయాబెటిక్ క్లయింట్లు రంజాన్ సమయంలో పద్దతిగా ఉపవాసం చేయడం ద్వారా వారి గ్లూకోజ్ నియంత్రణలో చాల అభివృద్ధిని చూసిన సందర్భాలను నేను చూశాను ” అని టిబ్రేవాలా తెలిపారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏమి గుర్తుంచుకోవాలి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు.. ఉపవాసంలో కొన్ని చేయవలసినవి మరియు చేయకూడని ఏంటో చూద్దాం

  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) భోజనం తీసుకోవడం చాలా ముఖ్యం. దీనర్థం భోజనంలో ప్రోటీన్లు, సహజ కొవ్వులు, ఫైబర్, బియ్యం, రోటీ మొదలైన తృణధాన్యాల కలయిక ఉండాలి. తక్కువ GI ఉన్న భోజనం గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలకు దారితీస్తుందని చెప్పారు. “కాయగూరలు, ధాన్యాలు, గోధుమ ఆహార పదార్థాలు, రోల్డ్ వోట్స్, క్వినోవా గంజి, చాలా గింజలు మరియు అధిక ఫైబర్ కూరగాయలు మొదలైన పోషకాలు అధికంగా ఉండేవి భోజనంలో ఉండేలా చూసుకోవాలి. 

 మైదా, వైట్ షుగర్, బ్రెడ్ మొదలైన అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం మానుకోవాలి 

 ఉపవాసం విరమించే  సమయంలో భోజనం తినే ముందు, ఒక కప్పు ఎముకల పులుసు తీసుకోవడం వల్ల మీ శరీరంలోని ఖనిజాలు స్థిరపడతాయి. ఉపవాసం ఉన్న నెల మొత్తం స్థితిస్థాపకత ఉండేలా చేస్తుంది” అని ఆమె చెప్పింది.

 మీ భోజనంలో ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోండి. మీరు వాటిని చట్నీలు, ఏదైనా గ్రేవీకి జోడించిన కంప్రెస్డ్ ఫారమ్‌లలో తీసుకోవచ్చు.

 సాధ్యమైనంత వరకు, లీన్ మాంసాలు మరియు సీఫుడ్‌లకు దూరంగా ఉండండి,

స్టెడ్‌ఫాస్ట్ న్యూట్రిషన్ వ్యవస్థాపకుడు అమన్ పూరి, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ ఇతర అంశాలను గుర్తుంచుకోవాలో పేర్కొన్నారు

తీపి పదార్థాలు తినకండి: ఇఫ్తార్ తర్వాత మరియు భోజనాల మధ్య తీపి పదార్థాలు తినవద్దు. రీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి చక్కెర రహిత మరియు కెఫిన్ లేని పానీయాలను తీసుకోవచ్చు.

భోజనానికి, నిద్రకు మధ్య గ్యాప్ ఇవ్వండి: రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకండి.  భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు గంటల తేడా ఉండేలా చూసుకోండి. 

నీరు ఎక్కువ త్రాగండి: ప్రధాన భోజనం సమయంలో లేదా మధ్య సమయంలో  తగినంత నీరు త్రాగండి. చక్కెర పానీయాలు, సిరప్‌లు, క్యాన్డ్ జ్యూస్‌లు మరియు చక్కెర జోడించిన తాజా పండ్లరసాలు తీసుకోవద్దు.

వేయించిన ఆహారాన్ని మానుకోండి: పారంతా, పూరీ, సమోసా, చెవ్రా, పకోరస్ వంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌ను తీసుకోవద్దు. పిండి పదార్థాలలో బియ్యం, గోధుమ చపాతీని ఎంచుకోండి.  

కెఫిన్ కలిగిన పానీయాలను తీసుకోవద్దు: టీ, కాఫీ, సోడా వంటివి వాటికి కూడా దూరంగా ఉండాలని పేర్కొన్నారు.