చ‌ర్మం పాడ‌వ‌డానికి చ‌క్క‌రే కార‌ణ‌మా?

మచ్చలేని మోము ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు , ముడతలు మిమ్మల్ని అందవిహీనం చేస్తాయి. చర్మ సమస్యలు అలర్జీలు వాతావరణం వల్లనే కాకుండా సరైన పోషకాహారం తీసుకోవడం వలన కూడా వస్తాయి. చర్మం అందంగా కనిపించాలంటే మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. అప్పుడే మీ చర్మం అద్భుతంగా ఉంటుంది. మీరు చక్కెర పదార్థాలను ఎక్కువగా తిన్న దాని ప్రభావం చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. షుగర్ అధికంగా ఉండే వాటిని తీసుకుంటే ముఖంపై మొటిమలు రావడానికి […]

Share:

మచ్చలేని మోము ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు , ముడతలు మిమ్మల్ని అందవిహీనం చేస్తాయి. చర్మ సమస్యలు అలర్జీలు వాతావరణం వల్లనే కాకుండా సరైన పోషకాహారం తీసుకోవడం వలన కూడా వస్తాయి. చర్మం అందంగా కనిపించాలంటే మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. అప్పుడే మీ చర్మం అద్భుతంగా ఉంటుంది. మీరు చక్కెర పదార్థాలను ఎక్కువగా తిన్న దాని ప్రభావం చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. షుగర్ అధికంగా ఉండే వాటిని తీసుకుంటే ముఖంపై మొటిమలు రావడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ముఖంపై ముడతలు, చర్మం వదులుగా అవ్వడానికి మారుతుంది. చక్కెర మీ చర్మానికి ఎంత హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

చక్కెర మీ శరీర బరువును వేగంగా పెంచుతుంది. అదే సమయంలో మీ ఎముకలను బలహీనపరుస్తుంది.. డయాబెటిస్ కి చెక్కరే ప్రధాన కారణం. అందుకే చక్కెరను వైట్ పాయిజన్ అంటారు. కానీ అది సరైనది ఎంత హాని చేస్తుందో చర్మానికి కూడా అంతే హాని చేస్తుంది. శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. గ్లైకేసన్ కు చక్కెర ప్రధాన కారణం.. నిజానికి స్వీట్లు తిన్న తర్వాత మన శరీరంలో అప్పటికే ఉన్న చక్కెర కొల్లాజన్ ప్రోటీన్ కు అంటుకుంటుంది. ఇది ప్రోటీన్ ను నెమ్మదిగా తొలగించి వేస్తుంది. అప్పుడు దాని ప్రభావం మీ చర్మం పై కనిపిస్తుంది. ఆకాల ముడతలు చర్మంపై కనిపించడం ప్రారంభిస్తాయి.  వృద్ధాప్యం రావడం మొదలవుతుంది.

సాధారణ కార్బోహైడ్రేట్ల నుండి ఎక్కువ చక్కెరను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలో మంటను పెంచుతుంది. రోసెసియా, సోరియాసిస్, తామర , గజ్జి వంటి చర్మ సమస్యలు ఉంటే వాటిని తీవ్రతరం చేస్తుంది. అంతేకాకుండా అకాల వృధాప్యం వచ్చే ప్రమాదం లేకపోలేదు. చక్కెర అత్యంత హానికరమైన ప్రభావాలలో ఒకటి.. ఇది మీ చర్మాన్ని వృద్ధాప్య ఛాయలు దరిచేరేలా చేస్తుంది.. చక్కెర కొల్లాజన్, ఎలాస్టిక్ ను విచ్ఛిన్నం చేస్తుంది  చర్మ ఆకృతి, నిర్మాణం, దృఢత్వం కోల్పోయి, చర్మం ముడతలు పడి, కృంగిపోయి,  నిస్తేజంగా, పొడిగా కనిపించే ప్రమాదం ఉంది అధిక చక్కెర వినియోగం వలన మొటిమలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు మీ శరీరంలో సెబమ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. దీని వలన ఇన్సులిన్  ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అధిక స్థాయి ఇన్సులిన్ సెభాషియస్ గ్రంధులను మరింత సెబమ్ ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. చర్మంలో అధిక

 సెబమ్ కారణంగా చర్మం జుట్టుకుదులు మూసుకుపోతాయి, దీనివల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. 

 అధిక చక్కెర నుండి చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలను కొనుగోలు చేసినప్పుడు ఆహార లేబుల్ లను తప్పనిసరిగా పరీక్షించాలి. తేనె, పండ్ల రసాలు, ఆల్కహాల్ లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఫిజీ డ్రింక్, జ్యూస్ , ఎనర్జీ డ్రింక్ లలో కూడా చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. వీటికి బదులుగా నీటిని తాగండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చర్మ సమస్యల నుండి తప్పించుకోవచ్చు. తాజా కూర కాయలు పండ్లు, చేపలు, సిట్రస్ పండ్లు, బచ్చలి కూర , కొబ్బరి నీరు, తృణధాన్యాలు, గింజలు, సి ఫుడ్ వంటివి తీసుకోవడం వలన చర్మ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ ఆహారాలు మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.