ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మంచిదేనా?

వ్యాయామం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ తిన్న తర్వాత వ్యాయామం చేయాలని, ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయాలని, కేవలం ఒకే సమయంలో వ్యాయామం చేయాలని ఇలా రకరకాలుగా కొంతమంది ఎక్ససైజ్ విషయంలో జాగ్రత్తలు చెప్తూ ఉండడం సహజం కదా. మరి ఈరోజు, ఖాళీ కడుపుతో ఏమీ తినకుండా కార్డియో చేయడం మంచిదా కాదా తెలుసుకుందామా..  ఫాస్టింగ్ కార్డియో:  చాలామంది ఉదయాన్నే వ్యాయామం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. […]

Share:

వ్యాయామం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ తిన్న తర్వాత వ్యాయామం చేయాలని, ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయాలని, కేవలం ఒకే సమయంలో వ్యాయామం చేయాలని ఇలా రకరకాలుగా కొంతమంది ఎక్ససైజ్ విషయంలో జాగ్రత్తలు చెప్తూ ఉండడం సహజం కదా. మరి ఈరోజు, ఖాళీ కడుపుతో ఏమీ తినకుండా కార్డియో చేయడం మంచిదా కాదా తెలుసుకుందామా.. 

ఫాస్టింగ్ కార్డియో: 

చాలామంది ఉదయాన్నే వ్యాయామం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వ్యాయామం చేయడం అనేది ఎంత మంచి పద్ధతితో అందరికీ తెలుసు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ నిలువలు తగ్గేందుకు ఎక్ససైజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్డియో ఎక్సర్సైజ్ అనేది ముఖ్యంగా గుండెను పదిలంగా ఉంచేందుకు చేసే ఎక్ససైజ్. అయితే ఇటువంటి ఎక్ససైజ్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి అనే డౌట్ అందరికీ వస్తూనే ఉంటుంది. అయితే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, ఉదయం లేచిన తర్వాత అంటే బ్రేక్ ఫాస్ట్ చేయకముందు ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా మంచిదే అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఒక రకమైన సైన్స్ కూడా ఉందంటున్నారు నిపుణులు. 

మనం రోజంతా పనిచేసి, రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత, మన శరీరంలో కొంత భాగం పేరుకున్న కొవ్వును కరిగించేందుకు, అదే విధంగా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినక ముందు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరంలో ఎటువంటి ఆహారం ఉండదు కాబట్టి, శరీరంలో పేరుకున్న కొవ్వును మాత్రమే ఉపయోగించుకుని మన శరీరానికి బలం చేకూరుతుంది. అంటే ఈ ప్రక్రియలో, శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడమే కాకుండా, ముఖ్యంగా శరీర బరువు అధికంగా తగ్గే ఆకాశాలుంటాయి. అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి. అందుకోసమే ముఖ్యంగా, ఉదయం లేచిన తర్వాత, బ్రేక్ ఫాస్ట్ చేయకముందు కార్డియో ఎక్ససైజ్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు. 

ఈ సమయాల్లో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు: 

లేట్ మార్నింగ్ (10-11 AM) : కొంచెం ఆలస్యంగా రోజుని ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం. ఈ సమయానికి, శరీరం వేడెక్కుతుంది, ఫ్లెక్సిబిల్ అయ్యి మజిల్ బలం పెరుగుతుంది. 

మధ్యాహ్నం (3-5 PM) : మధ్యాహ్న సమయంలో సహజంగా శరీరంలో వ్యాయామం చేసే శక్తి ఎక్కువగా ఉంది అనుకున్నవారికి ఈ స్లాట్ అనుకూలంగా ఉంటుంది. అధిక-తీవ్రత ఉన్న వ్యాయామాలు లేదా ఒక టీమ్ గా వ్యాయామం చేసే వారికి ఇది మంచి సమయం, ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా  ఉంటుంది, కాబట్టి ఈ సమయం మెరుగైన పనితీరుకు దారితీస్తుంది. 

సాయంత్రం (5-7 PM) :చాలా మందికి, సాయంత్రం ప్రారంభం అయ్యే సమయం అనుకూలం. రోజంతా పని చేసిన తర్వాత, రోజు ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదనంగా, ఈ టైమ్ స్లాట్ లో పార్టనర్స్ తో వ్యాయామం చేయడానికి బాగుంటుంది లేదా ఆఫీస్ అయ్యాక గ్రూప్ ఫిట్‌నెస్ క్లాసులకు వెళ్లే అవకాశాన్ని ఇస్తుంది. 

రాత్రి (10 PM-అర్ధరాత్రి) : కొంతమందికి వాళ్ల పనుల వలన అర్థరాత్రి అయితే కానీ వ్యాయామం చేయదానికి అనుకూలించదు, వాళ్ళకోసం ఒత్తిడిని తగ్గించడానికి, శక్తిని పెంచడానికి ఇది మంచి సమయం అయినప్పటికీ, వ్యాయామం పూర్తి చేసిన తర్వాత తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని మర్చిపోకండి.