షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఇన్సులిన్ వాడుతున్నారా..అయితే మీ ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే!

షుగర్ వ్యాధితో బాధపడే పేషెంట్స్ కి ఇన్సులిన్ అత్యవసరం అనే విషయం అందరికీ తెలిసిందే.షుగర్ వ్యాధి వస్తే చచ్చే వరకు పోదు, కానీ దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ శరీర అవయవాళ్లపై పడకుండా ఉండేందుకు ఇన్సులిన్ ఉపయోగిస్తారు. ఇటీవల అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చేపట్టిన ఒక సర్వే ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే అమెరికా లో 84 లక్షల మంది షుగర్ వ్యాధి అనగా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల […]

Share:

షుగర్ వ్యాధితో బాధపడే పేషెంట్స్ కి ఇన్సులిన్ అత్యవసరం అనే విషయం అందరికీ తెలిసిందే.షుగర్ వ్యాధి వస్తే చచ్చే వరకు పోదు, కానీ దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ శరీర అవయవాళ్లపై పడకుండా ఉండేందుకు ఇన్సులిన్ ఉపయోగిస్తారు. ఇటీవల అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చేపట్టిన ఒక సర్వే ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే అమెరికా లో 84 లక్షల మంది షుగర్ వ్యాధి అనగా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 20 వ తారీఖున యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాన్ డియెగో కి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలు ఇప్పుడు పెద్ద చర్చకి దారి తీసింది. ఈ పరిశోధనలతో మితిమీరిన ఇన్సులిన్ శరీరంలో ఉండడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రొఫెసర్ మైఖేల్  కరీనా చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘డయాబెటీస్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకోవడం అత్యవసరమే, కానీ మితిమీరిన ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్సులిన్ ని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు వందల సంవత్సరాలు కృషి చేసారు. దీనికి ముందు ఎన్నో మెడిసిన్ మరియు బయో కెమికల్ ఫార్ములాస్ కనిపెట్టారు కూడా, కానీ శాస్త్రవేత్తలు ఫాటల్ ఇన్సులిన్ హైపర్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎందుకు విస్మయించారో అనేది ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలిపోయిందని ప్రొఫెసర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మన శరీరం ఇన్సులిన్ తీసుకునేందుకు అనువుగా ఉన్నదే,కానీ మితిమీరిన ఇన్సులిన్ వాడకం వల్ల మన శరీరంలో ఉన్న సేఫ్టీ వాల్వ్ బ్లాక్ అవుతుంది, అందువల్ల షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి, షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఒక మనిషి కోమాకి కూడా వెళ్లొచ్చు.దీనిని హైపోగ్లైసీమియా అంటారు. ఇది పరిధి దాటి ఇన్సులిన్ ఇచ్చినప్పుడు పేషెంట్ చనిపోవడానికి దారి తీస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ప్రాక్టికల్ గా రీసెంట్ గానే నిరూపితం అయ్యిందని, కావున పేషెంట్స్ ఎక్కువ శాతం ఇన్సులిన్ మీదనే ఆధారపడి ఉండకండని ప్రొఫెసర్ మైఖేల్ చెప్పుకొచ్చాడు.

అయితే ఇన్సులిన్ శాతం శరీరంలో ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కాదు, తక్కువ ఉన్న ప్రమాదమేనట! కాబట్టి డాక్టర్లు ఈ విషయాన్నీ గమనించి, ఇన్సులిన్ సదరు పేషెంట్ కి ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో ఇస్తే సరిపోతుందని ఈ పరిశోధనలను దగ్గరుండి పరిశీలించిన ప్రొఫెసర్ మైఖేల్ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ శాస్త్రవేత్తలు త్వరలోనే E7 అనే సరికొత్త డ్రగ్ ని కనిపెట్టబోతున్నారు. దీనిని ఇన్సులిన్ కి బదులుగా వాడుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మాత్రం ఇన్సులిన్ షాక్ నుండి బయటపడాలంటే కచ్చితంగా E7 అవసరం ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మన రోజువారీ జీవితాల్లో మన సొంత కుటుంబాలలోనే డయాబెటిస్ తో బాధ పడుతున్న వారిని చూస్తూనే ఉన్నాము. వాళ్లకి దీని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం మన ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. అలాగే ప్రతీ డాక్టర్ కి ఈ విషయంపై ఉన్నతాధికారులు ప్రత్యేక సెషన్స్ ని నిర్వహించి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో డయాబెటిస్ పేషెంట్స్ ఇన్సులిన్ వాడడం అనేది ఈ మధ్య మరీ సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది అధిక మోతాదులో వాడే వాళ్లు కూడా ఉంటారు, వాళ్ళని కూడా ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.