ఒక్కసారి మాచా టీ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు.. బోలెడు బెనిఫిట్స్ కూడా

వేడివేడిగా టీ తాగందే కొందరికి పొద్దు గడవదు.. ఆఫీసులో వర్క్ టెన్షన్ అయినా.. ఇంట్లో చికాకైనా.. బంధువులు ఇంటికి వచ్చిన.. పెళ్లైనా.. పండుగైనా దేనికైనా సరే టీ ఉండాల్సిందే.. వేడివేడిగా ఒక సిప్ టీ తాగితే ఆ మజానే వేరు.. మార్కెట్లో రకరకాల టీలు అందుబాటులోకి వచ్చాయి.. అందులో మాచా టీ కూడా ఒకటి.. ఈ మాచా టీ ప్రత్యేకత ఏమిటి.. ఈ టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం.. జపనీస్ టీ […]

Share:

వేడివేడిగా టీ తాగందే కొందరికి పొద్దు గడవదు.. ఆఫీసులో వర్క్ టెన్షన్ అయినా.. ఇంట్లో చికాకైనా.. బంధువులు ఇంటికి వచ్చిన.. పెళ్లైనా.. పండుగైనా దేనికైనా సరే టీ ఉండాల్సిందే.. వేడివేడిగా ఒక సిప్ టీ తాగితే ఆ మజానే వేరు.. మార్కెట్లో రకరకాల టీలు అందుబాటులోకి వచ్చాయి.. అందులో మాచా టీ కూడా ఒకటి.. ఈ మాచా టీ ప్రత్యేకత ఏమిటి.. ఈ టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం..

జపనీస్ టీ నే మాచా టీ.. ఈ కామర్స్ సైట్స్ లో ఈ టీ పొడి మనదేశంలో కూడా లభిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ టీ  రుచిని ఆస్వాదించాయి. జపనీయులు ఎక్కువగా ఈ టీని తాగి టెన్షన్, ఒత్తిడిని దూరం చేసుకున్నామని చెబుతున్నారు. మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని, నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని కూడా వారు అంటున్నారు.. పలు పరిశోధనలు చేసిన తరువాత జపనీస్ మాచా టీ.. తలనొప్పి టెన్షన్ , బడలిక, నీరసం, ఆందోళన స్ట్రెస్ వంటి లక్షణాలను పోగొట్టడంలో ఈ టి అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది.

మాచా అనే మొక్క ఆకుల నుంచి ఈ టీ పొడిని తయారు చేస్తారు. ఈ టీ పొడి చూడటానికి గోరింటాకు పొడి లా కనిపిస్తుంది. మన శరీరంలో డోపమైన్ D1 రెసిప్టర్లు, సెరోటోనిన్ 5HT1A యాక్టివేట్ అవుతాయట. ఇవి రెండు టెన్షన్, ఒత్తిడిని తగ్గించేవి. ఇవి యాక్టివేట్ అవ్వడం మన శరీరానికి చాలా మంచిది. మాచా ఆకుల పొడిని పూర్వ కాలం నుంచి పలు రకాల మందుల తయారీలో వాడుతున్నారు. ఈ టీ  శరీరానికి ఎంతో మేలు చేయడంతో పాటు టెన్షన్ తగ్గించే సాధనంగా ఉపయోగపడుతుందని జపాన్లోని కుమామోటో యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 

మాచా టీ పొడి కి సాధారణ టీపొడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే జపాన్ లోని మాచా మొక్కలకు కొత్తగా వచ్చే ఆకుల నుంచి ఈ టీ పొడిని సేకరిస్తారు. ఈ ఆకుల్లో 90 శాతం నీడలో పెరిగిన ఆకుల్ని మాత్రమే సేకరిస్తారు. అలా నీడలో పెరిగిన కొత్త ఆకుల్లోనే మన టెన్షన్ తగ్గించే అద్భుత లక్షణాలు ఉన్నాయని తేలింది. ఇంకా ఈ టీ పొడిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఈ టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేర్కొన్న ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటుంది. శరీరంలోని విషవ్యార్థాలను బయటకు నెట్టేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఊబకాయంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ టిని రెండుసార్లు తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. 

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కిడ్నీల పనితీరును వేగవంతం చేస్తాయి. కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయి. ఈ టీ తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్ అసిడిటీ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుకుండా చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మాచా టీ ని మీరు ఒకసారి తాగండి. ప్రతి సారి ఈ టీ తాగాలని అనుకుంటారు.