Mini Meals: వెయిట్ లాస్ కోసం మినీ మిల్స్

మన రోజు వారి ఆహార అలవాట్లు మన బదువు (weight) మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి.  ముఖ్యంగా పోషకాహాల ఆహారాలు ఉన్న ఆహారాన్ని మనం తరచుగా తీసుకోవడం వల్ల మన శరీర బదువు (weight) అనేది అదుపులో ఉంటుంది. అయితే చాలామంది బదువు (weight) తగ్గాలంటే తినడం మానేస్తే బాగుంటుంది, అప్పుడు బదువు (weight) తగ్గుతాం అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి తినడం మానేస్తేనే ఎక్కువ బదువు (weight) పెరుగుతారని గ్రహించరు. అందుకే ఈరోజు మిని మల్స్ […]

Share:

మన రోజు వారి ఆహార అలవాట్లు మన బదువు (weight) మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి.  ముఖ్యంగా పోషకాహాల ఆహారాలు ఉన్న ఆహారాన్ని మనం తరచుగా తీసుకోవడం వల్ల మన శరీర బదువు (weight) అనేది అదుపులో ఉంటుంది. అయితే చాలామంది బదువు (weight) తగ్గాలంటే తినడం మానేస్తే బాగుంటుంది, అప్పుడు బదువు (weight) తగ్గుతాం అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి తినడం మానేస్తేనే ఎక్కువ బదువు (weight) పెరుగుతారని గ్రహించరు. అందుకే ఈరోజు మిని మల్స్ గురించి తెలుసుకుందాం. మన శరీర బదువు (weight)ని అదుపులో ఉంచడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయట. ముఖ్యంగా వెయిట్ లాస్ (weight Loss) అవ్వాలనుకున్నవారు, తప్పకుండా.మిని మీల్స్ (Mini Meals) ట్రై చేయాల్సిందే.. 

వెయిట్ లాస్ కోసం మినీ మిల్స్ : 

అడపాదడపా ఉపవాసం, క్యాలరీల తక్కువ ఉన్న ఆహారాలు ఎంచుకోవడం.. అంతేకాకుండా హక్స్‌లను అనుసరిస్తారు. మీ బదువు (weight)ను అదుపులో ఉంచడానికి అత్యంత ప్రజాదరణ పొందిన, సమర్థవంతమైన మార్గాలలో ఒకటిని నమ్ముతారు. మీరు తినే ఆహారం మీద మీ బదువు (weight) ఆధారపడి ఉంటుంది అనేది నిజమైనప్పటికీ, ముఖ్యంగా మీరు రోజు వారు సమయాల బట్టి కూడా మీ బదువు (weight) ఆధారపడి ఉంటుంది. అంటే ఏ సమయంలో మీరు ఆహారం తీసుకుంటున్నారు, మళ్లీ ఎంత గ్యాప్ తర్వాత ఆహారం తీసుకుంటున్నారు అనే దానిమీద ఆధారపడి ఉంటుందట.

రోజంతా మనం తీసుకునే మినీ మీల్స్ తరచుగా తినడం వల్ల, జీవక్రియ మందగించకుండా నిరోధిస్తుంది. ఆకలి (Hunger) బాధలను తగ్గిస్తుంది, మీ శరీరానికి సరైన ఎనర్జీ అనేది ఇస్తుంది. కొలెస్ట్రాల్ (Cholestral) మరియు ఇన్సులిన్ స్థాయిలపై సానుకూల ప్రభావం చూపుతుంది. పోషకాహార ప్రపంచంలో, మన శరీర బదువు (weight), కొవ్వు తగ్గడానికి మీరు తీసుకునే దానికంటే ఎక్కువ కేలరీ (Calorie)లు బర్న్ చేయాలనేది మనందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే.. సరైన భోజనం ఫ్రీక్వెన్సీ ద్వారా. ప్రతి మూడు గంటలకు ఒకసారి సమయాన్ని పెట్టుకుని మినీ మీల్స్ అనేవి మనం తినడం ప్రారంభిస్తే, మన శరీర బదువు (weight) అదుపులో ఉండడం ఖాయం. కాబట్టి మినీ మీల్స్ (Mini Meals) అనేవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మూడు గంటలకి ఒకసారి ఒక రకమైన మినీ మీల్ అనేది తీసుకోవచ్చు.

మినీ మీల్స్:

1. 1 కప్పు సోయా పాలు.. బాదంతో పాటుగా.

2. 1 స్లైస్ హోల్ వీట్ బ్రెడ్‌తో చేసిన హాఫ్ శాండ్‌విచ్, అందులో తురిమిన చికెన్, దోసకాయ, టొమాటోతో చట్నీ లేదా పనీర్.

3. ఏదైనా మంచి సలాడ్‌తో 1 బౌల్ మూంగ్ మొలకలు.

3. 1:1 నిష్పత్తిలో చనాతో కొన్ని వేరుశెనగలు(ఉడికించినవి).

4. మీ రోటీలకు బదులుగా గోధుమ రవ్వ రోటీలు చేసుకోండి. రోటీల సంఖ్యను మీరు రెగ్యులర్ గా తీసుకునే సగానికి తగ్గించండి.

5. 2 గుడ్లలోని తెల్లసొన ఆమ్లెట్ వేసుకోవడం. లేదా ఒక ఫుల్ ఎగ్ ఆమ్లెట్‌తో 1 టోస్ట్ చేసుకోవచ్చు.

6. ఒక పండు ఒక ఆపిల్, నారింజ, స్వీట్ లైమ్, 20 చెర్రీస్. లేదా 1 గిన్నె పుచ్చకాయ.

7. సలాడ్‌తో పాటుగా ఒక గిన్నె పప్పు లేదా పెరుగు. 

ఇవన్నీ కూడా ఏడురకాల మినీ మీల్స్ (Mini Meals). మూడు గంటల వ్యవధి సమయం పెట్టుకుని, ఒక రకమైన మినీ మీల్ ఆస్వాదిస్తూ, మీ బదువు (weight)ని అదుపులో ఉంచుకోవచ్చు.