Health: ఈ కూరగాయలు మాత్రం పచ్చిగా తినకూడదట..

చాలా మంది హెల్తీగా మారెందుకు ముఖ్యంగా సలాడ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో కొన్ని కూరగాయల(Vegetables)ను పచ్చి (Raw)గా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. హెల్త్ జాగ్రత్తలు తీసుకునే సమయంలో ఎటువంటి ఆహారాలు పచ్చి (Raw)గా తినాలి, ఎటువంటి ఆహారాలు ఉడికించి, వండి తినాలి అని స్పష్టంగా తెలుసుకోగలిగితే, మన ఆరోగ్యం (Health) మన చేతుల్లోనే ఉంది అంటున్నారు నిపుణులు. ఆ కూరగాయలు(Vegetables) ఏంటో […]

Share:

చాలా మంది హెల్తీగా మారెందుకు ముఖ్యంగా సలాడ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో కొన్ని కూరగాయల(Vegetables)ను పచ్చి (Raw)గా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. హెల్త్ జాగ్రత్తలు తీసుకునే సమయంలో ఎటువంటి ఆహారాలు పచ్చి (Raw)గా తినాలి, ఎటువంటి ఆహారాలు ఉడికించి, వండి తినాలి అని స్పష్టంగా తెలుసుకోగలిగితే, మన ఆరోగ్యం (Health) మన చేతుల్లోనే ఉంది అంటున్నారు నిపుణులు. ఆ కూరగాయలు(Vegetables) ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. 

ఈ కూరగాయలు మాత్రం పచ్చిగా తినకూడదట..: 

తరచుగా సూపర్‌ఫుడ్‌ అని చెప్పుకునే కాలే (kale) మరియు పాలకూర (Spinach) మీరు తినగలిగే ఆరోగ్యకరమైన (Health), అత్యంత పోషకాలు కలిగిన ఆహారాలలో ఒకటి. ఈ ఆకుకూర (Leafy Vegetables)లు వివిధ రంగులు, ఆకారాలు మరియు ఆకృతిలో వస్తాయి. మన ఆరోగ్యానికి  (Health) కావాల్సిన పోషకాహారాలు సమృద్ధిగా ఈ కూరలలో ఉండడమే కాకుండా, ఈ కూరగాయలు(Vegetables) గుండె జబ్బులు మరియు క్యాన్సర్ నుండి రక్షించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఫైబర్ (Fiber), విటమిన్ సి మరియు కాల్షియం (Calcium)తో నిండి ఉన్నాయి. అయితే ఈ కూరగాయల(Vegetables)ను పచ్చి (Raw)గా తింటే, ఆరోగ్య (Health) సమస్యలు వస్తాయా అనే విషయం తెలుసుకుందాం.

పాలకూర (Spinach) మరియు కాలే (kale)లో ఆక్సాలిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది శరీరం (Body)లోని కాల్షియం మరియు ఇతర ఖనిజాలతో కలవడం ద్వారా కరగని స్ఫటికాలను ఏర్పరుస్తుంది. పచ్చి (Raw)గా తినడం వల్ల ఆక్సాలిక్ యాసిడ్ విచ్ఛిన్నం కాదు మరియు శరీరం (Body)లోని కాల్షియం, ఐరన్ మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాల ఉత్పత్తికి ముఖ్యంగా ఆటంకం కలిగిస్తుందని ఒక ఆరోగ్య  (Health) ఎక్స్పర్ట్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. 

వండుకుని తినేద్దాం: 

చిన్న మొత్తంలో పాలకూర (Spinach) మరియు కాలే (kale), పచ్చి (Raw)గా తినడానికి సురక్షితంగా ఉన్నప్పటికీ, ఎప్పుడు వండుకుని తినేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఆకుకూర (Leafy Vegetables)లను వండుకొని తినడం వల్ల ఆక్సాలిక్ యాసిడ్ విచ్ఛిన్నం అవుతుంది, పాలకూర (Spinach)లోని పోషకాలను శరీరం (Body) సులభంగా గ్రహించేలా చేస్తుంది. ఏదైనా కూరగాయలను పచ్చి (Raw)గా తినాలా వద్దా అనేది, వారి వైద్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, తమకి అలవాటు ఉన్న కొన్ని కూరగాయల (Vegetables)ను మాత్రమే పచ్చి (Raw)గా సలాడ్స్ లాగా, స్మూతీస్ లాగా తీసుకోవచ్చు

గ్యాస్ట్రిక్ లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పాలకూర (Spinach) అదే విధంగా, కాలే (kale) ఆకుకూర (Leafy Vegetables)లను పచ్చి (Raw)గా తీసుకోవడం మానుకోవాలి, ఎందుకంటే ఇది అసిడిటీ లేదా కడుపు నొప్పులకు దారితీస్తుంది. నిజానికి ఏ రకమైన ఆకు కూరలను పచ్చి (Raw)గా తినడం వల్ల ఈ దుష్ప్రభావాలకు దారితీయచ్చు. అయితే ముందుగానే మనం కొన్ని ఆకుకూర (Leafy Vegetables)లనైనా, కూరగాయలనైనా(Vegetables) మనం పచ్చి (Raw)క తీసుకునే ముందు, మన శరీరం (Body) దానికి తట్టుకుంటుందో లేదో అనే దాని గురించి ముందుగా పరీక్షించడం మేలు. వికారంగా ఉండడం కడుపు ఉబ్బరం అనిపిస్తే, ఎటువంటి కూరగాయలనైనా(Vegetables) తినడం మానుకోవడం మంచిది.

ముఖ్యంగా ఆరోగ్య(Health)  సమస్యలు ఉన్నవారు పచ్చి ఆకుకూరలు(Leafy Vegetables), పచ్చి(Raw) కూరగాయలు(Vegetables) తినకపోవడం మంచిది. వండుకోలేని సమయంలో, కాస్త ఉడికించి తినడం ఉత్తమం. ఆరోగ్యకరమైన(Health)  ఆహారాన్ని మన శరీరానికి అందించడం, ఆరోగ్యకరమైన (Health) జీవనశైలిని పెంపొందించుకోవడం.