చిన్న వ‌య‌సులోనే మెనోపాజ్…!

మెనోపాజ్.. (రుతువిర‌తి) మ‌హిళ‌ల్లో 45 నుంచి 50 ఏళ్ల వ‌య‌సులో వ‌చ్చే ద‌శ ఇది. మెనోపాజ్ అంటే మ‌హిళ‌ల‌కు రుతుక్ర‌మం ఆగిపోవ‌డం. ఈ ద‌శ మొద‌లైంది అంటే ఇక రోగాలు ఒక్కొక్క‌టి వ‌స్తుంటాయి. మ‌హిళ‌ల‌కు పీరియ‌డ్స్ వ‌స్తున్నంత కాలం ఆరోగ్య‌క‌రంగానే ఉంటారు. చాలా ర‌కాల అనారోగ్య స‌మస్య‌లను ఈ రుతుక్ర‌మం అరికడుతుంది. ఇది ఒక్క‌సారి ఆగిపోయింది అంటే.. అక్క‌డి నుంచి స‌మ‌స్య‌లు మొద‌లు అని అర్ధం. ఈ మెనోపాజ్ అనేది ఈ కాలం ఆడ‌వారిలో చిన్న వ‌య‌సులోనే […]

Share:

మెనోపాజ్.. (రుతువిర‌తి) మ‌హిళ‌ల్లో 45 నుంచి 50 ఏళ్ల వ‌య‌సులో వ‌చ్చే ద‌శ ఇది. మెనోపాజ్ అంటే మ‌హిళ‌ల‌కు రుతుక్ర‌మం ఆగిపోవ‌డం. ఈ ద‌శ మొద‌లైంది అంటే ఇక రోగాలు ఒక్కొక్క‌టి వ‌స్తుంటాయి. మ‌హిళ‌ల‌కు పీరియ‌డ్స్ వ‌స్తున్నంత కాలం ఆరోగ్య‌క‌రంగానే ఉంటారు. చాలా ర‌కాల అనారోగ్య స‌మస్య‌లను ఈ రుతుక్ర‌మం అరికడుతుంది. ఇది ఒక్క‌సారి ఆగిపోయింది అంటే.. అక్క‌డి నుంచి స‌మ‌స్య‌లు మొద‌లు అని అర్ధం.

ఈ మెనోపాజ్ అనేది ఈ కాలం ఆడ‌వారిలో చిన్న వ‌య‌సులోనే వ‌చ్చేస్తోంద‌ట‌. అంటే 35 ఏళ్లకే మెనోపాజ్ ద‌శ‌లోకి వచ్చేస్తున్నారు. దీనికి కార‌ణం ఏంటో వివ‌రించారు కొంద‌రు గైనకాల‌జిస్ట్‌లు. సోష‌ల్ అండ్ ఎక‌నామిక్ చేంజ్ ఇన్‌స్టిట్యూట్ చేప‌ట్టిన ఓ స‌ర్వేలో తేలింది ఏంటంటే.. భార‌త‌దేశంలో 4 శాతం మంది మ‌హిళ‌లు 29 నుంచి 35 ఏళ్ల వ‌య‌సులోనే మెనోపాజ్ ద‌శ‌లోకి వెళ్లిపోతున్నార‌ట‌. ఇక 35 నుంచి 39 ఏళ్ల వ‌య‌సు వారి సంఖ్య 8 శాతంగా ఉంద‌ని రీసెర్చ్‌లో తేలింది.

45 నుంచి 55 ఏళ్ల వ‌య‌సులో వ‌చ్చే ఈ మెనోపాజ్ ద‌శ‌.. అంత‌కంటే త‌క్కువ ఏళ్ల వ‌య‌సులో వ‌స్తే దానిని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటార‌ని గైన‌కాల‌జిస్ట్‌లు చెప్తున్నారు. ఇది మెనోపాజ్ వ‌చ్చింద‌ని ఎలా తెలుస్తుందంటే.. హెయిర్ ఫాల్ ఎక్కువ‌గా అవుతూ ఉంటుంది. పీరియ‌డ్స్ ఆగిపోతాయి. మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. అంటే కొన్ని క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే కోపం, బాధ‌, ఆవేశం, ఏడుపు ఇలా అన్నీ ఒకేసారి వ‌స్తుంటాయి. చ‌ర్మం పొడిబారిపోతుంది.

ప్రెగ్నెన్సీ వచ్చే చాన్సులు మాత్రం అటు ఇటుగా ఉంటాయి. కాక‌పోతే కాంప్లికేష‌న్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇలా ప్రీమెచ్యూర్ లేదా ఎర్లీ మెనోపాజ్ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఒక‌టి.. జ‌న్యు ప్రభావం అయినా అయ్యి ఉండాలి. లేదా మారుతున్న జీవ‌న‌శైలి, ఆహార నియ‌మాలు, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఎన్నో కార‌ణాల వ‌ల్ల ఈ మెనోపాజ్ ద‌శ ముందే వ‌చ్చేస్తుంది. ఇక పిల్ల‌ల్ని క‌న‌డంలో ఆల‌స్యం చేసిన‌ప్పుడు.. లేదా కీమోథెర‌పీ లాంటి ట్రీట్మెంట్లు తీసుకుంటున్న‌ప్పుడు ఈ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది.

ఒక ఫేమస్ ఫీమేల్ గైన‌కాల‌జిస్ట్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. త‌న ద‌గ్గ‌రికి ఓసారి 35 ఏళ్ల మ‌హిళ వ‌చ్చింద‌ట‌. ఆమెకు పిల్లలు క‌ల‌గ‌డం లేద‌ని చింతించింద‌ట‌. మూడేళ్ల నుంచి పిల్ల‌ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నా క‌న్సీవ్ అవ్వ‌లేద‌ట‌. ఆ యువ‌తి ఫ్యామిలీ హిస్ట‌రీ చూస్తే అంతా బాగానే ఉంది. ఎవ్వ‌రికీ ముంద‌స్తు మెనోపాజ్ దశ అనేది రాలేదు. కానీ ఈ 35 ఏళ్ల మ‌హిళ‌కు మ‌త్ర‌మే వ‌చ్చింది. వివిధ ర‌కాల ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఈస్ట్రోజెన్ హార్మోన్ త‌క్కువ‌గా ఉంద‌ట‌. ఈ ఈస్ట్రోజెన్ హార్మోన్ త‌గ్గితే పీరియ‌డ్స్ ఆగిపోవ‌డం.. లేదా మిస్స‌వ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

దీనివ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి?

ఈ ప్రీమెచ్యూర్ లేదా ఎర్లీ మెనోపాజ్ వ‌ల్ల చాలా ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. పిల్ల‌ల్ని క‌న‌లేక‌పోవ‌డం.. ఒక‌వేళ గ‌ర్భం దాల్చినా బేబీ లోప‌లే అబార్ట్ అయిపోయే ప్ర‌మాదాలు ఎక్కువ‌. మెనోపాజ్ ద‌శ‌లో ఓవ‌రీ శాతం త‌గ్గిపోతుంది కాబ‌ట్టి నేచుర‌ల్‌గా గ‌ర్భం దాల్చ‌లేరు. ఇందుకోసం ఐవీఎఫ్ వంటి ప‌ద్ధ‌తుల‌ను ఎంచుకోవాలి. ఓస్టియోపోరోసిస్.. అంటే ఎముక‌ల్లో బ‌లం త‌గ్గిపోతే ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఈస్ట్రోజెన్ త‌గ్గిపోవ‌డం వ‌ల్ల ఎముక‌ల్లో బ‌లం పోతుంది. అప్పుడు కాస్త చిన్న దెబ్బ‌ల‌కే ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈస్ట్రోజెన్ లెవెల్స్ త‌గ్గితే.. గుండె సంబంధిత వ్యాధులు కూడా వ‌స్తాయి. ఈస్ట్రోజెన్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

నివార‌ణ ఎలా?

జ‌న్యుప‌రంగా వ‌చ్చే ఈ ఎర్లీ, ప్రీమెచ్యూర్ మెనోపాజ్‌ను నివారించ‌లేం. ఫ్యామిలీ హిస్ట‌రీలో ఇలాంటి స‌మ‌స్య‌లు లేన‌ప్పుడు మ‌హిళ‌లు కొన్ని ర‌కాల లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకుంటే నివారించ‌డం సాధ్యం అవుతుంది. స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే వెంట‌నే మానేయండి. ఆహారం విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోండి. ఈస్ట్రోజెన్‌ను బాగా ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్.. అంటే సోయా, వెల్లుల్లి, నువ్వులు, న‌ట్స్ వంటివి రోజూ తీసుకుంటూ ఉండండి.