మీకు హ్రస్వదృష్టి సమస్య ఉందా? కళ్ళద్దాలంటే ఇష్టం లేదా? కళ్ళద్దాలకి బదులు వేరే మార్గమేమైనా ఉందా?

హ్రస్వదృష్టి (మయోపియా) అనేది చాలా సాధారణ కంటి సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. హ్రస్వదృష్టి సమస్య ఉన్నవారు..  దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటానికి ఇబ్బంది ఉంటుంది. దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. మీకు హ్రస్వదృష్టి సమస్య ఉందని మీరు గుర్తించలేకపోవచ్చు, ఎందుకంటే మీ దృష్టి నెమ్మదిగా మారుతూ ఉండవచ్చు లేదా దూరంగా ఉన్న వస్తువులు అందరికీ అస్పష్టంగానే కనిపిస్తున్నాయని మీకు అనిపించవచ్చు. మీకు దృష్టి సమస్యలు […]

Share:

హ్రస్వదృష్టి (మయోపియా) అనేది చాలా సాధారణ కంటి సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. హ్రస్వదృష్టి సమస్య ఉన్నవారు..  దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటానికి ఇబ్బంది ఉంటుంది. దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. మీకు హ్రస్వదృష్టి సమస్య ఉందని మీరు గుర్తించలేకపోవచ్చు, ఎందుకంటే మీ దృష్టి నెమ్మదిగా మారుతూ ఉండవచ్చు లేదా దూరంగా ఉన్న వస్తువులు అందరికీ అస్పష్టంగానే కనిపిస్తున్నాయని మీకు అనిపించవచ్చు. మీకు దృష్టి సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటే మీ డాక్టర్ ఆప్టమెట్రిస్ట్ లేదా నేత్ర వైద్యుడిని సంప్రదించడం మంచిది.

హ్రస్వదృష్టి యొక్క లక్షణాలు

మీకు హ్రస్వదృష్టి ఉండి ఉంటే మీకు ఈ లక్షణాలు ఉండవచ్చు,

  • దూరంలో ఉన్న వస్తువులను చూడటానికి కష్టంగా ఉండటం
  • దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపించటం
  • స్పష్టంగా చూడగలగాలంటే మీరు కళ్ళు చికిలించి చూడవలసిరావటం
  • మీకు కంటిచూపు వల్ల తలనొప్పి రావటం
  • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూడటం కష్టమవటం

పిల్లలలో హ్రస్వదృష్టి

హ్రస్వదృష్టి సాధారణంగా చదువుకొనే రోజుల్లో బయటపడుతుంది. 20 సంవత్సరాలు వచ్చేసరికి బాగా ఎక్కువ అవుతుంది. అందువల్ల చిన్నతనంలోనే దృష్టి లోపాన్ని కనిపెట్టడానికి ఈ విషయాలను గమనించుకుంటే మంచిది.

  • దూరంగా ఉన్న వస్తువులను చూసేందుకు వారి కళ్లను తిప్పడం లేదా మెల్లగా చూడటం
  • పాఠశాలలో బ్లాక్‌బోర్డ్‌ను చూడటం కష్టం
  • టెలివిజన్‌కి దగ్గరగా కూర్చోవడం లేదా తరగతి గది ముందు కూర్చోవడం.

హ్రస్వదృష్టికి కారణాలు

హ్రస్వదృష్టి ఉన్న వ్యక్తులలో, కంటిలోని కార్నియా చాలా నిటారుగా ఉంటుంది లేదా ఐబాల్ చాలా పొడవుగా ఉంటుంది. అంటే కంటిలోకి ప్రవేశించే కాంతి రెటీనాపై పడదు, కానీ రెటీనా ముందు పడుతుంది. కాబట్టి అస్పష్టంగా కనిపిస్తుంది.

హ్రస్వదృష్టి లోపానికి కారణాలు తెలియవు. అయితే ఇటీవలి పరిశోధనలు జన్యుపరమైనవి కావచ్చునని సూచిస్తున్నాయి. మీకు ఈ రకమైన కంటి సమస్య ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే మీకు వంశపారంపర్యంగా హ్రస్వదృష్టి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

హ్రస్వదృష్టికి మన జీవనశైలి కూడా కారణం కావచ్చు. కంప్యూటర్ స్క్రీన్‌ను చదవడం లేదా చూడటం వంటి వాటిపై ఎక్కువ సమయం దృష్టి సారించే పిల్లలు హ్రస్వదృష్టి గలవారిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే, సహజ కాంతిలో ఆరుబయట సమయం గడపకపోవడం వల్ల  హ్రస్వదృష్టి పెరిగే అవకాశాలను పెంచుతుంది.

హ్రస్వదృష్టి లోపాన్ని నిర్ధారించడం ఎలా?

హ్రస్వదృష్టిని నిర్ధారించడం సులువే. సాధారణంగా నేత్ర వైద్యుడు పైన పెద్ద అక్షరాలు, క్రింద చిన్న అక్షరాలు ఉన్న ప్రత్యేక స్నెల్లెన్ చార్ట్ చదవమని మిమ్మల్ని అడుగుతారు. మీరు అన్ని అక్షరాలనూ స్పష్టంగా చూడగలిగితే మీదృష్టి 6/6 ఉంటుంది. మీకు 6/12 దృష్టి ఉంటే, సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి 12 మీటర్ల దూరంలో నుండి చదవగలిగే అక్షరాలను మీరు 6 మీటర్ల దూరంలో ఉండి చదవగలిగారని అర్థం.

మీరు కంటి పరీక్ష కోసం వెళ్ళినప్పుడు డాక్టర్లు మీ కంటి ఆరోగ్యం, దృష్టికి సంబంధించిన ఇతర అంశాలను కూడా చెక్ చేస్తారు.

హ్రస్వదృష్టి లోపానికి చికిత్స

మీకు ఈ కంటి సమస్య ఉంటే మీ దృష్టిని మెరుగుపరిచే పద్ధతులు ఉన్నప్పటికీ, హ్రస్వదృష్టి లోపానికి నివారణ ఇంతవరకు కనుగొనలేదు.

మీకు హ్రస్వదృష్టి ఉన్నట్లయితే మీ దృష్టిని సరిదిద్దడానికి మార్గాలు:

కళ్ళద్దాలు పెట్టుకోవడం – ఇది మీ దృష్టిని సరిచేయడానికి సులభమైన, సురక్షితమైన మార్గం. కానీ కొందరికి కళ్ళద్దాలు పెట్టుకోవడం ఇష్టం లేకపోవచ్చు.

కాంటాక్ట్ లెన్సులు ధరించడం – ఇవి నేరుగా కంటిపై ధరిస్తారు. అయితే దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

లేజర్ చికిత్స – కార్నియా ఆకారాన్ని మార్చడానికి లేజర్ చికిత్స చేస్తారు.

కంటిలోపల లెన్స్ అమర్చే శస్త్రచికిత్స – మీ లెన్స్‌కి బదులు చిన్న ప్లాస్టిక్ లెన్స్ (ఇంట్రాకోక్యులర్ లెన్స్) పెడతారు.

మీకు హ్రస్వదృష్టి సమస్య ఉన్నట్లయితే, మీకు ఇతర కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు:

  • కంటి వెనుక భాగం అంటే రెటీనా సాగిపోవటం, సన్నబడటం
  • రెటీనాలో రంధ్రాలు పడటం, కన్నీళ్లు రావటం.
  • ఇంకా మంరికొన్ని కంటి సమస్యలు
  • మరింత సమాచారం కోసం మీ ఆప్టమెట్రిస్ట్ లేదా నేత్ర వైద్యునితో మాట్లాడండి.