పసుపు సప్లిమెంట్స్ కాలేయానికి హాని క‌లిగిస్తాయా?

పసుపును పచ్చిగా, ముడిగా తీసుకుంటే చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే పసుపు సప్లిమెంట్లు సుదీర్ఘ కాలం పాటు వాడటం మాత్రం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పసుపు.. మన దైనందిన జీవితంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. ఒంటికీ, ఇంటికీ పసుపు ఎంతో ముఖ్యం. సర్వ రోగ నివారిణి కూడా. అంత బలమైనది పసుపు. కరోనా సమయంలో ఈ సూపర్‌‌ఫుడ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణం […]

Share:

పసుపును పచ్చిగా, ముడిగా తీసుకుంటే చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే పసుపు సప్లిమెంట్లు సుదీర్ఘ కాలం పాటు వాడటం మాత్రం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

పసుపు.. మన దైనందిన జీవితంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. ఒంటికీ, ఇంటికీ పసుపు ఎంతో ముఖ్యం. సర్వ రోగ నివారిణి కూడా. అంత బలమైనది పసుపు. కరోనా సమయంలో ఈ సూపర్‌‌ఫుడ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణం పసుపులో ఎక్కువ. కాలేయానికి హాని కలిగించే టాక్సిన్స్‌ను నిరోధించేంత శక్తిమంతమైనది కూడా. మరి ఇలాంటి పసుపు మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందా? అంటే అలాంటిదేమీ లేదని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్‌లోని డైరెక్టర్ ఎస్‌కే సారిన్ చెప్పారు. అల్లం లేదా దోసకాయ మాదిరి పచ్చిగా తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. రసం లేదా ‘రా’ ఫార్మ్‌లో ఉన్నప్పుడు సైటోకిన్‌లను కలిగి ఉంటుందని, ఇది సురక్షితమని కూడా అంటున్నారు. 

కాలేయ సంబంధిత సమస్యలు ఎందుకు?

అయితే ఆరోగ్యం కోసమని ఎక్కువ మంది పసుపును ఎక్కువగా వినియోగిస్తున్నారు. మందు కూడా అధిక మోతాదులో వాడితే విషం అవుతుందన్నట్లుగా పరిస్థితి తయారవుతోంది. క్యాప్సుల్ రూపంలో ఉండే పసుపు సప్లిమెంట్లు కేవలం కర్కుమిన్ సారం మాత్రమే. ఈ మందులు సాధారణంగా గ్రౌండ్ టర్మరిక్ సర్వింగ్‌లో పొందే దాని కంటే ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. దీర్ఘకాలం వాడితే కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్య విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. గట్ బ్యాక్టీరియాను మాడ్యులేట్ చేయడంలో పసుపు కీలకంగా పని చేస్తుంది. సాధారణంగా వీటిని ముడి రూపంలోనే ఉపయోగించాలి. గాఢత కలిగిన పసుపు సప్లిమెంట్లు కాలేయానికి మంచివి కావు. గిలోయ్ వంటి హెర్బల్ సప్లిమెంట్లు, వాటి తయారీ కరోనా సమయంలో విపరీతంగా పెరిగింది. వీటిని ఇంకా రెగ్యులేట్ చేయలేదు. ఇవి హానికరం కూడా. హుర్బ్స్ ఇండ్యూస్డ్ లివర్ (హెచ్‌ఐఎల్) గాయాలకు గురయ్యే ప్రమాదం ఉంది. పసుపు సప్లిమెంట్లను వైద్యుల సూచన ప్రకారం, అది కూడా పరిమిత మోతాదులో ఉపయోగించాలి. వైద్య నిపుణులు చెబుతున్న విషయాలను విస్మరించడానికి లేదు. ఆయా మందులను ఉపయోగించేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. 

పసుపు ఎలా తీసుకోవచ్చు..

పసుపును ఎప్పుడు ‘రా’ గానే అంటే ముడిగానే తీసుకోవాలి. అంటే ప్రాసెస్ చేసి ఉండకూడదు. అల్లం, దోసకాయను పచ్చిగా ఎలా తీసుకుంటున్నామో అలానే తీసుకోవాలి. పచ్చి పసుపు జ్యూస్ రూపంలో ఉంటే.. ఎక్కువగా పని చేసే సైటోకిన్‌లను కలిగి ఉంటుంది. పసుపును ఎండబెట్టడం, లేదా ఉడికించడం వల్ల ఈ పదార్థాలు క్రియారహితంగా మారిపోతాయి. పసుపును పచ్చిగా, మూడిగా తీసుకుంటే ఎన్నటికీ ఎలాంటి హాని కలిగించదు. తినదగనివి కానివి, సప్లిమెంట్లు, శరీరానికి అవసరమైన దానికంటే తీసుకుంటే శరీరానికి గాయాలనే మిగులుస్తాయి. అదే సహజ రూపంలో తీసుకుంటే రియాక్షన్స్ చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి. 

ప్రయోజనాలివీ..

పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు అపారం. బలమైన యాంటీ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్‌‌ (టీఎన్ఎఫ్‌)ని కలిగి ఉంటుంది. ఎవరైనా మందు తాగినా పొగ తాగినా, ఊబకాయం ఉన్నా.. ట్యూమర్ ఏర్పడటానికి, ‘ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్‌ ఆల్ఫా‌’ గా పిలిచే గాయం కావడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు ఈ పరిస్థితులను సూపర్‌‌ఫుడ్‌గా ఎదుర్కొంటుంది. ఇది ప్రయోజనకరమైన అనేక ఆల్కలాయిడ్లను కలిగి ఉంటుంది. పసుపులోని కర్కుమిన్ మంటను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. టైప్2 డయాబెటిస్ నివారణలో కీలకపాత్ర పోషిస్తుంది.