ఒమేగా 3 సూప‌ర్ హీరో లాంటిది

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఇదీ ఒక‌టి. దీనిని శరీరం స్వతహాగా త‌యారు చేసుకోలేదు. అందుకే మ‌నం ఆహారాల‌ ద్వారా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను శ‌రీరానికి అందించాల్సి ఉంటుంది. అయితే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను ఎందుకు తీసుకోవాలి.? అస‌లు దీని ఉప‌యోగాలు ఏంటీ.? అన్న విష‌యాలు చాలా మందికి తెలియ‌దు. అలాంటి వారు ఖ‌చ్చితంగా ఈ ఆర్టిక‌ల్‌పై ఓ లుక్కేయాల్సిందే. గుండె ఆరోగ్యానికి ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో […]

Share:

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఇదీ ఒక‌టి. దీనిని శరీరం స్వతహాగా త‌యారు చేసుకోలేదు. అందుకే మ‌నం ఆహారాల‌ ద్వారా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను శ‌రీరానికి అందించాల్సి ఉంటుంది. అయితే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను ఎందుకు తీసుకోవాలి.? అస‌లు దీని ఉప‌యోగాలు ఏంటీ.? అన్న విష‌యాలు చాలా మందికి తెలియ‌దు. అలాంటి వారు ఖ‌చ్చితంగా ఈ ఆర్టిక‌ల్‌పై ఓ లుక్కేయాల్సిందే.

గుండె ఆరోగ్యానికి ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో మేలు చేస్తాయి.రెగ్యుల‌ర్‌గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకుంటే గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించి అనేక వైర‌స్‌లు, ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు ద‌రి చేర‌కుండా ర‌క్షించ‌డంలోనూ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మెద‌డు ప‌ని తీరును ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, ఒత్తిడి మ‌రియు డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లను ద‌రి చేర‌కుండా కాపాడ‌టంలోనూ, ర‌క్త పోటును అదుపులో ఉంచ‌డంలోనూ, లివ‌ర్‌లో కొవ్వు పెర‌గ‌కుండా అడ్డు క‌ట్ట వేయ‌డంలోనూ, నెల‌స‌రి స‌మ‌యంలో నొప్పుల‌ను నివారించ‌డంలోనూ, బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌డంలోనూ.ఇలా ఎన్నో విధాలుగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉప‌యోగ‌ప‌డతాయి.

అందుకే ప్ర‌తి రోజు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. వాల్ న‌ట్స్‌, పిస్తా ప‌ప్పు, బాదం ప‌ప్పు, గుడ్లు, సీ ఫుడ్‌, మాంసం, అవ‌కాడో పండ్లు, అవిసె గింజలు, గుమ్మ‌డి గింజ‌లు, ఆలివ్ ఆయిల్‌, చియా విత్త‌నాలు, బ్రొకోలి వంటి ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే శ‌రీరానికి పుష్క‌లంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి.

ముంబై సెంట్రల్‌లోని వోక్‌హార్డ్ హాస్పిటల్స్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ హనీ సావ్లా హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు చెందిన జరాఫ్‌షాన్ షిరాజ్‌ ఒక ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు, “ప్రతి ఒక్కరూ ఈ సప్లిమెంట్ తీసుకోవలసిన అవసరం లేదు, లోపాలు లేదా చర్మ సమస్యలు ఉన్నవారు మాత్రమే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను తీసుకోవచ్చు. అలాగే, కఠినమైన శాఖాహారం ఉన్నవారు మరియు సీఫుడ్ తీసుకోని వారికి ఈ సప్లిమెంట్ అవసరం కావచ్చు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సముద్రపు ఆహారంలో కనిపిస్తాయి, అయినప్పటికీ, అనేక రకాల మొక్కల ఆహారాలలో కూడా అందుబాటులో ఉంటాయి.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మూడు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ఎఎల్ఎ). రెండోది ఎకోసాపెంటనోయిక్ ఆమ్లం (ఇపిఎ). మూడోది డోకోసాహెక్సానోయిక్ ఆమ్లం (డిహెచ్ఎ). పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. నిరాశ లక్షణాలను తగ్గించడండానికి  ఇపిఎ అంటే ఎకోసాపెంటయనోయిక్ ఆమ్లం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

డిహెచ్ఎ అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కంటి రెటీనా భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దృష్టి లోపం, అంధత్వానికి కారణమయ్యే మాక్యులర్ క్షీణతను నివారించడానికి ఈ కొవ్వులు ఆమ్లాలు బాగా సహాయపడతాయి. శిశువుల మెదడు పెరుగుదల, అభివృద్ధికి ఒమేగా -3 కీలక పాత్ర పోషిస్తుంది. గర్భధారణ సమయంలో తగినంత ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లను తీసుకుంటే శిశువు పెరుగుదల బాగుంటుంది. మెరుగైన అభిజ్ఞా అభివృద్ధికి ఒమేగా -3 ఎంతో సహాయపడుతుంది.

ఒమేగా -1 కొవ్వు ఆమ్లాలు టైప్ 3 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పెద్దప్రేగు పూత, సోరియాసిస్ తో సహా అనేక స్వయం ప్రతిరక్షక వ్యాధులకు చికిత్స చేయడానికి, వాటిని నివారించడానికి సహాయపడతాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వయస్సు-సంబంధిత మానసిక క్షీణత, అల్జీమర్స్ వ్యాధిని నివారించడానికి కూడా సహాయపడతాయి. 

ఒమేగా-3 లోపం లక్షణాలు: 

*చర్మం

*జుట్టు 

*గోళ్లలో మార్పులు

*హృదయ సంబంధ సమస్యలు

*ఏకాగ్రత లోపం సమస్యలు

*కీళ్ల నొప్పులు

*కాళ్ల నొప్పులు

*అలసట

*నిద్ర సమస్యలు