డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏంటి? దాని లక్షణాలు కారణాలు ఎలా ఉంటాయి?

ప్రస్తుత కాలంలో మనము తీసుకునే ఆహారంలో మార్పులు, జీవనశైలి లో సరైన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల రకరకాల జబ్బుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి. అత్యంత సైలెంట్ గా వచ్చి ప్రజల ప్రాణాలను కూడా తీసుకెళ్లే ప్రమాదకరమైన రోగాలలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. డయాబెటిస్ వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కూడా మొదట కనిపించవు.. కానీ సమస్య ముదిరే కొద్దీ వాటి సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతూ […]

Share:

ప్రస్తుత కాలంలో మనము తీసుకునే ఆహారంలో మార్పులు, జీవనశైలి లో సరైన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల రకరకాల జబ్బుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి. అత్యంత సైలెంట్ గా వచ్చి ప్రజల ప్రాణాలను కూడా తీసుకెళ్లే ప్రమాదకరమైన రోగాలలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. డయాబెటిస్ వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కూడా మొదట కనిపించవు.. కానీ సమస్య ముదిరే కొద్దీ వాటి సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. అందుకే డయాబెటిస్ రాకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు అందరిని మరింత బాధిస్తున్న సమస్య డయాబెటిక్ నెఫ్రోపతి.. ఇది మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి అని చెప్పవచ్చు..

మన శరీరంలో జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసినప్పుడే.. మూత్రపిండాల పనితీరు బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాము.. లేకపోతే మరెన్నో సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. డయాబెటిక్ నెఫ్రోపతి అనేది టైప్ 1 డయాబెటిస్ అలాగే టైప్ 2 డయాబెటిస్ ల యొక్క అత్యంత భయంకరమైన సమస్య అని చెప్పవచ్చు. దీనిని డయాబెటిక్ కిడ్నీ వ్యాధి అని కూడా పిలుస్తారు. మధుమేహంతో బాధపడుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ డయాబెటిక్ నెఫ్రోపతి ఉందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.  డయాబెటిక్ నెఫ్రోపతి సమస్య వచ్చినప్పుడు శరీరం నుండి వ్యర్ధపదార్థాలను అలాగే అదనపు ద్రవ్యాలను తొలగించే సాధారణ పనిని కూడా నియంత్రిస్తాయి.

తద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఈ సమస్యను గుర్తించకుండా ఉన్నట్లయితే మూత్రపిండాల పనితీరు సన్నగా దెబ్బతింటుంది. సమస్యను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు.  లేకపోతే మరెన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్య ముదిరిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సమయంలో మూత్రపిండాలకు డయాలసిస్ లేదా మూత్రపిండి మార్పిడి చేయాల్సి ఉంటుంది.  అందుకే డయాబెటిస్ పేషంట్లలో తరచూ వచ్చే వీటిని ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే ముందుగా రక్తపోటు నియంత్రణలో ఉండదు.. మూత్రంలో ప్రోటీన్లు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. 

పాదాలు, చీలమండలు, కళ్ళు , చేతులు వాపులు సంభవిస్తాయి. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. ఏకాగ్రతను కోల్పోతారు. మనసు  ప్రశాంతతను కోల్పోతుంది. శ్వాస సరిగా ఆడక పోవడం, ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, నిరంతరం శరీరం దురద పెట్టడం ,అలసట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నట్లయితే వెంటనే మీ సమీపంలో ఉన్న డయాబెటిక్ డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ మధుమేహంతో బాధపడుతున్న ప్రతి రోగి కూడా తీరును కొలిచే పరీక్షల కోసం సంవత్సరానికి ఒకసారి కచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది.  లేకపోతే డయాబెటిస్ పేషెంట్లు ఇలాంటి వ్యాధుల బారిన పడాల్సిన ప్రమాదం రావచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ఈ డయాబెటిస్ కిడ్నీ వ్యాధి రావడానికి కారణం హైపర్ గ్లైసిమియాతోపాటు రక్తపోటు, ధూమపానం చేయడం, అధిక రక్త కొలస్ట్రాల్ ,ఊబకాయం, మధుమేహం, కుటుంబ చరిత్ర, మూత్రపిండాల వ్యాధి వంటి కారణాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.  కాబట్టి వీలైనంత త్వరగా సమస్యను మొదట్లోనే పరిష్కరించుకోవడం ఉత్తమమైన పద్ధతి అని వైద్యులు చెబుతున్నారు.