ఖాళీ కడుపుతో ఉన్నపుడు అస్సలుకే వీటి జోలికి పోకండి

మనకు ఆకలి వేసినపుడు చాలా రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం. చాలా మంది పొద్దు, పొద్దున్నే ఖాళీ కడుపుతో ఉండి, ఇంట్లో ఏది ఉంటే అది లాగించేస్తూ ఉంటారు. కానీ, అలా పొద్దున్నే ఏది పడితే అది తినడం వలన మన కడుపు అప్​సెట్ అవుతుంది. అందుకోసమే మనం తినే ఆహారాల విషయంలో కేర్ తీసుకోవాలని చాలా మంది నిపుణులు చెబుతారు. మరీ ముఖ్యంగా మనం ఖాళీ కడుపుతో ఉండి తినే ఆహారాల విషయంలో మరింత జాగ్రత్త […]

Share:

మనకు ఆకలి వేసినపుడు చాలా రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం. చాలా మంది పొద్దు, పొద్దున్నే ఖాళీ కడుపుతో ఉండి, ఇంట్లో ఏది ఉంటే అది లాగించేస్తూ ఉంటారు. కానీ, అలా పొద్దున్నే ఏది పడితే అది తినడం వలన మన కడుపు అప్​సెట్ అవుతుంది. అందుకోసమే మనం తినే ఆహారాల విషయంలో కేర్ తీసుకోవాలని చాలా మంది నిపుణులు చెబుతారు. మరీ ముఖ్యంగా మనం ఖాళీ కడుపుతో ఉండి తినే ఆహారాల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. మనం ఖాళీ కడుపుతో ఉన్నపుడు ఈ కింద పేర్కొన్న కొన్ని రకాల ఆహారాల జోలికి అస్సలుకే వెళ్లకూడదు. ఈ ఆహారాలను తినడం వలన మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన కడుపు మొత్తం ఏదో అనీజీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతే కాకుండా కొందరిలో గ్యాస్, ఉబ్బరం, కడుపులో మండడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. 

నిద్రపోయి లేచిన తర్వాత ఏది పడితే అది తినకూడదు

ఎక్కువ గంటలు నిద్రపోయి లేచిన తర్వాత కొంత మంది ఏది పడితే అది తింటూ ఉంటారు. కానీ అలా తినకూడదు. మనం చాలా గంటల సేపు నిద్ర పోతాం కదా.. అప్పుడు మన జీర్ణవ్యవస్థ కూడా రెస్ట్ తీసుకుంటుంది. మనం పొద్దున్నే ఇలా ఏది పడితే అది తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మనం పొద్దున లేచిన తర్వాత అల్పాహారం తినాలని చాలా మంది న్యూట్రీషియనిస్టులు సూచిస్తున్నారు. పొద్దుపొద్దునే లేచిన తర్వాత, మనం ముట్టుకోకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటని ఓ సారి లుక్కేస్తే.. 

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్ (ఘాటు ఎక్కువగా ఉండే ఆహారాలు) అనేవి ఎప్పటికైనా మనకు హానినే కలిగిస్తాయి. వీటిని పొద్దున పూట పరిగడుపున అస్సలుకే తినకూడదు. పొద్దున వీటిని తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన గర్భాశయ లైనింగ్​కు ఇవి చికాకు కలిగించే ప్రమాదం ఉంది. అందుకోసం వీటిని పరిగడుపున తీసుకోకూడదు. చాలా మందికి ఇవి ఎప్పుడు తీసుకున్నా కానీ కడుపులో మంట వంటి సెన్సేషన్​ను కలిగిస్తాయి. అందుకోసమే వీటిని తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. ఇవి కడుపులో ఆమ్ల ప్రతిచర్యకు కారణం అవుతాయి. అంతే కాకుండా ఇవి అజీర్ణాన్ని ప్రేరేపిస్తాయి. కావున పొద్దున్నే వీటి జోలికి పోకుండా ఉండడం ఉత్తమం. 

షుగరీ ఫుడ్స్ లేదా పానీయాలు 

షుగరీ ఫుడ్స్​ను కూడా పొద్దు పొద్దుగాలే తీసుకోవడం మంచిది కాదు. షుగరీ ఫుడ్స్ తీసకుంటే ఏమవుతుందిలే అవేం స్పైసీ ఫుడ్స్ కాదు కదా అని చాలా మందికి అనిపించవచ్చు. అంతే కాకుండా పరిగడుపునే పండ్ల రసాలను తాగడం చాలా మంచిదని చాలా మంది భావిస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదని పలువురు న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన మీ క్లోమంపై ప్రభావం పడుతుందని అంటున్నారు. కడుపు ఖాళీగా ఉండడంతో ప్రక్టోజ్ రూపంలో ఉండే చెక్కెర మీ కాలేయంపై ఓవర్​ లోడ్​ను కలగజేస్తుంది. ఇక ప్రాసెస్ చేయబడిన చెక్కెరలు మరీ అధ్వాన్నంగా ఉంటాయి. కావున డెజర్ట్​లు మితిమీరిన తీపి స్మూతీలను పొద్దు పొద్దున్నే పరి గడుపున తీసుకోవడం మంచిది కాదు. కావున తీపి మరియు కారం పదార్థాలను పొద్దుపొద్దున్నే నివారించండి.