స్క్వాట్స్ చేసిన తర్వాత మోకాలి నొప్పులు బాధిస్తున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి

శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు ఎన్నో ఎక్సైజ్ లు మనకు అందుబాటులో ఉన్నాయి.  అందులో స్క్వాట్స్ అనేవి ఉత్తమమైన వ్యాయామం. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఈ ఎక్ససైజ్ అద్భుతంగా పనిచేస్తుంది. స్క్వాట్స్ చేయడం రోజు తమ దినచర్యలో భాగంగా చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. దీనివలన బరువు తగ్గడమే కాకుండా శరీర దారుఢ్యం,  ఆరోగ్యం, జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. అనారోగ్య ఛాయలే మన దారి చేరకుండా ఉండాలంటే ప్రతి రోజు కొంత సమయాన్ని […]

Share:

శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు ఎన్నో ఎక్సైజ్ లు మనకు అందుబాటులో ఉన్నాయి.  అందులో స్క్వాట్స్ అనేవి ఉత్తమమైన వ్యాయామం. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఈ ఎక్ససైజ్ అద్భుతంగా పనిచేస్తుంది. స్క్వాట్స్ చేయడం రోజు తమ దినచర్యలో భాగంగా చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. దీనివలన బరువు తగ్గడమే కాకుండా శరీర దారుఢ్యం,  ఆరోగ్యం, జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. అనారోగ్య ఛాయలే మన దారి చేరకుండా ఉండాలంటే ప్రతి రోజు కొంత సమయాన్ని ఈ వర్కౌట్కు విధిగా కేటాయించాలి. అయితే స్క్వాట్స్ చేసిన తర్వాత కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్క్వాట్స్ చేయడంలో చాలా రకాలు ఉన్నాయి. అయితే అందులో బేసిక్ విధానాన్ని ఫాలో అవ్వాలి ముందుగా నిటారుగా నిలబడండి. ఆ తర్వాత రెండు కాళ్ళ మధ్య కాస్త గ్యాప్ ఇస్తూ బ్యాలెన్స్ గా నిలబడండి. మీ ఉదర కండరాలను కాస్త గట్టిగా లోపలికి నొక్కి పట్టండి. పొట్టని కొద్దిగా ముందుకు నొక్కినట్లుగా ఉంచండి. అయితే చాలామంది పొట్ట భాగాన్ని ఎక్కువగా ముందుకు నొక్కి ఉంచుతారు. కానీ అది తప్పు. తరువాత మీరు ఒక కుర్చీలో కూర్చునే యాంగిల్ లో మీ పిరుదులను దించుతూ కిందకు వెళ్లాలి. నెమ్మదిగా కొద్దిసేపు ఆ యాంగిల్ లో ఉండాలి. తర్వాత ఏ విధంగా అయితే కిందకు బాడీని డౌన్ చేస్తూ వెళ్ళాము అదే యాంగిల్ లో శరీరాన్ని పైకి తీసుకురావాలి. వెన్నుముకను నిటారుగా ఉంచాలి. ఇలా చేసేటప్పుడు మీ రెండు చేతులను చాపి ఉంచాలి. మీకు సాధ్యమైనంత వరకు ఇలా చేయడానికి ప్రయత్నించాలి. సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాయామాలను అలవాటు చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాలను సొంతం చేసుకోవచ్చు. ఇలా చేస్తుంటే స్క్వాట్స్ ఫేవరెట్ ఎక్ససైజ్ గా మారుతుంది. కానీ ఈ విధానంలో చేయకుండా మీరు తప్పుగా చేస్తే మాత్రం మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తాయి.
స్క్వాట్స్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి. కానీ వాటిని పర్ఫెక్ట్ యాంగిల్ లో చేస్తేనే ప్రయోజనాలు కలుగుతాయి. సరైన విధంగా చేయకపోతే మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.  మీరు కూర్చునే యాంగిల్ మీ మోకాళ్ళ పైన అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దాని వలన నొప్పి ఎక్కువ కావడానికి దారితీస్తుంది. కాలి కండరాలు, క్వాడ్రిస్ప్స్, హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ ఇవి మోకాలికలు స్థిరత్వంపై వాటి అమరికపై ప్రభావం చూపుతాయి. స్క్వాట్స్ ఎక్కువ సేపు చేయడం వల్ల మీ శారీరక బరువు అంతా కూడా మీ మోకాళ్లపై పడుతుంది. ఫలితంగా కొన్ని కొన్ని సార్లు కండరాలు వెనక వచ్చు స్క్వాటిన్ సమయంలో మీ మోకాళ్లపై నొప్పి, మంటను కూడా కలిగించవచ్చు.  ఎక్కువసేపు స్క్వాట్స్ చేయకూడదు. మితిమీరితే  విధంగా స్క్వాట్స్ చేయడం వల్ల మోకాళ్ళ, కీలు చుట్టుపక్కల కణజాలాలు అరిగిపోవచ్చని గుర్తుంచుకోండి. శరీరానికి ముఖ్యంగా మోకాళ్ళకి కీళ్లు దగ్గర ప్రెజర్ ఎక్కువగా ఇవ్వడం వల్ల గతంలో మీ కాళ్లకు ఏమైనా గాయాలు తగిలితే ఆ నొప్పి ప్రమాదాన్ని మరలా వచ్చే అవకాశం లేకపోలేదు. వైద్యులు చెబుతున్న విధానం ప్రకారం సరైన స్కాటింగ్ టెక్నిక్ చేయగలిగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు అస్సలు రావని చెబుతున్నారు. అయితే మోకాళ్ళ సమస్యలు ఉన్నవారు మాత్రం స్క్వాట్స్ ఎక్కువ సేపు చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్వాట్స్ చేసేటప్పుడు కూడా సరైన భోజనం, హిప్, మోకాలి అమరిక, హిప్ డౌన్ చేయడం చాలా ముఖ్యమైనవి. ఇవే కీలకమైన పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి. జాయింట్ మొబిలిటీని పెంచడానికి , కండరాల ఒత్తిడిని తగ్గించడానికి, డైనమిక్ మూమెంట్లు, ఫోమ్ రూలింగ్ తో సహా స్కాటింగ్ కు ముందు చేయడం మర్చిపోకండి. ఒకవేళ స్క్వాట్స్ చేయడం వల్ల మీకు ఏదైనా నొప్పి వాపు ఉంటే వెంటనే ఐస్ తో మర్దన చేసుకోండి లేదంటే హీట్ థెరపీని ట్రై చేయండి.