సూర్య న‌మ‌స్కారాలు చేస్తున్నారా?

యోగాసనాలలో అత్యంత కీలక మైనది సూర్య నమస్కారం. మన పురాణాలలో ప్రసిద్ధి గాంచిన ఎంతో మంది మహానుభావులు కూడా తూచా తప్పకుండ ఫాలో అయ్యే ఆసనాలలో ఒకటి ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే యోగాసనాలలో సూర్య నమస్కారం అనేది లేకుండా సంపూర్ణం కాదు. ఈ ఆసనం చెయ్యడం వల్ల మెదడు మీద ఎంతో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంతే కాకుండా మన శరీరం లో ఉన్న ప్రతీ కణం కూడా స్పందిస్తుంది. అంతే కాదు ఈ […]

Share:

యోగాసనాలలో అత్యంత కీలక మైనది సూర్య నమస్కారం. మన పురాణాలలో ప్రసిద్ధి గాంచిన ఎంతో మంది మహానుభావులు కూడా తూచా తప్పకుండ ఫాలో అయ్యే ఆసనాలలో ఒకటి ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే యోగాసనాలలో సూర్య నమస్కారం అనేది లేకుండా సంపూర్ణం కాదు. ఈ ఆసనం చెయ్యడం వల్ల మెదడు మీద ఎంతో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంతే కాకుండా మన శరీరం లో ఉన్న ప్రతీ కణం కూడా స్పందిస్తుంది. అంతే కాదు ఈ సూర్య నమస్కారం చెయ్యడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా లభిస్తుందట. అంతే కాదు మనం చూసే ప్రత్యక్ష దేవుడు కూడా ఆయనే కాబట్టి, ఈరోజు తలపెట్టిన ప్రతీ కార్యం శుభ ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటుంటాము. తెల్లవారు జామున నులివెచ్చని సూర్య కిరణాలూ మన శరీరం మీద పడితే ఎంతో ఆరోగ్యం అట. అంతే కాకుండా ఈ సూర్య నమస్కారం వల్ల మనకి ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాము.

స్పైనల్ కార్డ్ సురక్షితంగా ఉంటుంది :

మన శరీరం లో అత్యంత ముఖ్యమైనది స్పైనల్ కార్ట్. దానిని సురక్షితంగా ఉంచుకున్నని రోజులు మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. వివిధ రకమైన బంగిమలతో మనం సూర్య నమస్కారం ప్రతీ రోజు చెయ్యడం వల్ల మన స్పైనల్ కార్డ్ ఫంక్షనింగ్ చాలా చురుగ్గా ఉంటుంది.

కాంతివంతమైన చర్మం :

సూర్యనమస్కారం ప్రతీ రోజు చెయ్యడం వల్ల మనకి జరిగే మరో మేలు కాంతివంతమైన చర్మం రావడమే. మన శరీరానికి సరఫరా అయ్యే ఆక్సిజన్ మరియు రక్తం చాలా స్వచ్ఛం గా ప్రవహించేలా చేస్తుంది. అందువల్ల మన చర్మం ఎల్లప్పుడూ ఫ్రెష్ గా మరియు కాంతివంతం గా ఉంటుంది.

హార్మోన్ బ్యాలెన్స్ :

మన శరీరం లో హార్మోన్ బ్యాలన్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అనేది తప్పనిసరి, ఈ ఆసనం చెయ్యడం వల్ల  థైరాయిడ్, అడ్రినల్ మరియు పిట్యూటరీ గ్రంధులు మీద చాలా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. దీని వల్ల మన శరీరం లో మెటాబోలిజం ప్రక్రియ వేగవంతం అవుతూ, మన మూడ్ స్వింగ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇక అమ్మాయిలకు పీరియడ్స్ కూడా సమయానికి అయిపోతుంది.

బరువు తగ్గుట :

వీటి అన్నిటితో పాటుగా సూర్య నమస్కారం చెయ్యడం వల్ల మన అందరం ఎదురుకునే కామన్ సమస్య బరువుని కూడా బాగా తగ్గిపోవచ్చు అట. మన నడుము భాగం లో కొవ్వు ఎక్కువగా చేరిపోతుంది. ఎందుకంటే మనం తినే త్రిందికి సంబంధించిన వ్యర్థం మొత్తం ఆ భాగం లోనే పెరుగుపోతుంది. ఇందువల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. అది ప్రాణాలకే హానికరం, అయితే సూర్య నమస్కారం చెయ్యడం వల్ల నడుము భాగం లో కొవ్వు కొరిగే ఛాన్స్ ఉంటుంది. అంతే కాకుండా యాబ్స్ భాగం లో కూడా కండరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

స్వచ్ఛమైన శ్వాస పీల్చుకోవచ్చు :

మన శరీరం లో చాలా రంద్రాలు స్వచ్ఛమైన వాయువు దక్కక మూసుకొని పొయ్యి ఉంటాయి. కానీ వివిధ భంగిమల ద్వారా చేయబడే సూర్య నమస్కారాలు వల్ల మన శరీరం లో ఉన్న రంద్రాల్లో బ్లాక్స్ అన్నీ సడలిపోయి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు.

ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగుంటుంది:

ఈ ఆసనం వల్ల  మనకి కలిగే మరో గొప్ప మేలు బ్లడ్ ప్రజర్ కంట్రోల్ లో ఉండడం. చిన్న వయస్సు ఉన్నవాళ్లు కూడా రక్తపోటు తో ఇబ్బంది పడుతుంటారు. ఈ ఆసనం ప్రతీ రోజు మిస్ కాకుండా చెయ్యడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. అంతే కాదు మన గుండె కూడా రెగ్యులర్ ఇంటెర్వల్స్ లో సరిగ్గా కొట్టుకుంటుంది. మన రక్తం లో ఉన్న షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.