డెంగ్యూ  సీజన్.. జాగ్రత్త

డెంగ్యూ జ్వరం అనేది దోమల వల్ల సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఏడిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది.డెంగ్యూ మళ్ళీ వస్తుంది. ఇండియాలో వర్షాకాలం వస్తే చాలు డెంగ్యూ వస్తుంది. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరుగుతూ ఉన్నాయి. డెంగ్యూ ఫీవర్  దోమల వల్ల సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఏడిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది. డెంగ్యూ కేసుల పెరుగుదల అనేది ఆందోళనకరంగా ఉంది. శారదా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రేయ్ శ్రీవాస్తవ్ ఏమన్నారంటే, డెంగ్యూ […]

Share:

డెంగ్యూ జ్వరం అనేది దోమల వల్ల సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఏడిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది.డెంగ్యూ మళ్ళీ వస్తుంది. ఇండియాలో వర్షాకాలం వస్తే చాలు డెంగ్యూ వస్తుంది. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరుగుతూ ఉన్నాయి. డెంగ్యూ ఫీవర్  దోమల వల్ల సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఏడిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది. డెంగ్యూ కేసుల పెరుగుదల అనేది ఆందోళనకరంగా ఉంది. శారదా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రేయ్ శ్రీవాస్తవ్ ఏమన్నారంటే, డెంగ్యూ ఎడిస్ దోమ ద్వారా వస్తుంది, ఈ దోమ గుడ్లు నీళ్లలో పెడుతుందని చెప్పారు. డెంగ్యూ ఫీవర్ సింప్టమ్స్ ఒక్కోళ్లలో ఒక్కోలా ఉంటాయి. హై ఫీవర్, బాగా తలనొప్పి, జాయింట్ పెయిన్స్ , రాషెస్ వంటివి ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ ఎక్కువైతే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ప్రాణాంతకం కూడా అవ్వచ్చు ఈ ఎడిస్ దోమ నీళ్లలో గుడ్లు పెడుతుంది ఇవి మళ్లీ కొత్త దోమలు తయారయ్యేలా చేస్తుంది. 

డాక్టర్ శ్రీవాస్తవ్ డెంగ్యూ గురించి ఏమన్నారంటే:

డెంగ్యూ ఫీవర్ 104 F (40 C) ఉంటుంది.

ఇంకా ఈ విధమైన సింప్టమ్స్ ఉంటాయని చెప్పాడు. 

1. చలి, జ్వరం తలనొప్పి

2. మజిల్స్, బోన్స్ లేదా జాయింట్స్ పెయిన్స్

3. వికారం, వాంతులు 

4. కళ్ల వెనుక నొప్పి 

5. గొంతువాపు. 

6. శరీరం మీద దద్దుర్లు. 

డెంగ్యూ అనేది ఎక్కువగా వస్తే కొన్ని సింప్టమ్స్ ఉంటాయి:

1. తీవ్రమైన కడుపు నొప్పి

2.నిరంతర వాంతులు

3.మీ చిగుళ్ళు , ముక్కు లో రక్తం రావడం

4. యూరిన్ లో బ్లడ్ , వాంతులు

5. స్కిన్ కింద ఒకలా అవ్వడం,

7. ఊపిరి తీసుకోవడం కష్టం అవ్వడం. 

డెంగ్యూ వచ్చినప్పుడు ట్రావెలింగ్ చేయకూడదు. 

డెంగ్యూ వచ్చినప్పుడు బాగా విశ్రాంతి తీసుకోవాలి. 

డెంగ్యూ ని యాంటీ బాడీ టెస్ట్ ద్వారా గుర్తిస్తారు. 

ఇది పాజిటివ్ వస్తే డెంగ్యూ ఉన్నట్టు, నెగిటివ్ వస్తే డెంగ్యూ లేనట్టు. పాజిటివ్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే మనం వాటిని హాస్పిటల్ వెళ్లి పెంచుకోవాలి. లేదంటే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. 

డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మన ఇంటి దగ్గర నీళ్లు నిలవకుండా చూసుకోవాలి, ఎడీస్ దోమ అనేది మన ఇంటి వైపు రాకుండా చూసుకోవాలి అంటే ఎక్కువగా దోమతెరలు వాడాలి. దీనివల్ల దోమలు రావడం తగ్గిపోతుంది. ఇంకా మన ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎక్కడికి వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

డెంగ్యూ గురించి తెలియని వాళ్లకు దాని గురించి చెప్పి జాగ్రత్త పడమని చెప్పడం కూడా మనం చేయాల్సిన పనే. మనం మన ఆరోగ్యం కాపాడుకుంటూనే పక్క వాళ్ళ ఆరోగ్యం కాపాడడం మంచిపని. డెంగ్యూ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. డెంగ్యూ వచ్చిందని డౌట్ ఉంటే మనం చేయాల్సిన పనులు. డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకొని ఒకవేళ డెంగ్యూ వస్తే కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగాలి. బొప్పాయి పండు ఎక్కువగా తినాలి. ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగేలా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తే మనం దీని నుంచి త్వరగా కోలుకుంటాం. దీంతో పాటు డెంగ్యూ గురించి తెలియని వాళ్లకు డెంగ్యూ గురించి చెప్పాలి. అప్పుడు వాళ్లు కూడా జాగ్రత్త పడతారు. సొసైటీ బాగుంటుంది.