దేశంలో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు

డెంగ్యూ అనేది దోమ కాటు ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్…. : ఇటీవల దేశంలో డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి.దోమలు విపరీతంగా పెరుగుతుండడంతో డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  వర్షాకాలం ఆరంభం కావడంతో దోమల విజృంభణ ఎక్కువగా ఉండడం తో డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఇంట్లో చిన్న పిల్లలను దోమలు కుట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జూలై […]

Share:

డెంగ్యూ అనేది దోమ కాటు ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్…. : ఇటీవల దేశంలో డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి.దోమలు విపరీతంగా పెరుగుతుండడంతో డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 

వర్షాకాలం ఆరంభం కావడంతో దోమల విజృంభణ ఎక్కువగా ఉండడం తో డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఇంట్లో చిన్న పిల్లలను దోమలు కుట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జూలై మొదటి అర్ధభాగంలో అక్కడ 40కి పైగా కేసులు నమోదయ్యాయి.

కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో డెంగ్యూ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

డెంగ్యూ లక్షణాలు….  

డెంగ్యూ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు , దద్దుర్లుతోపాటుగా ఇతర లక్షణాలైన వికారం, వాంతులు, కడుపు నొప్పి , ఆకలిని కోల్పోవటం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. డెంగ్యూ వ్యాధికి సక్రమంగా చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చు.

డెంగ్యూ కి తీసుకోవల్సిన జాగ్రత్తలు 

డెంగ్యూ నుండి రక్షించుకోవడానికి తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు ఉన్నాయి. ఇంట్లో మరియు చుట్టుపక్కల దోమల సంతతిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం ముఖ్యం. కిటికీలు, తలుపులకు దోమతెరలు , స్క్రీన్‌లను ఉపయోగించాలి. నీరు ఎక్కువ నిల్వ ఉన్న ప్రదేశంలో దోమలు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. వానా కాలంలో అనారోగ్యాలకు దోమలు కారణమవుతాయి. ముఖ్యంగా పిల్లలు బయట పార్కులు లేదా పాఠశాలల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున దోమలు కుట్టుకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లలు ఆరుబయట ఉన్నప్పుడు.. వారికి పొడవాటి చేతుల షర్ట్‌లు, పొడవాటి ప్యాంటు, సాక్స్, బూట్లు ధరించండి. ముఖ్యంగా దోమలు ఎక్కువగా తెల్లవారుజామున, రాత్రి సమయంలో యాక్టివ్‌గా ఉంటాయి.. ఈ టైమ్‌లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి.  , దోమలు కుట్టకుండా స్ప్రేలు లేదా క్రిమి లను ఉపాయోగించాలి…. పిల్లలలో దద్దుర్లు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలను గుర్తిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాలి.   

ఏ జాగ్రత్తలు పాటించాలో మరొకసారి తెలుసుకుందాం….

నీరు ఎక్కువ నిల్వ ఉన్న ప్రదేశంలో దోమలు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికి అప్పుడు శుభ్రం చేసుకొని మీ ఇంటికి సమీపంలో నీరు నిల్వ లేకుండా చూసుకోండి.

అదేవిధంగా ఇంట్లో పూల కుండీలు, బకెట్లు, పాత టైర్లు, రోజూ నీటిని నిల్వ చేసే ఇతర వాటిలో ఎక్కువ కాలం నీరు నిల్వ లేకుండా చేయండి. వ్యర్థాలు, చెత్త పదార్థాలు లేకుండా చూసుకోండి. మీ నివాస స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి.   

దోమలు కుట్టకుండా మార్కెట్‌లో లభించే క్రీమ్‌లను ఉపయోగించండి. పిల్లల వయసు తగినవి ఉపయోగించండి.

అదేవిధంగా స్థానిక ఆరోగ్య అధికారులను సంప్రదించి వ్యాధుల నియంత్రణ, డెంగ్యూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరండి.   

దోమలు కుట్టకుండా ఉండేందుకు రాత్ర సమయంలో పడుకునేటప్పుడు మీ బెడ్ లేదా మంచం చుట్టూ దోమ తెరలను ఉపయోగించండి. మీ ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు తెరలను వాడండి.  

పిల్లలు ఆరుబయట ఉన్నప్పుడు.. వారికి పొడవాటి చేతుల షర్ట్‌లు, పొడవాటి ప్యాంటు, సాక్స్, బూట్లు ధరించండి. ముఖ్యంగా దోమలు ఎక్కువగా తెల్లవారుజామున, రాత్రి సమయంలో యాక్టివ్‌గా ఉంటాయి.. ఈ టైమ్‌లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి.

ఏవైనా లక్షణాలను గుర్తిస్తే సరైన చికిత్స కోసం వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి. అనారోగ్య సమయంలో పుష్కలంగా ద్రవాలు తీసుకోవటంతోపాటు, విశ్రాంతి తీసుకోవడం ద్వారా నిర్జలీకరణాన్ని నివారించటానికి చర్యలు తీసుకోవాలి.

చివరగా, డెంగ్యూ ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లయితే, పొడవాటి చేతుల దుస్తులు ధరించడం , ఆరుబయట ఉన్నప్పుడు దోమ తెరలు ఉపయోగించడం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణానికి ముందు వైద్యులను సంప్రదించటం మంచిది. తద్వారా డెంగ్యూ ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి ప్రయాణించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చు.