డిమెన్షియాను ఇలా గుర్తించవచ్చు

‘డిమెన్షియా’.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ, అల్జీమర్స్ (మతిమరుపు) అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. ‘డిమెన్షియా’ వ్యాధిలో అల్జీమర్స్‌ అనేది ఒక రకం. ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధుల్లో వస్తుంది. అలాగనీ, వయసు పైబడి అందరికీ ఈ వ్యాధి రాదు.. డిమెన్షియా వ్యాధి బారిన పడిన వారి మెదడులో ఉన్న లక్షలాది హెల్దీ న్యూరాన్లు మెల్లిమెల్లిగా నశించిపోతుంటాయి. అయితే, ఇలా ఎందుకు న్యూరాన్లు నశించిపోతుంటాయనేది అనే కారణం ఇంతవరకు తెలియదు. అల్జీమర్‌‌ బారిన పడినప్పుడు లేదా […]

Share:

‘డిమెన్షియా’.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ, అల్జీమర్స్ (మతిమరుపు) అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. ‘డిమెన్షియా’ వ్యాధిలో అల్జీమర్స్‌ అనేది ఒక రకం. ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధుల్లో వస్తుంది. అలాగనీ, వయసు పైబడి అందరికీ ఈ వ్యాధి రాదు.. డిమెన్షియా వ్యాధి బారిన పడిన వారి మెదడులో ఉన్న లక్షలాది హెల్దీ న్యూరాన్లు మెల్లిమెల్లిగా నశించిపోతుంటాయి. అయితే, ఇలా ఎందుకు న్యూరాన్లు నశించిపోతుంటాయనేది అనే కారణం ఇంతవరకు తెలియదు. అల్జీమర్‌‌ బారిన పడినప్పుడు లేదా మెదడులో ఏమైనా స్ట్రోక్స్‌ వచ్చినప్పుడు న్యూరాన్లు నశించిపోతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, ఇదే కారణం అయి ఉంటుందని వారు స్పష్టం చేయలేకపోతున్నారు. 

ఈ వ్యాధి బారిన పడిన వారు జ్ఞాపక శక్తిని కోల్పోవడం, గందరగోళ పరిస్థితుల్లో ఉండటం, ఏకాగ్రత తగ్గిపోవడం, ప్రవర్తనలో మార్పులు రావడం, ఎవరితో కలవకపోవడం, అర్థమయ్యేటట్లుమాట్లాడలేకపోవడం ఇందులో ముఖ్య లక్షణాలు. ఈ వ్యాధి బాగా ముదిరితే ఒక్కోసారి రోజూ చేసే పనులు కూడా మర్చిపోతుంటారు. వారి పేర్లు కూడా మర్చిపోతుంటారు. ఇంట్లో వాళ్లను కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రోజే చేసే పనులు, చూసే వ్యక్తులు కూడా వీరికి గుర్తుకు ఉండరు. సొంత పనులు కూడా చేసుకోలేని విధంగా తయారవుతారు. అంటే స్నానం  చేయకపోయినా చేసినట్లు, అన్నం తినకపోయిన తిన్నట్లు వీరిని అనిపిస్తుంది. లాస్ట్ స్టేజీలో మెదడు పనితీరును క్రమంగా తగ్గిపోతుంది. 

ఇండియాలో కోటి మందికిపైగా… 

ఇండియాలో 10 మిలియన్ల (ఒక కోటి)కు పైగా  వృద్ధులు ఈ డిమెన్షియాతో బాధపడుతున్నట్లు ఒక అధ్యయనంలో తెలింది. నేచర్‌‌  పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ కలెక్షన్‌ జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. దీని ప్రకారం.. 2050 నాటిని 60 ఏళ్లు పైబడిన వారు దేశంలోని మొత్తం జనాభాలో 19.1 శాతం ఉంటారని అంచనా. డిమెన్షియాని వృద్ధాప్యంలో వచ్చే సాధారణ వ్యాధిగా పరిగణించకూడదు. ఈ వ్యాధిని కొంత సీరియస్‌గానే తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. వయసు పైబడిన వారందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం లేదు. డిమెన్షియా లక్షణాలు లేకుండా కూడా చాలా మంది వృద్ధులు వారి లైఫ్‌ను హ్యాపీగా లీడ్‌ చేస్తున్నారు.

డిమెన్షియా వ్యాధి లక్షణాలు..

డెమెన్షియా వ్యాధి బారినపడ్డ వారిలో ప్రవర్తన, నడక, వ్యక్తిత్వంలో మార్పులు కనిపించినప్పటికీ.. మొదటగా లక్షణాలు కనిపించేది మాత్రం కళ్లలోనే. లండన్‌లోని లేజర్‌‌ ఐ క్లినిక్‌లోని ప్రముఖ కళ్ల డాక్టర్‌‌ జోర్న్‌ స్లాట్‌ జార్జెన్‌ సెన్‌ Express.co.ukకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జ్ఞాపక శక్తి సమస్యలు ప్రారంభమయ్యే ముందు కళ్లలో కనిపించే డిమెన్షియా లక్షణాల గురించి ఆయన హెచ్చరించారు. డిమెన్షియా వ్యాధిలో మొదటి లక్షణం దృష్టి (కంటి చూపు) సమస్యలే పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. యూసీఎస్‌ఎఫ్‌ వెయిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌‌ న్యూరో సైన్సెస్‌ జరిపిన అధ్యయనంలో, కళ్లల్లోని రక్త నాళాల్లో వచ్చే కీలక మార్పులను రెటీనా స్కాన్లు గుర్తించగలవని కనుగొన్నారు.

కళ్లల్లో కనిపించే డిమెన్షియా లక్షణాలు..

1. చదవడం, రాయడంలో ఇబ్బందులు: డిమెన్షియా ఉన్న వ్యక్తులు చదడం, రాయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. నంబర్స్‌, సింబల్స్‌ నూ అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడతారు.

2. దృష్టిలో మార్పు: ఈ వ్యాధి బారిన పడిన వారు దూరాలను డిసైడ్‌ చేయడంలో ఇబ్బందులు పడతారు. కలర్స్‌ను, వాటిలోని రకాలను కూడా గుర్తించలేరు.

3. విజువల్‌ హాలూసినేషన్స్‌: డాక్టర్‌‌ జార్జెన్‌సెన్‌ ప్రరాక.. అక్కడ లేని వస్తువు ఉన్నట్లు, ఉన్న వస్తువు లేనట్లు కనపడటం డిమెన్షియాలో మొదటి సంకేతం. దీనినే విజువల్‌ హాలూసినేషన్‌ అంటారు.

4. చూపు జ్ఞాపక శక్తి బలహీనం: డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తెలిసిన ముఖాలను, స్థలాలను, ప్రాంతాలను, వస్తువులను కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోవచ్చు.

5. రెటీనా పలచబడటం: మిడిల్‌ ఏజ్‌ ఉన్న వారిలో రెటీనా పలచడటం అంటే చూసే చూపులో క్షీణతను ప్రతిబించిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.