చుండ్రు మిమ్మల్ని బాధిస్తోందా? 

తల ఉపరితలంపై కనిపించే చుండ్రు జుట్టు అందాన్ని పాడుచేయడమే కాకుండా, తరచుగా ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చుండ్రును దూరం చేసుకోవచ్చు. కొన్ని హోం రెమెడీస్‌ని వారానికి 1-2 సార్లు ఉపయోగిస్తే చుండ్రు సమస్య నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది, అయితే అవి ఏంటో తెలుసుకుందాం. చుండ్రును తగ్గించడానికి సహాయపడే ప్రభావవంతమైనవి, సులువుగా మనంతట మనమే చేసుకోగలిగే ఇంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి.  చుండ్రు సమస్య మనలో చాలామందికి పరిచయమున్నదే. ఈ […]

Share:

తల ఉపరితలంపై కనిపించే చుండ్రు జుట్టు అందాన్ని పాడుచేయడమే కాకుండా, తరచుగా ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చుండ్రును దూరం చేసుకోవచ్చు. కొన్ని హోం రెమెడీస్‌ని వారానికి 1-2 సార్లు ఉపయోగిస్తే చుండ్రు సమస్య నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది, అయితే అవి ఏంటో తెలుసుకుందాం.

చుండ్రును తగ్గించడానికి సహాయపడే ప్రభావవంతమైనవి, సులువుగా మనంతట మనమే చేసుకోగలిగే ఇంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. 

చుండ్రు సమస్య మనలో చాలామందికి పరిచయమున్నదే. ఈ సమస్యను తాత్కాలికంగా వదిలించుకోవడానికి ఎన్నో యాంటీడాండ్రఫ్ ఉత్పత్తులను ఉపయోగిస్తాము, అయితే మన డబ్బు ఎక్కువగా ఖర్చు చేయకుండానే చుండ్రును తగ్గించడానికి సహాయపడే ప్రభావవంతమైనవి, సులువుగా మనంతట మనమే చేసుకోగలిగే ఇంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. 

చుండ్రుపై  ప్రభావవంతంగా పనిచేసే కొన్ని ఇంటి చిట్కాలు:

కొబ్బరి నూనె- నిమ్మకాయ:

కొబ్బరినూనె మనమందరం తరచుగా వాడేదే. ఇందులోని యాంటీ ఫంగల్ లక్షణాలు దురద, చుండ్రుల నుండి గొప్ప ఉపశమనాన్ని అందిస్తాయి. కొబ్బరినూనె, నిమ్మరసాన్ని సమానంగా కలిపి, ఆ మిశ్రమాన్ని మీ తలపై మసాజ్ చేయండి. సుమారు 10-15 నిమిషాలు అలాగే ఉంచి మీ జుట్టును బాగా శుభ్రం చేయాలి. దీనివల్ల చుండ్రు తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా, బలంగా పెరగటానికి సహాయపడుతుంది. చలికాలంలో రాస్తున్నట్లయితే నూనెను ముందుగా వేడి చేసుకోండి.

పెరుగు:

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది, అందులోని ప్రోటీన్ మీ జుట్టును దాని మూలాల నుండి బలపరుస్తుంది. తాజా పెరుగును తీసుకొని మాడుపైన, జుట్టుపైన అప్లై చేయండి. 10-15 నిమిషాలు అలానే వదిలేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి ఆరనివ్వండి. యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నందువల్ల పెరుగులో నల్ల మిరియాలు కూడా కలిపితే వేగంగా ఫలితాలు వస్తాయి.

వేప:

చర్మ సమస్యలకు తాజా వేప ఆకులతో చేసిన పేస్ట్‌ను ఉపయోగించడం పూర్వీకుల కాలం నాటి చిట్కా. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా ఇది చుండ్రు, దురదలకు చాలా బాగా ఉపయోగపడే చిట్కా.

దీనికి బదులుగా, మీరు కొన్ని తాజా వేప ఆకులను ఉడకబెట్టి, చల్లబరచి, ఆ నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోవచ్చు.

ఉప్పు:

ఉప్పు మీ మాడు‌పై ఉండే అదనపు నూనెను గ్రహిస్తుంది. నుదిటిపై మొటిమలు రావడానికి తలపై జిడ్డు ఉండటం కూడా ఒక కారణం. కాబట్టి చుండ్రుకు వీలైనంత త్వరగా ఇంట్లోనే చికిత్స చేయడం మంచిది.

మీరు వాడే షాంపూలో  చిటికెడు ఉప్పు వేసి మీ జుట్టుకు అప్లై చేయండి. మీ మాడు అంతటా గుండ్రంగా, సున్నితంగా మసాజ్ చేసి, ఎక్స్‌ఫోలియేట్ చేయండి. ఒకటి రెండు నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఆలివ్ ఆయిల్- వెనిగర్:

ఆలివ్ ఆయిల్ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. దీన్ని వెనిగర్‌తో కలపడం వల్ల దాని ఎసిటిక్ లక్షణాలతో కలిసి, శిలీంద్రాల ఇన్ఫెక్షన్ నుండి మాడు‌ను కాపాడుతుంది, అదే సమయంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఒక టీస్పూన్ ఆలివ్ నూనె, 2 టీస్పూన్ల వెనిగర్‌ను కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు సమానంగా పట్టించి 5 నిమిషాల పాటు తలకు మసాజ్ చేయండి. ఉత్తమ ఫలితాల కోసం యాంటీ డాండ్రఫ్ షాంపూతో శుభ్రం చేసి కండీషనర్‌ అప్లై చేయండి.

చుండ్రును తగ్గించడానికి ఈ క్రిందివి పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది

  • చక్కెర, కొవ్వులు, కార్బోహైడ్రేట్లున్న ఆహారపదార్థాలు ఎక్కువగా తినకుండా ఉండటానికి ప్రయత్నించండి
  • స్టైలింగ్ సాధనాలను చాలా తరచుగా ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఏ రకమైన కృత్రిమ వేడి అయినా.. కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది.
  • ఎక్కువగా గోక్కోకండి.
  • వారానికి 2-3 సార్లు షాంపూతో తలస్నానం చేయండి
  • తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మీ జుట్టును తరచుగా దువ్వండి

సమతుతుల్యమైన ఆహారం తీసుకుంటూ, మంచి జీవన శైలిని అనుసరించడం వలన చుండ్రును చాలా వరకు తగ్గించవచ్చు. అయినప్పటికీ, మీకు ఉపశమనం కనిపించకపోతే దురద ఇంకా వస్తుంటే, మీరు మీ తలపై ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో తెలుసుకోవడానికి డాక్టర్‌‌ని సంప్రదించండి.