జీలకర్ర- వంటింట్లో ఉండే ఈ పోపుదినుసు బరువు తగ్గించడానికి మ్యాజిక్‌లా పనిచేస్తుంది, సరైన విధంగా వాడితే వేగంగా బరువు తగ్గొచ్చు

ఊబకాయాన్ని దూరం చేయడంలో జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్రలో మాంగనీస్, ఐరన్, కాల్షియం, జింక్ మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోదు. ఈ రోజుల్లో జనాలకి వ్యాయామాలు చేయడానికి టైం ఉండట్లేదు. తినేదేమో జంక్ ఫుడ్. అందుకే ఒబెసిటీ  శాపంలా దాపురిస్తోంది.  జనాలు కంట్రోల్ లేకుండా బరువు పెరిగే లైఫ్ స్టైల్‌లో బ్రతుకుతున్నారు. దాని ఫలితంగా బరువు పెరుగుతున్నారు. ఆ తరువాత బరువు తగ్గడానికి విపరీతంగా […]

Share:

ఊబకాయాన్ని దూరం చేయడంలో జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్రలో మాంగనీస్, ఐరన్, కాల్షియం, జింక్ మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోదు.

ఈ రోజుల్లో జనాలకి వ్యాయామాలు చేయడానికి టైం ఉండట్లేదు. తినేదేమో జంక్ ఫుడ్. అందుకే ఒబెసిటీ  శాపంలా దాపురిస్తోంది.  జనాలు కంట్రోల్ లేకుండా బరువు పెరిగే లైఫ్ స్టైల్‌లో బ్రతుకుతున్నారు. దాని ఫలితంగా బరువు పెరుగుతున్నారు. ఆ తరువాత బరువు తగ్గడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. రకరకాల ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల వ్యాయామాల సహాయంతో సర్జరీ అవసరం లేకుండా తగ్గటానికి తెగ ట్రై చేస్తున్నారు. అయితే కొద్ధి నెలలలోనే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించగల శక్తి జీలకర్రకు ఉందని చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. 

అవునండీ! ఊబకాయం తగ్గించడానికి జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది. సరైన విధానంలో వాడుకుంటే, ఇది పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దీనివల్ల, చక్కని నాజూకైన శరీరాకృతి మీ సొంతమవుతుంది. అందుకే అదిక బరువున్న చాలా మంది వ్యక్తులు నేడు జీలకర్రను తీసుకుంటున్నారు. జీలకర్ర వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. తమకు జీలకర్ర అద్భుతంగా ఉపయోగపడిందని వారి అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. 

బరువు తగ్గడానికి జీలకర్ర ఎలా సహాయపడుతుందో, దాని వల్ల మరిన్ని ప్రయోజనాలను రాబట్టడానికి దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. శరీరం కొవ్వు, కార్బోహైడ్రేట్లను గ్రహించడానికి జీలకర్ర సహాయపడుతుంది, అందుకే ఇది బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని అంటారు. క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటే మెటబాలిజం మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణమయ్యి, అదనపు కొవ్వుగా కాకుండా శక్తిగా మారుతుంది.

మీరు మీ బరువును నియంత్రించుకోవడానికి జీలకర్రను వాడాలనుకుంటే జీలకర్ర నీటిని తీసుకోవాలి. ఈ కషాలం తయారు చేసేందుకు ఎటువంటి కాస్ట్లీ పదార్థాలు అవసరం ఉండదు. మన ఇంటిలో లభించే పదార్థాలతోనే సులభంగా ఈ కషాయాన్ని తయారు చేసుకవచ్చు. ఒక రోజులో ఎక్కువ జీలకర్ర నీటిని తాగడం వల్ల గుండెల్లో మంట, అధిక ఋతు రక్తస్రావం మరియు రక్తంలో చక్కెర తగ్గుతుంది. బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని తాగే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. ఈ కషాయం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 

ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ కషాయాన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం

గోరువెచ్చని జీలకర్ర నీళ్ళు

జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, మర్నాడు ఉదయాన్నే ఆ నీటిని మరిగించి ఖాళీ కడుపుతో త్రాగాలి. దీనివల్ల మీ శరీరంలోని జీవక్రియ వేగవంతమయ్యి, మీకు మీ శరీరంలోని వ్యర్థాలు పూర్తిగా బయటకు పోయిన అనుభూతి కలుగుతుంది.

జీలకర్ర, సెలెరీ నీళ్ళు

రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో సెలెరీ, జీలకర్ర వేసి నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో, ఈ నీళ్ళు త్రాగాలి. జీలకర్ర, సెలెరీ ఈ రెండిటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు, శరీరంలోని అదనపు కొవ్వును కరిగించి తొలగించడంలో కూడా సహాయపడతాయి. మీ బరువు చాలా తొందరగా కంట్రోల్ లోకి వస్తుంది. అంతా దీని దయ మరి.

జీలకర్రతో పాటు నిమ్మరసం

కొద్దిగా జీలకర్ర, ఐదు చుక్కల నిమ్మరసం ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే తీసుకోవాలి. దీనివల్ల బరువు తొందరగా అదుపులోకి వస్తుంది. శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వు త్వరగా శరీరంలో నుండి బయటకుపోయేలా చేస్తుంది. ఇలా చాలా సింపుల్​గా ఈ కషాయాన్ని తయారు చేసుకుని వాడి.. అధిక ప్రయోజనాలు పొందండి. 

ఈ చిట్కాలు పాటించి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మీ సొంతం చేసుకోండి.