మీ కీటో డైట్ లో చక్కెరను ఇలా కలుపుకోండి

చాలామంది బరువు తగ్గించుకోవడానికి ఈ కీటో డైట్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ కీటో డైట్ ఫాలో అయ్యే వారిలో అధికంగా చక్కెరను తినాలనే కోరికను చంపుకోలేరు. అలాంటప్పుడు మేము చెప్పబోయే మంచి స్నాక్స్ని ట్రై చేయండి. చక్కెర తినాలనే మీ ఆశను తీర్చుకోండి. ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, అంతే కాకుండా బరువు తగ్గడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ స్నాక్స్ తినడం వల్ల చక్కెర తినాలని ఆశతో […]

Share:

చాలామంది బరువు తగ్గించుకోవడానికి ఈ కీటో డైట్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ కీటో డైట్ ఫాలో అయ్యే వారిలో అధికంగా చక్కెరను తినాలనే కోరికను చంపుకోలేరు. అలాంటప్పుడు మేము చెప్పబోయే మంచి స్నాక్స్ని ట్రై చేయండి. చక్కెర తినాలనే మీ ఆశను తీర్చుకోండి. ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, అంతే కాకుండా బరువు తగ్గడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ స్నాక్స్ తినడం వల్ల చక్కెర తినాలని ఆశతో పాటు మనలోని బలం ఇంకా పెంపొందించుకునే వాళ్ళం అవుతాం. అనవసరమైన స్వీట్స్ తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, మనం స్వీట్ తినాలి అనుకునే సమయంలో, మేము చెప్పబోయే స్నాక్స్ తినడం ఎంతో మేలు. మరి ఇప్పుడు ఆ స్నాక్స్ ఏంటో తెలుసుకుందామా.. 

1. తాజా పళ్ళు: 

ప్రకృతి పరమైన స్వీట్స్ ఈ తాజా పళ్ళు. హై ఫైబర్ ఉన్న బెర్రీస్, ఆపిల్స్, ఆరెంజెస్ తినడం చాలా మంచిది. ఇవి తినడం వల్ల విటమిన్స్ తో పాటుగా మనం చక్కర తినాలని ఆశ తీరుతుంది. 

2. రైస్ కేక్: 

మనం స్వీట్స్ కి బదులుగా హోల్ గ్రేయిన్ రైస్ కేక్ ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. ఆ కేక్ పైన తిన్ లేయర్ గల నట్ బటర్ లేదంటే పీనట్ బటర్ వేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రోటీన్స్ మన శరీరంలోకి వెళ్తాయి. ఇది నోటికి రుచిని అలాగే తీయదనాన్ని అందిస్తుంది. 

3. డార్క్ చాక్లెట్: 

అవును మీరు విన్నది నిజమే డైట్ లో చాక్లెట్ తినొచ్చు ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ఇందులో కోకో 70% ఉంటుంది. అసలు షుగర్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాకుండా, డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి, ఇవి మన శరీరానికి ఎంతో సహాయం చేస్తాయి. స్వీట్స్ కి బదులుగా డార్క్ చాక్లెట్ ని ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. 

4. చియా సీడ్ పుడ్డింగ్: 

పుడ్డింగ్ చేసుకోవడం చాలా సులభం, పుడ్డింగ్కి కావాల్సింది కేవలం పాలు, చియా సీడ్స్, ఎసెన్స్. ముందుగా ఒక బౌల్లో మిల్క్ వేసుకొని అందులో చియాట్ సీడ్స్ వేసుకొని మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకొని, కొన్ని గంటలు అలాగే ఉంచేయాలి. రెండు మూడు గంటలు అయిన తర్వాత, తయారు చేసుకున్న మిశ్రమం పైన కాస్త దాల్చిన చెక్క పొడి జల్లుకుంటే సరిపోతుంది. తియ్యతియ్యగా ఉండే రుచికరమైన స్వీట్ మనం తినడానికి రెడీ అయిపోయినట్టే. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అలాగే ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో రుచితో పాటు ఎన్నో పోషకాలు ఉన్నాయి. 

5. పీనట్ బటర్ ఫ్యాట్ బాల్స్: 

వీటిని మనం ఎనర్జీ బాల్స్ అని కూడా అనొచ్చు. డైట్ లో ఉన్నవాళ్లు ఇవి తీసుకుంటే చక్కర తినాలని కోరికను తీర్చుకోవడం చాలా సులభతరం అవుతుంది. మనం వీటిని చేసుకోవడానికి మనకు కావాల్సినదల్లా పీనట్ బట్టర్, కోకోనట్ ఆయిల్, పట్టిక బెల్లం. ఈ మూడు పదార్థాలను మెత్తగా దంచుకుని బాల్స్ లా చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉండడం వల్ల, మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. 

6. నట్స్: 

మన రోజువారి డైట్ లో నట్స్ అనేవి స్నాక్స్ లో ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్స్, అలాగే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా వాల్నట్స్, పీనట్స్, చియా సీడ్స్, అవిస గింజలు, ఇలాంటి వాటిలో మనకు కావాల్సిన బలాన్ని పెంపొందించే పోషకాలు ఉంటాయి. డైట్ లో ఉన్నవాళ్లు ఇటువంటివి తినడం ఎంతో మేలు. 

కాబట్టి ప్రతి ఒక్కరూ షుగర్ తినకుండా, షుగర్ కి బదులుగా మరెన్నో రుచికరమైన స్నాక్స్ డైట్ లో చేర్చడం ద్వారా, మనం షుగర్ తినాలనే ఆశతో పాటు మరెన్నో ఉపయోగకరమైన ప్రోటీన్స్ మన శరీరానికి అందించవచ్చు.