కొవిడ్-19 అప్‌డేట్: మహారాష్ట్ర సతారాలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేటి నుండి మాస్క్‌ తప్పనిసరి

దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల పెరుగుదల  దృష్ట్యా, కరోనా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. పెరుగుతున్న COVID-19 కేసుల దృష్ట్యా, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ రోజు నుండి ప్రభుత్వ మరియు సెమీ ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు మరియు బ్యాంకులలో పనిచేసే ఉద్యోగులు మరియు అధికారులకు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. గత 24 గంటల్లో భారతదేశంలో 248 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. మొత్తం […]

Share:

దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల పెరుగుదల  దృష్ట్యా, కరోనా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.

పెరుగుతున్న COVID-19 కేసుల దృష్ట్యా, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ రోజు నుండి ప్రభుత్వ మరియు సెమీ ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు మరియు బ్యాంకులలో పనిచేసే ఉద్యోగులు మరియు అధికారులకు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది.

గత 24 గంటల్లో భారతదేశంలో 248 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. మొత్తం కరోనా కేసుల  సంఖ్య 81,45,590 కు చేరగా.. మరణాల సంఖ్య 1,48,445 కి పెరిగిందని దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా, వైరస్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఒకా జిల్లా యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. సతారా జిల్లాలో ప్రభుత్వ మరియు సెమీ ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు మరియు బ్యాంకులలో పనిచేసే ఉద్యోగులు, అదే విధంగా అధికారులు కూడా  తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ తక్షణమే అమల్లోకి వస్తుందని జిల్లా యంత్రాంగం పేర్కొంది.

నివేదికల ప్రకారం, జిల్లాలో మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ జిల్లా కలెక్టర్ రుచెష్ జైవంశీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీక్లీ మార్కెట్లు, బస్టాండ్‌లు, జాతరలు, సమ్మేళనాలు మరియు వివాహాలు వంటి రద్దీ ప్రదేశాలలో మాస్కులు తప్పనిసరి ధరించాలన్నారు. అదే విధంగా సామాజిక దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి  COVID భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని స్థానిక నివాసితులందరికీ విజ్ఞప్తి చేశారు.

హర్యానా కూడా రద్దీ ప్రదేశాలు, ఆసుపత్రులలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది

దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను గుర్తించిన హర్యానా ప్రభుత్వం.. నివారణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆరోగ్యం మంత్రి అనిల్ విజ్ సోమవారం రాష్ట్రంలో మాస్క్‌లను ధరించడం తప్పనిసరి చేశారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ, మరియు 100 మందికి పైగా ప్రజలు గుమిగూడి ప్రాంతాలకు నియమాలు తప్పనిసరని పేర్కొన్నారు. మాస్క్‌లను తప్పనిసరి చేయడమే కాకుండా, జలుబు మరియు దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారందరూ  కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

భారతదేశంలో కోవిడ్ కేసులు

దేశంలో కోవిడ్-19 కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. సోమవారం, భారతదేశం గత 184 రోజుల్లో.. ఇంత పెరుగుదల రావడం ఇదే మొదటిసారని కేంద్రం తెలిపింది. అత్యంత అంటువ్యాధి అయిన Omicron వేరియంట్ XBB.1.16 వల్ల కేసులు పెర్గుతున్నట్టు కేంద్రం తెలిపింది.

కాగా గడిచిన  24 గంటల్లోనే మన దేశంలో  రెండు వందలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ కరోనా వల్ల సోమవారం ఒకరు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖా వెల్లడించింది. ప్రస్తుతం కేసులు 82 లక్షలకు చేరువలో ఉండగా..  కేంద్ర ఆరోగ్య శాఖా సమాచారాన్ని బట్టి మరణాల సంఖ్యా దాదాపు లక్షా యాభై వేలకు దగ్గరలో ఉన్నట్టు తెలుస్తోంది.