కోవిడ్, వ్యాక్సినేషన్ మైగ్రేన్ మీద ప్రభావం ఉంటుందా?

యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన వైరస్ కరోనా. ఎంతో మంది ఈ వైరస్ కారణంగా తమ ప్రాణాన్ని కోల్పోవడమే కాకుండా, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో భయాందోళనతో చనిపోయిన వారు ఎక్కువ మంది. అంతేకాకుండా కరోనా తగ్గిన అనంతరం, దాని ప్రభావం ఉంటుంది అని, కరోనా కారణంగా శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యలు, ఇతర అవయవాల వ్యాధులు, ముఖ్యంగా మైగ్రేన్ సమస్యలు ఎక్కువ అవుతాయని అపోహపడుతున్నారు.  నిపుణులు ఏమంటున్నారు?:  కరోనా వచ్చిన అనంతరం దాని తీవ్రమైన ప్రభావం వల్ల మైగ్రేన్ […]

Share:

యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన వైరస్ కరోనా. ఎంతో మంది ఈ వైరస్ కారణంగా తమ ప్రాణాన్ని కోల్పోవడమే కాకుండా, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో భయాందోళనతో చనిపోయిన వారు ఎక్కువ మంది. అంతేకాకుండా కరోనా తగ్గిన అనంతరం, దాని ప్రభావం ఉంటుంది అని, కరోనా కారణంగా శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యలు, ఇతర అవయవాల వ్యాధులు, ముఖ్యంగా మైగ్రేన్ సమస్యలు ఎక్కువ అవుతాయని అపోహపడుతున్నారు. 

నిపుణులు ఏమంటున్నారు?: 

కరోనా వచ్చిన అనంతరం దాని తీవ్రమైన ప్రభావం వల్ల మైగ్రేన్ వంటి తలనొప్పి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని చాలామంది అపోహపడుతున్నారని, కోవిడ్ కారణంగా అదే విధంగా దాని వాక్సినేషన్ కారణంగా నిజానికి మైగ్రేన్ సమస్య ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అభిప్రాయపడ్డారు. 

యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూరాలజీ విడుదల చేసిన ఒక స్టడీ ప్రకారం, నిజానికి కోవిడ్ అలాగే కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సినేషన్ నిజానికి మైగ్రేన్ మీద తక్కువ ప్రభావం చూపిస్తుందని వెల్లడించింది. ఒక స్టడీ ప్రకారం మైగ్రేన్ కి సంబంధించి 550 మందిలో ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో 447 మంది అంటే 44.9వారికి ఒకసారి కరోనా వచ్చింది. అందులో 458 మంది ఇప్పటికే ప్రాక్సినేషన్ వేయించుకున్నారు. అందులో కొంతమంది 24.7 కరోనా వచ్చిన తర్వాత నుంచి అదే విధంగా, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మైగ్రేన్ తలనొప్పి ఎక్కువగా ఉందని వారి నుంచి కంప్లైంట్ వచ్చింది. 

కరోనా సోకిన వారు అదే విధంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఆందోళన కారణంగా మైగ్రేన్ తీవ్రత ఎక్కువ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అని కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. నిజానికి కరోనా వచ్చిన కొంతవరకు ఆందోళన కలిగించే విషయాలు తెలుసుకోవడం వల్ల అపోహ కారణంగా ఎక్కువ శాతం ఆందోళన చెందడం వల్ల మైగ్రేన్ తీవ్రతరం అవుతుందని పరిశోధకులు వెల్లడించారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మునుపు, తర్వాత మైగ్రేన్ వచ్చిన వారిలో హెడేక్ ఫ్రీక్వెన్సీ చెక్ చేసిన అనంతరం, నిజానికి ఎటువంటి మార్పు లేదని కేవలం, ఆందోళన కారణంగానే మైగ్రేన్ తీవ్రతరం అవుతుందని వెల్లడించారు. 

అయితే నిపుణుల చెప్తున్న దాని ప్రకారం కోవిడ్ అలాగే తలనొప్పి వంటివి రెండు వేరువేరు విషయాలని, అయితే మైగ్రేన్ కి, కరోనా వ్యాక్సినేషన్ కి అసలు ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు అని వెల్లడిస్తున్నారు. ఈ విషయాలను ముఖ్యంగా మైగ్రేన్ కి సంబంధించిన పేషెంట్స్ ముఖ్యంగా తెలుసుకోవడం వల్ల వారు మరింత ప్రశాంతంగా ఉంటారని, నిజానికి కరోనా లేదంటే కరోనా వ్యాక్సినేషన్ కారణంగా మైగ్రేన్ తీవ్రతరం అయ్యే అవకాశం చాలా తక్కువ శాతంలో ఉందని తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

మరణాలకి ఇది కారణం కావచ్చు: 

భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది కోవిషీల్డ్, కోవ్యాక్సిన్, వంటి మరిన్ని వ్యాక్సిన్లు వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే చాలామంది గుండెపోటుకు గురై చనిపోవడం కలవరం రేపింది. అందుకనే ఎక్కువ అవుతున్న గుండెపోటులకు గల కారణాలు గురించి ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. 

వ్యాక్సిన్ వేయించుకోవడం వల్లే చాలామంది చనిపోతున్నారు అని అపోహను దూరం చేసేందుకు ఈ రీసెర్చ్ చాలా బాగా పని చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రీసెర్చ్ ద్వారా వెళ్లడైనా నిజాల కారణంగా చాలామంది భయాన్ని దూరం చేసుకుంటారని రీసెర్చ్ చేసినవారు అభిప్రాయపడుతున్నారు. 

ఇక సంభవిస్తున్న అధిక మరణాలకు గల కారణం డయాబెటిక్స్, ధూమపానం, మద్యపానం, వృద్ధాప్యం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నిర్వహించిన మొట్టమొదటి రీసెర్చ్ ప్రకారం, వ్యాక్సిన్ వేసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సిన్ వేసుకోలేని వారిలోనే అధిక మొత్తంలో మరణాలు సంభవిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వ్యాక్సిన్ వేయించుకునే వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా అధికంగా ఉందని కూడా తేలింది. ప్రస్తుతం నిర్వహించిన రీసెర్చ్ కు సంబంధించి మరింత లోతుగా రీసెర్చ్ జరిగే అవకాశం ఉంటుందని, ఇప్పటివరకు రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయాలను మరింత బాగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది అంటున్నారు మరికొందరు.