నేరేడు గింజలతో బ్లడ్ షుగర్‌ కంట్రోల్

నేరేడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. నేరేడు పండు మాత్రమే కాదు, దాని గింజలు, ఆకులు మరియు బెరడు కూడా ఔషధంగా పనిచేస్తాయి. నేరేడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి నేరేడు గింజలు దివ్యౌషధంఈ పండు గింజలను డస్ట్‌బిన్‌లో వేయకండి వేసవిలో దొరికే రుచికరమైన పండ్లలో నేరేడు ఒకటి. ఇది మే, జూన్ సీజన్లలో లభిస్తుంది. నేరేడులో రుచితో పాటు అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని […]

Share:

నేరేడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. నేరేడు పండు మాత్రమే కాదు, దాని గింజలు, ఆకులు మరియు బెరడు కూడా ఔషధంగా పనిచేస్తాయి. నేరేడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

రక్తంలో చక్కెరను నియంత్రించడానికి నేరేడు గింజలు దివ్యౌషధం
ఈ పండు గింజలను డస్ట్‌బిన్‌లో వేయకండి

వేసవిలో దొరికే రుచికరమైన పండ్లలో నేరేడు ఒకటి. ఇది మే, జూన్ సీజన్లలో లభిస్తుంది. నేరేడులో రుచితో పాటు అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని బ్లాక్ ప్లం లేదా జావా ప్లం అని కూడా అంటారు. నేరేడు తినడం వల్ల అసంఖ్యాకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది నేరేడు పండుని తినేసి విత్తనాలను పారేస్తారు. అయితే వీటి గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు నిండి ఉన్నాయని చాలామందికి తెలియదు. అవును ఈ గింజలు నేరేడు గుజ్జు వలె ఆరోగ్యకరమైనవి. మీరు రానున్న వేసవిలో నేరేడు గింజలను పడేసే ముందు మరోసారి ఆలోచించాలి. 

నేరేడు గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తంలో చక్కెర నియంత్రణ

నేరేడు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, జింక్, కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అలాగే నేరేడు గింజలలో జంబోలిన్, జంబోసిన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. ఈ పండు గింజల్లోని యాంటీ డయాబెటిక్ లక్షణాలు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. అందుకే ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఆరోగ్య నిధి. ఈ గింజలోని హైపోగ్లైసీమిక్ లక్షణాలు కూడా చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.

మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ ఉన్నవారికి ప్రయోజనాలు

నేరేడు గింజలను ఎండబెట్టి మెత్తగా చేసి పెట్టెలో ఉంచండి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా కడుపులో గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఈ పొడిని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఈ గింజల నుంచి తీసే నూనె కూడా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఈ గింజల్లో ఉండే ముడి ఫైబర్ జీవక్రియను బలపరుస్తుంది.

హై బీపీని తగ్గిస్తుంది 

నేరేడు గింజల్లో ఎల్లాజిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయక పాత్ర పోషిస్తుంది.

విటమిన్ సి లోపాన్ని తొలగిస్తుంది

నేరేడు గింజలలో చాలా విటమిన్ సి లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల దంతాలు బలపడతాయి. చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. పైయోరియాతో బాధపడేవారికి నేరేడు గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

స్కిన్ కేర్ కోసం

నేరేడు గింజల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చర్మం నుండి ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి, పోషణను కూడా అందిస్తాయి.
ఎలా తీసుకోవాలి

మొదట నేరేడు పండ్లను కడిగి గుజ్జు నుండి విత్తనాలను వేరు చేయండి. ఇప్పుడు విత్తనాలను మరోసారి కడిగి పొడి గుడ్డపై ఉంచి 3-4 రోజులు ఎండలో ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత, వాటి బరువు తగ్గాక దాని పైనున్న సన్నటి తొక్క తీసేసి మిక్సీలో గింజలను బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని రోజూ తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.