కొంచెం ఆల్కహాల్.. గుండెకి పెద్ద ముప్పు! 

బ్లడ్ ప్రెషర్ కి కారణమయ్యే తిండి పదార్థాల, ఆయిల్ ఫుడ్, ఒత్తిడి ఇలా అనేక రకమైన విషయాల గురించి మనం వినే ఉంటాం. కానీ ముఖ్యంగా మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటుకు కారణమయ్యేది ఆల్కహాల్ అని మీకు తెలుసా.. తక్కువ మోతాదులో ఆల్కహాల్ తాగినప్పటికీ గుండెకు పెద్ద ముప్పు వచ్చిపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.  కొంచెం ఆల్కహాల్.. గుండెకి పెద్ద ముప్పు!:  హైపర్ టెన్షన్, ఆయిల్ ఫుడ్ డైట్, ఎక్కువ ఉప్పు పదార్థాలు, నిద్రలేమి […]

Share:

బ్లడ్ ప్రెషర్ కి కారణమయ్యే తిండి పదార్థాల, ఆయిల్ ఫుడ్, ఒత్తిడి ఇలా అనేక రకమైన విషయాల గురించి మనం వినే ఉంటాం. కానీ ముఖ్యంగా మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటుకు కారణమయ్యేది ఆల్కహాల్ అని మీకు తెలుసా.. తక్కువ మోతాదులో ఆల్కహాల్ తాగినప్పటికీ గుండెకు పెద్ద ముప్పు వచ్చిపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 

కొంచెం ఆల్కహాల్.. గుండెకి పెద్ద ముప్పు!: 

హైపర్ టెన్షన్, ఆయిల్ ఫుడ్ డైట్, ఎక్కువ ఉప్పు పదార్థాలు, నిద్రలేమి ఇలా అనేక రకాలైన అంశాలు మన రక్తపోటును పెంచే విషయాలుగా మారొచ్చు. అంతేకాకుండా అధిక రక్తపోటు మన గుండెను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా హై బీపీ ఉన్న వారిలో హార్ట్ ఎటాక్ సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 

ఇక చాలామంది సరదాగా ఉన్న సమయంలో, పార్టీ సమయంలో కొద్దిగా ఆల్కహాల్ తీసుకునే క్రమం కనిపిస్తూ ఉంటుంది. అయితే తక్కువ మోతాదులో తీసుకున్న ఆల్కహాల్ కూడా మన శరీరంలో ఉండే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణమని సైంటిఫిక్ గా ప్రూవ్ కూడా అయింది. డైరెక్టర్-ఇంటర్నల్ మెడిసిన్ వాషిలోని ఫోర్టిస్ హిరానందని హాస్పిటల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, సుమారు 20,000 మంది.. ఆడవాళ్లు అదే విధంగా మగవాళ్ళ మీద పరిశోధన జరిగిందని, అంతేకాకుండా వాళ్ళు తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటున్నప్పటికీ, ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ మీద ప్రభావం చూపిస్తుందని, రీసెర్చ్ చూపించిందని వెల్లడించారు. రోజుకు 12 గ్రాముల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, సిస్టోలిక్ రక్తపోటులో 1.25 mmHg పెరుగుదలకు దారితీసింది. రోజుకు 48 గ్రాముల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, సిస్టోలిక్ రక్తపోటులో 4.9 mmHg పెరుగుదలకు దారితీసింది. ఇక చివరిగా రోజుకు 130 గ్రాముల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, సిస్టోలిక్ రక్తపోటులో 80 mmHg పెరుగుదలకు దారితీసింది.. అంటే ఇది సుమారు హైపర్ టెన్షన్ తో సమానం. 

నిజానికి స్మోకింగ్ అలవాటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యలు మనకి ఉన్నప్పుడు.. తప్పకుండా అధిక రక్తపోటుకు దారి తీసే అవకాశం ఉంటుంది. అయితే రోజు కాకుండా, కేవలం వారానికి రెండు మూడు సార్లు తాగినప్పటికీ, రక్తపోటు మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయండి ఇలా: 

హైపర్ టెన్షన్ వల్ల హార్ట్ ఎటాక్ రావచ్చు, దీనివల్ల స్ట్రోక్ రావచ్చు, గుండె పాడవ్వవచ్చు, కిడ్నీ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది.దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే హెల్తీ డైట్ తీసుకోవాలి, సరైన టైం కి వర్కౌట్ చేయాలి, స్ట్రెస్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. బీపీ రెగ్యులర్ గా చూసుకోవాలి.

నీళ్లతో గుండె పదిలం: 

తగినంతగా మన శరీరానికి కావాల్సినంత నీళ్లు అందించడం ద్వారా, శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం వల్ల, గుండెపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, మన శరీరంలో జరగవలసిన రక్త ప్రసరణ అనేది సవ్యంగా జరుగుతుంది. నీళ్లు తాగడం వల్ల ప్రతి అవయవానికి ముఖ్యంగా గుండెకు సమానమైన, ఎటువంటి ఒత్తిడి లేకుండా రక్తప్రసరణ జరగడం వల్ల.. గుండె ఎప్పటికీ పదిలంగా ఉంటుంది.. రక్తపోటు అనేది దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. 

డీహైడ్రేషన్ వాస్తవానికి మన శరీరంలో అత్యధికంగా ఒత్తిడిని ప్రేరేపిస్తుందని మీకు తెలుసా.. ముఖ్యంగా డీహైడ్రేషన్ మన శరీరంలో జరిగినప్పుడు అది గుండెపై ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా హృదయ స్పందన రేటు పెరుగుదలకు దారితీస్తుంది, గుండెకు సంబంధించి వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే కేవలం..హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఎక్కువగా చూడటమే.