పండ్లు కూరగాయలు కలిపి జ్యూస్ తాగితే.. కిడ్నీ సమస్యలు వస్తాయంటున్న పరిశోధకులు

మిడిమిడి జ్ఞానంతో ఈ రెండింటినీ కలిపి జ్యూస్ చేసుకుని తాగేస్తే పోలా.. ఆరోగ్యం మెరుగు పడుతుందని ఎక్కువ మంది భావిస్తారు. చాలా మంది కూరగాయలను, పండ్లను రెండింటినీ కలిపి జ్యూస్ చేసి తాగేస్తున్నారు. అలా రెండింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వాటిని విడివిడిగా.. వేరువేరుగా తినేంత ఓపిక, తీరిక ఎక్కువ మందికి ఉండటం లేదు.. పైగా మిడిమిడి జ్ఞానంతో ఈ […]

Share:

మిడిమిడి జ్ఞానంతో ఈ రెండింటినీ కలిపి జ్యూస్ చేసుకుని తాగేస్తే పోలా.. ఆరోగ్యం మెరుగు పడుతుందని ఎక్కువ మంది భావిస్తారు. చాలా మంది కూరగాయలను, పండ్లను రెండింటినీ కలిపి జ్యూస్ చేసి తాగేస్తున్నారు. అలా రెండింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వాటిని విడివిడిగా.. వేరువేరుగా తినేంత ఓపిక, తీరిక ఎక్కువ మందికి ఉండటం లేదు.. పైగా మిడిమిడి జ్ఞానంతో ఈ రెండింటినీ కలిపి జ్యూస్ చేసుకుని తాగేస్తే పోలా ఆరోగ్యం కలుగుతుందని ఎక్కువ మంది భావిస్తారు. చాలా మంది కూరగాయలను పండ్లను రెండింటినీ కలిపి జ్యూస్ చేసి తాగేస్తున్నారు. అలా రెండింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పరిశోధకుల మాటలు..

హెపాటాలజిస్ట్ అబ్బి ఫిలిప్స్ ప్రకారం.. పండ్లు, కూరగాయల జ్యూస్, స్మూతీలు ఆరోగ్యానికి మంచిది. కానీ పండ్లు, పచ్చి కూరగాయల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ముందుగా కాలేయ వ్యాధి ఉన్నవారికి హానికరం. ఈ విషయాన్ని నేను సాధారణంగా చెప్పటం లేదు. నేను ఓ పేషెంట్ ని కూరగాయలు, పండ్లతో కలిపి జ్యూస్ తాగక ముందు.. తాగిన తర్వాత పరీక్షలు చేశాను. జ్యూస్ తాగక ముందు అతనికి ఎలాంటి కిడ్నీ సమస్యలు లేవు.

 ప్రతిరోజు ఇంట్లోనే పండ్లు, కూరగాయలతో కలిపి జ్యూస్ తయారు చేసుకుని రోజు తాగుతున్న ఓ పేషెంట్ ను నేను పరీక్షించాను. ఇలా వారం రోజులు అతను తాగిన తర్వాత మరోసారి అతన్ని నేను టెస్ట్ చేసినప్పుడు.. అతనికి కిడ్నీ సమస్య వచ్చిందని స్పష్టం అయిన తర్వాతే నేను మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను అని తెలిపారు. అందువలన దయచేసి మీరు ఇప్పటికే వ్యాధిని కలిగి ఉన్నట్లయితే పండ్లు, పచ్చి కూరగాయల రసాలను కలిపి తీసుకోవద్దు. మిమ్మల్ని మీరు డిటాక్స్ జ్యూస్ గా మార్చుకోకండి అని ఆయన ట్వీట్ చేశారు. 

బరువు తగ్గాలని, లేదంటే ఇతర మరేదైనా సమస్యలతో బాధపడుతున్న వారు డైట్ ప్లాన్ అంటూ.. డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు ఇలా అన్నిటిని కలిపి జ్యూస్ గా తయారు చేసుకుని తాగుతున్నారు. ఇది ఏ మాత్రం ఆరోగ్యానికి మేలు చేయకపోగా, మీ ఆరోగ్యానికి హాని చేస్తుందని వైద్యులు తెలిపారు. 

కాలేయ, కిడ్నీ వ్యాధులు..

పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పండ్లు, కూరగాయలను కలపడం మాత్రం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల కాలేయం, కిడ్నీ వ్యాధులు వస్తాయి. ఎందుకంటే.. ఈ రెండింటినీ కలిపి జ్యూస్ చేయడం వలన ఇందులో ఉండే కొవ్వులు, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని పోతాయి . ఇంకా మన శరీరానికి అత్యంత అవసరమైన ఫైబర్ కూడా పోతుంది. జ్యూస్ లో మనం కేవలం రసాన్ని మాత్రమే తాగుతాము. అందులో ఉండే పోషక పదార్థాన్ని మొత్తం పక్కన పడేసి వాటిలోని సారాన్ని మాత్రమే తాగుతాము.

 దీనివలన మన ఆరోగ్యానికి కావలసిన ఫైబర్ కంటెంట్ సరిపడనంత లభించదు. అంతే కాకుండా పండ్లు కూరగాయలలో ఉండే ఆక్సలేట్.. జ్యూస్ లో మనకి లభించవు.  ముఖ్యమైన పోషకాలన్నీ తీసివేయడంతో ఆ ఎఫెక్ట్ అంతా మన కిడ్నీల పైన ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కిడ్నీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు పండ్లు, కూరగాయల కాంబినేషన్లో ఉన్న జ్యూస్ ని తాగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.