చాక్లెట్ తో ఆరోగ్యానికి లాభాలే కాదు, నష్టాలు కూడా

చాక్లెట్ ఈ పేరు వినగానే అందరి నోళ్ళల్లో లాలాజలం ఊరుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి.. అన్ని వయసుల వారు ఇష్టపడే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది చాక్లెట్ అని చెప్పొచ్చు. పాలు, తృణధాన్యాలు కలగలిపిన స్వీట్ గా చాక్లెట్ భోజనాంతరం తినే స్వీట్ గా అన్ని వయసుల వారికీ నచ్చుతుంది. కళ్ళ ముందు రుచికరమైన చాక్లెట్ బార్ చూస్తే తినకుండా ఉండలేం. అయితే చాక్లెట్ తింటే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అంతేకాదు తక్షణ […]

Share:

చాక్లెట్ ఈ పేరు వినగానే అందరి నోళ్ళల్లో లాలాజలం ఊరుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి.. అన్ని వయసుల వారు ఇష్టపడే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది చాక్లెట్ అని చెప్పొచ్చు. పాలు, తృణధాన్యాలు కలగలిపిన స్వీట్ గా చాక్లెట్ భోజనాంతరం తినే స్వీట్ గా అన్ని వయసుల వారికీ నచ్చుతుంది. కళ్ళ ముందు రుచికరమైన చాక్లెట్ బార్ చూస్తే తినకుండా ఉండలేం. అయితే చాక్లెట్ తింటే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అంతేకాదు తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. పంచదార పాకం, డ్రై ఫ్రూట్స్, బటర్ కోచ్ బైట్స్  అంటూ మార్కెట్లో రకరకాల రుచులతో చాక్లెట్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇలాంటి చాక్లెట్ తింటే మన ఆరోగ్యానికి మంచిదో కాదో మనందరం కచ్చితంగా తెలుసుకోవాలి. చాక్లెట్ తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే చాక్లెట్ ఎందుకు హానికరమో కూడా తెలుసుకొని ఆచరిస్తే మనకే మంచిది.. 

చాక్లెట్లు కోకో గింజల నుంచి తయారు చేస్తారు. ప్రాసెసింగ్ తరువాత కోకో వెన్న, కోకో పౌడర్ ని ఉపయోగించి చాక్లెట్ కి రూపాంతరం తీసుకువస్తారు. ఈ కొవ్వు పదార్థాన్ని వివిధ పదార్థాలతో కలిపి డార్క్, మిల్క్, వైట్ ఇతర రకాల చాక్లెట్ ఉత్పత్తులను తయారు చేస్తారు. చాక్లెట్లు నిజంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కోకో బీన్స్ లో ఐరన్ పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కొన్ని విటమిన్లు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి పాలిఫీనాల్స్ అనే ప్రయోజనకరమైన రసాయనాలు కూడా వీటిలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి, గట్ మైక్రో బయోటాకు ఆహారాన్ని అందించడం, గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం, వాపులు తగ్గించడం వంటి మేలైన ప్రయోజనాలను కలిగి ఉంది. 

ఈ రోజుల్లో మార్కెట్ మార్కెట్లో చాలా రకాల చాక్లెట్లు అందుబాటులోకి వచ్చాయి. చాక్లెట్ ప్రయోజనాలు ఎక్కువగా ఘనపదార్థాల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అందువలన డార్క్ చాక్లెట్ పాలి ఫైనల్ పోషకాల కంటెంట్ ఎక్కువగా ఉన్నందున అది మరింత ప్రయోజనాలను అందిస్తుంది. వైట్ చాక్లెట్లతో పోలిస్తే డార్క్ చాక్లెట్లలో ఏడు రెట్లు ఎక్కువ పాలిఫీనాల్స్ ఉండవచ్చు. అలాగే మిల్క్ చాక్లెట్లతో పోలిస్తే  మూడు రెట్లు పాలిఫీనాల్స్ ఎక్కువ ఉంటాయి. 

ఎక్కువగా చాక్లెట్స్ తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. చాక్లెట్ అధికంగా తీసుకోవడం శరీరానికి హానికరం. చాక్లెట్లలో అధిక మొత్తంలో చక్కెర, కొవ్వు ఉన్నందున ఇవి శరీరానికి అనేక రకాలుగా హాని కలిగిస్తాయి.  ఉదాహరణకు వైట్ చాక్లెట్ తయారు చేయడానికి పాలతో పాటు ఎక్కువ శాతం పంచదారను ఉపయోగిస్తారు. అలాగే ఈ చాక్లెట్లలో 45 శాతం కొవ్వును కలిగి ఉంటుంది. ఇంకా కోకో బీన్స్ లో డియో బ్రోమిన్ అనే సమ్మేళన ఉంటుంది. ఇది కెఫెన్ వలె మెదడు ఉద్దీపనగా పనిచేస్తుంది. ఇది మూడ్ బూస్ట్ ను పెంచినప్పటికీ, చాక్లెట్ ను అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో సమస్యలు,  చిరాకు, వికారం వంటివి కలగవచ్చు. లాక్టోస్ అసహనం ఉన్నవారు చాక్లెట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది అలర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది.