పిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రతి సంవత్సరం దాదాపు 75,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతుండగా, భారత్‌లో 20% కేసులు నమోదవుతున్నాయి. పిల్లల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లు, వాటి లక్షణాలపై అవగాహన ఉంటే.. మొదటి దశలోనే వీటిని నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. చిన్నార్లుల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లు, కారణాల గురించి.. డాక్టర్ రమ్య ఉప్పులూరి మనకు వివరించారు. పిల్లలకు చిన్నపాటి జ్వరం వచ్చిందంటేనే.. తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది క్యాన్సర్‌ అంటే.. వారి ప్రాణం తల్లడిల్లిలపోతుంది. […]

Share:

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రతి సంవత్సరం దాదాపు 75,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతుండగా, భారత్‌లో 20% కేసులు నమోదవుతున్నాయి. పిల్లల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లు, వాటి లక్షణాలపై అవగాహన ఉంటే.. మొదటి దశలోనే వీటిని నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. చిన్నార్లుల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లు, కారణాల గురించి.. డాక్టర్ రమ్య ఉప్పులూరి మనకు వివరించారు.

పిల్లలకు చిన్నపాటి జ్వరం వచ్చిందంటేనే.. తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది క్యాన్సర్‌ అంటే.. వారి ప్రాణం తల్లడిల్లిలపోతుంది. క్యాన్సర్ అంటేనే అర్థం తెలియని పసిప్రాయంలో.. మహమ్మారితో పోరాటం చేస్తుంటే మనసు అల్లాడిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రతి సంవత్సరం దాదాపు 75,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతుండగా, భారత్‌లో 20% కేసులు నమోదవుతున్నాయి. 

పద్నాలుగేళ్ల లోపు వారిలో వచ్చే వాటిని చైల్డ్‌హుడ్‌ క్యాన్సర్లు అంటారు. పిల్లల్లో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు పూర్తిగా నయం చేయదగినవే అని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లు, వాటి లక్షణాలపై అవగాహన ఉంటే.. మొదటి దశలోనే వీటిని నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. చిన్నార్లుల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లు, కారణాల గురించి.. డాక్టర్‌ రమ్య ఉప్పులూరి మనకు వివరించారు. దురదృష్టవశాత్తు, చైల్డ్‌హుడ్‌ క్యాన్సర్లపై అవగాహన లోపం కారణంగా.. పిల్లల జీవితాలు బలి అవుతున్నాయని డాక్టర్‌ అన్నారు. 

పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు..

పద్నాలుగేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా.. రక్తక్యాన్సర్‌ (ల్యుకీమియా), లింఫ్‌ వ్యవస్థ క్యాన్సర్‌ (లింఫోమా), బ్రెయిన్‌ ట్యూమర్‌, స్పైనల్‌కాడ్‌ ట్యూమర్‌, నెఫ్రోబ్లాస్టోమా (అడ్రినల్ గ్రంధుల క్యాన్సర్), కిడ్నీ క్యాన్సర్‌ (విల్మ్స్‌ ట్యూమర్‌), కండర క్యాన్సర్‌ (రాబ్డోమయోసార్కోమా), కంటి క్యాన్సర్‌ (రెటీనోబ్లాస్టోమా), , ఎముక క్యాన్సర్‌ (బోన్‌ సార్కోమా) కనిపిస్తుంటాయి.

పిల్లల్లో క్యాన్సర్‌ ఎందుకొస్తుంది..?

పిల్లలలో చాలా క్యాన్సర్‌లు, పెద్దవారిలో లాగా, జన్యువులలో ఉత్పరివర్తన (DNA మార్పు) కారణంగా అభివృద్ధి చెందుతుంది. ఇది అనియంత్రిత కణాల పెరుగుదలకు, చివరికి క్యాన్సర్‌కు దారితీస్తుంది. పిల్లలలో వచ్చే క్యాన్సర్లలో 5% వంశ పారంపర్యంగా.. అంటే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్‌ బారినపడి ఉండటం వల్ల రావచ్చు. ఇప్పటివరకు చైల్డ్‌హుడ్‌ క్యాన్సర్లు.. పర్యావరణ కారణాలు, లైఫ్‌స్టైల్‌ కారణంగా వస్తాయని ఏ అధ్యయనాలు చెప్పలేదు. అందువల్ల చైల్డ్‌హుడ్‌ క్యాన్సర్లను నివారించలేం.

రక్తక్యాన్సర్‌(ల్యుకీమియా)

ఈ క్యాన్సర్‌లో చర్మం, కళ్లు పాలిపోవటం ప్రధాన లక్షణాలు. బలహీనత, నిస్సత్తువ, బరువు తగ్గటం, పిల్లలు నడుస్తుంటే ఆయాస పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆడేప్పుడు త్వరగా అలసిపోతారు, గాయాలైనప్పుడు రక్తస్రావం ఆగదు. తల్లిదండ్రులు ఈ లక్షణాలు గుర్తిస్తే.. వెంటనే‌ వైద్య పరీక్షలు చేయించడం మంచిది.

బ్రెయిన్ ట్యూమర్‌

తలనొప్పి, చూపు మసకబారటం, అకారణంగా రోజూ వాంతి కావటం, నడుస్తుంటే తడబడటం, మూర్ఛ వంటివి కనిపిస్తాయి.

కిడ్నీ క్యాన్సర్‌(విల్మ్స్‌ ట్యూమర్‌)

స్నానం చేయిస్తున్నప్పుడో, ఒళ్లు నిమురుతున్నప్పుడో కడుపు మీద కణితిలాంటిది చేతికి తగులుతుంది. ఇందులో జ్వరం, నొప్పి, వాంతి, ఆకలి తగ్గటం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది.

నాడీకణాల క్యాన్సర్‌

కణితి పెద్దగా అయ్యేంతవరకు లక్షణాలేవీ ఉండవు. పెద్దగా అవుతున్న కొద్దీ కడుపులో నొప్పి వస్తుంది. స్నానం చేయిస్తున్నప్పుడు చేతికి కణితి తగులుతుంటుంది.

లింఫ్‌ క్యాన్సర్‌(లింఫోమా)

బరువు తగ్గటం, జ్వరం, నిస్సత్తువ.. చంక, మెడ, గజ్జల్లో లింఫ్‌ గ్రంథుల వాపు వంటివి ఉంటాయి.

కంటి క్యాన్సర్‌(రెటీనోబ్లాస్టోమా)

ఫొటో తీసినప్పుడు కంట్లో తెల్లగా ఫ్లాష్‌లాగా మెరిసినట్టు కనిపిస్తుంది.

ఎముక క్యాన్సర్‌లో(బోన్‌ సార్కోమా)

కాళ్ల మీద గానీ చేతుల మీద ఉబ్బు కనిపిస్తుంది. ముఖ్యంగా దెబ్బలేవీ తగలకుండా అకారణంగా ఉబ్బితే నిర్లక్ష్యం చేయొద్దు.

కండర క్యాన్సర్‌(రాబ్డోమయోసార్కోమా)..

ఇది తల, మెడ, గజ్జలు, కడుపు, కటి భాగం, చేతులు, కాళ్లు.. ఇలా ఒంట్లో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో వాపు, లింఫ్‌ గ్రంథులు ఉబ్బటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స పద్ధతులు

బాల్య క్యాన్సర్ చికిత్స ఎంపికలలో శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ లేదా మూడింటి కలయిక ఉన్నాయి. చికిత్స సమయంలో మరియు తర్వాత పిల్లల కోలుకోవడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో తయారుచేసిన పోషకమైన, సమతుల్యమైన మరియు సులభంగా జీర్ణమయ్యే భోజనాన్ని అందించమని తల్లిదండ్రులు ప్రోత్సహించబడ్డారు. మరొక చివరలో, పోషకాహార లోపం ఉన్న పిల్లల ఉపసమితి ఉంది. వారి బరువును మాత్రమే కాకుండా వారి మొత్తం పోషకాహారాన్ని కూడా మెరుగుపరచడానికి ఆ పిల్లలకు ప్రోటీన్ పౌడర్‌లు సూచించబడతాయి.

పీడియాట్రిక్ ఆంకాలజీ అవసరం

పిల్లలలో క్యాన్సర్ చికిత్సలో పెద్ద మెరుగుదలలు ఉన్నాయి. క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేయడం గురించి చాలా తెలిసిన నిపుణుల బృందాలతో ప్రత్యేక ఆసుపత్రులలో చికిత్స చేయాలని వైద్యులు విశ్వసిస్తున్నారు. అటువంటి ఆసుపత్రి అపోలో క్యాన్సర్ సెంటర్. ఈ ఆసుపత్రిలో, వారు పిల్లల కోసం క్యాన్సర్ వైద్యులు, రేడియేషన్ థెరపిస్ట్‌లు మరియు పాథాలజిస్టులు వంటి విభిన్న నిపుణులు సమావేశమై ప్రతి పిల్లల కేసు గురించి మాట్లాడతారు. వారు పిల్లల క్యాన్సర్ చికిత్సకు ఉత్తమమైన మార్గాన్ని కనుగొంటారు. వారు అందించే ఒక అద్భుతమైన చికిత్సను ప్రోటాన్ చికిత్స అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన రేడియేషన్ థెరపీ, ఇది క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేయడంలో గొప్పది. ఇది రేడియేషన్‌ను చాలా ఖచ్చితంగా కేంద్రీకరిస్తుంది, కాబట్టి ఇది ఆరోగ్యకరమైన కణాలకు అంతగా హాని కలిగించదు. ఇది చాలా పెద్ద విషయం మరియు పిల్లలకు చికిత్స మెరుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది.

ఒక పెద్ద సమస్య ఏమిటంటే, చాలా మంది పిల్లలు వారి క్యాన్సర్ చికిత్సను పూర్తి చేయలేరు ఎందుకంటే వారి కుటుంబాలు దానిని భరించలేవు. ఇది మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ముఖ్యమైన సమస్య. పిల్లలందరూ వారికి అవసరమైన చికిత్సను పొందగలరని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ కంపెనీల మధ్య భాగస్వామ్యం అవసరమని వైద్యులు భావిస్తున్నారు.