పసిగుడ్డును పదిలంగా చూసుకోవాలి సుమీ!

ఏడుపు తప్ప ఇంకా ఏమీ తెలియని శిశువు ఏం చెబుతోందో అర్థం చేసుకుని వారికి అవసరమైన విధంగా రక్షణ కల్పించడం మరువవద్దు.  9 నెలల పాటు తల్లి గర్భంలో ఎటువంటి చీకూచింతా లేకుండా కాలం గడిపిన చిన్నారి ఈ భూవాతావరణంలోకి వచ్చిన సమయంలో, ఆ చిన్నారి మీద ఎటాక్ చేసేందుకు అనేక క్రిములు సిద్ధంగా ఉంటాయి. చిన్నారి పుట్టడం ఇంటిల్లిపాదికీ సంతోషంగా ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ అదే సంతోషంలో ఉంటూ చిన్నారిని సరిగ్గా పట్టించుకోకుంటే […]

Share:

ఏడుపు తప్ప ఇంకా ఏమీ తెలియని శిశువు ఏం చెబుతోందో అర్థం చేసుకుని వారికి అవసరమైన విధంగా రక్షణ కల్పించడం మరువవద్దు. 

9 నెలల పాటు తల్లి గర్భంలో ఎటువంటి చీకూచింతా లేకుండా కాలం గడిపిన చిన్నారి ఈ భూవాతావరణంలోకి వచ్చిన సమయంలో, ఆ చిన్నారి మీద ఎటాక్ చేసేందుకు అనేక క్రిములు సిద్ధంగా ఉంటాయి. చిన్నారి పుట్టడం ఇంటిల్లిపాదికీ సంతోషంగా ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ అదే సంతోషంలో ఉంటూ చిన్నారిని సరిగ్గా పట్టించుకోకుంటే మాత్రం అనేక అపాయాలు వచ్చే ప్రమాదం ఉంది.

ఆ రోజులు చాలా కీలకం..

ఏడుపు తప్ప ఇంకా ఏమీ తెలియని శిశువు ఏం చెబుతోందో అర్థం చేసుకుని వారికి అవసరమైన విధంగా రక్షణ కల్పించడం మరువవద్దు. శిశు సంరక్షణ విషయంలో తరతరాలుగా అనాదిగా అనేక పద్ధతులు, సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. వాటిలో కొన్ని మూఢనమ్మకాలు అయినప్పటికీ, కొన్నింటికి సరైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. కావున వాటిని మూఢనమ్మకాలని కొట్టిపారేయలేం. శిశువు పుట్టిన 28 రోజుల వరకు ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనినే నియోనేటల్ కేర్ అని కూడా అంటారు. 

మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. కానీ మనదేశంలో ఐదేళ్ల లోపు పిల్లల మరణాల సంఖ్య నేటికీ ఎక్కువగానే ఉంది. ఈ సంఖ్యలో చాలా మంది పిల్లలు పుట్టిన నెలలోపో లేదా రెండు మూడు రోజుల్లోనే కన్నుమూస్తున్నారు. కాబట్టే బిడ్డ పుట్టిన తర్వాత మనం ఎంత సంతోషిస్తామో.. అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు ఆ పాపాయి విషయంలో తప్పకుండా తీసుకోవాలి.

ఇలా చేస్తే మేలు..

బాలింతను, పుట్టిన బిడ్డను జాగ్రత్తగా చూసుకునేందుకు చాలా మంది చాలా రకాల పద్ధతులను అవలంబిస్తారు. ఎవరు అనుసరించే పద్ధతులూ తప్పు కాకపోయినా, ఇలా చేయడం వల్ల వారిని మరింత జాగ్రత్తగా చూసుకున్నట్లవుతుంది.

తల్లిని, బిడ్డను వేర్వేరు గదులలో ఉంచడం: 

ఇలా వారిని సెపరేట్ రూంలో ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి రోజూ మన ఇంటికి ఎంతో మంది బయటి వారు వస్తుంటారు, పోతుంటారు. వారు అనేక సూక్ష్మక్రిములను తీసుకువస్తుంటారు. బిడ్డకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, సెపరేట్ రూంలో ఉంచడం అవసరం. అంతే కాకుండా నూనెతో శిశువుకు మర్దనా చేయడం వలన శిశువు కండరాలు గట్టి పడి, రక్తప్రసరణ పుంజుకుంటుంది. ఎలాగూ మర్దనా చేయాలి కదా అని గట్టిగా రుద్దకూడదు. చనుబాలు అనేవి శిశువుకు ఎంతో ముఖ్యం. కావున మొదటి మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలను తప్పకుండా శిశువుకు తాగించండి. ఉదయం సూర్యరశ్మి శిశువు మీద పడేలా చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని సైంటిఫిక్​గా కూడా ప్రూవ్ అయింది.

ఇలా అస్సలు చేయకండి

తెలిసో, తెలియక కొంత మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనుషులు పొరపాట్లు చేయడం సహజమే కానీ.. ఆ పొరపాట్లను శిశువుల విషయంలో చేయకూడదు. శిశువులను పాత బట్టల్లో చుట్టడం, కళ్లకు కాటుక పెట్టడం, బొడ్డుకు పొడులను రాయడం, పుట్టిన వెంటనే స్నానం చేయించడం, రొమ్ములను బలంగా నొక్కడం, నీళ్లు తాగించడం, బాలింతకు పథ్యం (కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే తినిపించడం లేదా తక్కువ మోతాదులో తినిపించడం), అధిక వేడి ఉన్న నీటితో ఆవిరి స్నానం చేయించడం వంటివి అస్సలుకే చేయకూడదు.

టేబుల్‌లు, బెడ్‌లు, సోఫాలు లేదా కుర్చీలపై మీ బిడ్డను ఒంటరిగా ఉంచవద్దు. మీ బిడ్డను మీరు పట్టుకోలేనప్పుడు ఉయ్యాల లేదా ప్లేపెన్ వంటి సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. మీ శిశువు గాయపడగల అవకాశమున్న గదులకు దూరంగా ఉంచడానికి మెట్ల మార్గాలపై గేట్లు ఉంచుకోవాలి. వాటి తలుపులు మూసివేయండి.