క్యూఆర్ కోడ్‌తో మందులు న‌కిలీవో కాదో తెలిసిపోతుంది

నకిలీ మెడిసిన్స్ వినియోగించే ప్రమాదాన్ని తగ్గించడానికి, నాసిరకం అదేవిధంగా నకిలీ ఉత్పత్తుల వినియోగాన్ని నిరోధించడానికి అగ్రశ్రేణి మెడిసిన్స్ తయారీదారుల కోసం ప్రభుత్వం ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని తీసుకువచ్చింది. అంటే మనం మెడిసిన్స్ నకిలీవా లేకపోతే అసలైనవా తెలుసుకోవడానికి జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూస్తే సరిపోతుంది.  పూర్తి వివరాలు:  టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, దాదాపు 300 మంది అగ్రశ్రేణి ఔషధ తయారీదారులు ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్‌లపై బార్‌కోడ్‌లు లేదా క్విక్ రెస్పాన్స్ […]

Share:

నకిలీ మెడిసిన్స్ వినియోగించే ప్రమాదాన్ని తగ్గించడానికి, నాసిరకం అదేవిధంగా నకిలీ ఉత్పత్తుల వినియోగాన్ని నిరోధించడానికి అగ్రశ్రేణి మెడిసిన్స్ తయారీదారుల కోసం ప్రభుత్వం ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని తీసుకువచ్చింది. అంటే మనం మెడిసిన్స్ నకిలీవా లేకపోతే అసలైనవా తెలుసుకోవడానికి జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూస్తే సరిపోతుంది. 

పూర్తి వివరాలు: 

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, దాదాపు 300 మంది అగ్రశ్రేణి ఔషధ తయారీదారులు ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్‌లపై బార్‌కోడ్‌లు లేదా క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్‌లను కూడా ఉంచడం జరుగుతుంది. ఒక్కో స్ట్రిప్‌కు రూ. 100 కంటే ఎక్కువ ఖరీదు చేసే యాంటీబయాటిక్స్‌ మెడిసిన్స్ ప్యాకేజింగ్ మీద బార్ కార్డు తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తేల్చింది. ప్రతిపాదిత యంత్రాంగం, ప్రభుత్వ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయడానికి వినియోగదారులకు యాక్సిస్ అయితే కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా, ఈ కోడ్‌లు స్కాన్ చేస్తున్నావ్ వెంటనే, మెడిసన్ గురించి దానికి సంబంధించిన వివరాలను గురించి అన్ని విషయాలు అందుబాటులో చూపిస్తుంది. గుర్తింపు కోడ్, మెడిసన్కి సంబంధించిన సాధారణ పేరు, బ్రాండ్ పేరు, తయారీదారు పేరు మరియు చిరునామా, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ మరియు తయారీ లైసెన్స్ నంబర్. వినియోగదారులు ప్రభుత్వ పోర్టల్‌లో ప్రత్యేకమైన ID కోడ్‌ను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వారి మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి మెడిసిన్ వివరాలు మొత్తం ట్రాక్ చేయగలరు.

మొదటి దశలో, దాదాపు 300 అత్యధికంగా అమ్ముడవుతున్న మెడిసిన్స్ యొక్క ప్రాథమిక ప్యాకేజింగ్‌పై బార్‌కోడ్‌ తప్పకుండా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ ఖర్చులను 3-4 శాతం పెంచుతుందని భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, మొత్తం సెక్టార్‌కు ఒకే బార్ కోడ్ ప్రొవైడర్ ద్వారా వినియోగదారులు డేటాను పొందగలిగే సెంట్రల్ డేటాబేస్ సంస్థను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి వచ్చిన డేటా ప్రకారం, తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలలో సుమారు 10 శాతం అందుబాటులో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ అలాగే మెడిసిన్స్ అనేవి నకిలీ అని తేల్చడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఇలాంటి నకిలీ వ్యాపారాలు జరుగుతున్నట్లు WHO వెల్లడించడం జరిగింది.

ప్రభుత్వం QR కోడ్‌లను ఎందుకు ప్రవేశపెట్టింది? 

అయితే దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సబ్-స్టాండర్డ్ అదే విధంగా నకిలీ మెడిసిన్స్ తొలగించే లక్ష్యంతో ఈ ప్రాసెస్ అనేది ఫార్మాస్యూటికల్స్ విభాగం రూపొందించింది. అంతే కాకుండా భారతదేశ అపెక్స్ డ్రగ్ రెగ్యులేటరీ బాడీ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)చే అమలు చేయడం జరిగింది.

ఈ ప్రాసెస్ అనేది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న నకిలీ ఉత్పత్తులు లేదా నకిలీ మెడిసిన్స్ వినియోగాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మునుపటి అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్న దాదాపు 35 శాతం నకిలీ మందులు భారతదేశం నుండి వచ్చాయి అంటూ తేల్చి చెప్పింది.

యాంటీబయాటిక్స్, కార్డియాక్ డ్రగ్స్, పెయిన్‌కిల్లర్స్, యాంటీ డయాబెటిక్స్ మరియు యాంటీ అలెర్జిక్ మెడిసిన్‌లతో సహా అత్యధికంగా అమ్ముడవుతున్న మందులపై బార్ కోడ్‌లు లేదా క్యూఆర్ కోడ్‌లను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ సంస్థలు పిలుపునిచ్చాయి.