30 ఏళ్లలో 79% పెరిగిన క్యాన్సర్ కేసులు

ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న వ్యక్తులు అధికంగా మారుతున్నట్లు బిఎంజె కోనకాలజీ సర్వే ప్రకారం తెలుస్తోంది. గత 30 సంవత్సరాలలో అధికంగా 79% క్యాన్సర్ కేసులు పెరిగినట్లు, అందులో ముఖ్యంగా 50 ఏళ్లు కన్నా తక్కువ వయసు ఉన్న వారే అధికంగా ఉన్నట్లు వెళ్లడైంది.  ఈ క్యాన్సర్ బారినపడుతున్న వారు అధికం:  30 సంవత్సరాల లో అధికంగా 79% క్యాన్సర్ కేసులు పెరగడం కలవరం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో క్యాన్సర్ బాధితులు ఎక్కువగా […]

Share:

ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న వ్యక్తులు అధికంగా మారుతున్నట్లు బిఎంజె కోనకాలజీ సర్వే ప్రకారం తెలుస్తోంది. గత 30 సంవత్సరాలలో అధికంగా 79% క్యాన్సర్ కేసులు పెరిగినట్లు, అందులో ముఖ్యంగా 50 ఏళ్లు కన్నా తక్కువ వయసు ఉన్న వారే అధికంగా ఉన్నట్లు వెళ్లడైంది. 

ఈ క్యాన్సర్ బారినపడుతున్న వారు అధికం: 

30 సంవత్సరాల లో అధికంగా 79% క్యాన్సర్ కేసులు పెరగడం కలవరం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో క్యాన్సర్ బాధితులు ఎక్కువగా మారుతున్నారు. ముఖ్యంగా శ్వాసనాళం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు అధికంగా మారాయి. అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బౌల్, స్టొమక్ క్యాన్సర్లతో బాధపడుతూ చనిపోయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సర్వే ప్రకారం తెలుస్తోంది. 

1990 తర్వాత నుంచి క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య అధికమైనట్లు సర్వే ప్రకటించింది. ముఖ్యంగా ఇందులో 30 నుంచి 40 సంవత్సరాల ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా 2030 నాటికల్లా క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య మరింత పెరగొచ్చు అంటూ, పొంచి ఉన్న రిస్క్ గురించి ప్రకటించింది సర్వే. 

ఇన్ని రకాల క్యాన్సర్ల?: 

ప్రపంచవ్యాప్తంగా సుమారు 204 దేశాలలోగాను 29 రకాల క్యాన్సర్లు గుర్తించినట్లు సర్వే ప్రకారం తెలిసింది. అయితే సర్వే నిర్వహించిన గణాంకాల ప్రకారం 14 నుంచి 49 మధ్య ఉన్న వాయిస్కులలో క్యాన్సర్ లక్షణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. కేవలం 2019లోనే 50 కన్నా తక్కువ వయస్సున్న వాళ్లు సుమారు 11 లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి ప్రపంచంలో ఇప్పటివరకు అనేకమంది చనిపోయినట్లు కూడా వెళ్లడైంది. లక్ష మందిలో సుమారు 3.5 మందుకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తున్నట్లు సర్వేలో బయటపడింది. 

ఊపిరితిత్తులకు సంబంధించి, పొట్ట క్యాన్సర్, బౌల్ క్యాన్సర్ వంటివి అధికంగా మారుతున్న వేళ, లివర్ క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. సుమారు ప్రతి సంవత్సరం 2.88 శాతం తగ్గుతున్నట్లు వెళ్లడైంది. 

అధికంగా ఈ దేశాలలోనే: 

2019 నుంచి అధికంగా క్యాన్సర్ బారినపడుతున్న దేశాలలో ఆస్ట్రాలేసియా, నార్త్ అమెరికా, వెస్ట్రన్ యూరప్ ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా మరిన్ని దేశాలలో చెప్పాలంటే, ఓషనియ, ఈస్టర్ యూరోప్ ,సెంట్రల్ ఏసియాలలో 50 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వారిలో అధికంగా క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ముఖ్యంగా క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్యలో అధికంగా మహిళలు ఉన్నట్లు గుర్తించారు. నిజానికి క్యాన్సర్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్యలో కూడా అధికంగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికంగా ఉప్పు, మాంసాహారాలు, పళ్ళు తక్కువగా తినడం, పాలు తాగకపోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, ధూమపానం చేయడం, ఇలాంటివే ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి కారకాలు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఎక్సర్సైజ్ లేకపోవడం, బరువు అధికంగా పెరగడం, డయాబెటిస్ ఉన్న వారిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రకృతికి దగ్గరగా ఉన్న వారిలో ముఖ్యంగా ఆరోగ్యం అధికంగా ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. రోజు వ్యాయామం చేయడం, బయట వాతావరణంలో కాసేపు తిరగడం, స్వచ్ఛమైన పళ్ళు తినడం, మెడికేషన్ తగ్గించడం.. ఇలా చేసిన వారిలో ఆరోగ్యం చాలా బాగుంటుంది అని, లేదంటే అనేక అనారోగ్య సమస్యలకు గురయ్య అవకాశం ఉందంటున్నారు.