థైరాయిడ్ వల్ల జాయింట్ నొప్పులు కూడా వస్తున్నాయా?

సీతాకోక చిలుక ఆకారం లో ఉండే చిన్న గ్రంధి మన మీద భాగం లో ఉండడం వల్ల థైరాయిడ్ సంభవిస్తుంది. ఈ థైరాయిడ్ వచ్చిన తర్వాత మన శరీరం మన కంట్రోల్ లో ఉండదు. ఇష్టమొచ్చినట్టు శరీరం బరువు పెరిగిపోతాది. మూడ్ కూడా సరిగా ఉండదు, ఒక్కోసారి ఇది మన ప్రాణాలకు కూడా హాని కలిగిస్తుంది. ఒక్కసారి థైరాయిడ్ వచ్చిందంటే, అది అంత తేలికగా తగ్గదు. పాపం నరకం అనుభవిస్తుంటారు ఈ వ్యాధి కి సంబంధించిన పేషెంట్స్. […]

Share:

సీతాకోక చిలుక ఆకారం లో ఉండే చిన్న గ్రంధి మన మీద భాగం లో ఉండడం వల్ల థైరాయిడ్ సంభవిస్తుంది. ఈ థైరాయిడ్ వచ్చిన తర్వాత మన శరీరం మన కంట్రోల్ లో ఉండదు. ఇష్టమొచ్చినట్టు శరీరం బరువు పెరిగిపోతాది. మూడ్ కూడా సరిగా ఉండదు, ఒక్కోసారి ఇది మన ప్రాణాలకు కూడా హాని కలిగిస్తుంది. ఒక్కసారి థైరాయిడ్ వచ్చిందంటే, అది అంత తేలికగా తగ్గదు. పాపం నరకం అనుభవిస్తుంటారు ఈ వ్యాధి కి సంబంధించిన పేషెంట్స్. అయితే థైరాయిడ్ వచ్చిన వాళ్లకు జాయింట్ నొప్పులు కూడా రావడాన్ని ఈమధ్య డాక్టర్లు గమనించారట. థైరాయిడ్ గ్రంధి వల్ల మెటాబోలిజం మరియు హార్మోన్స్ ఉత్పత్తి మాములు స్థాయి కంటే అత్యధికంగా ఉండడం వల్ల శరీరం లో ప్రతీ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల మన శరీరం లో హార్మోన్ ఇమ్ బ్యాలన్స్ ఏర్పడుతుంది. దానివల్ల జాయింట్ నొప్పులు కూడా రావడాన్ని గమనించారు డాక్టర్లు.

హైపోథైరాయిడిజం:

థైరాయిడ్ గ్రంధి కావాల్సిన దానికంటే తక్కువ  థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడాన్ని హైపోథైరాయిడిజం అని పిలుస్తారు. హైపోథైరాయిడిజం ఉన్నవారిలో ఎక్కువగా కీళ్ల నొప్పులు రావడాన్ని డాక్టర్లు గమనించారు.ఇది తరచుగా మోకాలు, భుజాలు మరియు చేతుల పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అయితే థైరాయిడ్ గ్రంధి కారణంగా జాయింట్ నొప్పులు ఎందుకు వాస్తుంది అనే దానిపై ఇంకా పూర్తి స్థాయి అవగాహనా రాలేదు. కానీ హైపోథైరాయిడిజం వల్ల కలిగే హార్మోన్ల అసమతుల్యత కీళ్లలో మంటకు దారితీస్తుందని, ఫలితంగా నొప్పి మరియు దృఢత్వం ఏర్పడుతుందని చెప్తున్నారు.

హైపర్ థైరాయిడిజం:

థైరాయిడ్ గ్రంధి శరీరానికి అవసరం అయ్యే దానికంటే అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం సంభవిస్తుంది.హైపర్ థైరాయిడిజం వల్ల శరీర బరువు తగ్గడం, గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం  మరియు వణుకు వంటి  లక్షణాలతో పాటుగా  కీళ్ల నొప్పులు కూడా ఉండవచ్చు. ఈ క్రమం లోనే ఇది జాయింట్ నొప్పులకు కూడా దారి తీసి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు. బోన్ టిష్యు మరియు ఎముక పెరగడం వంటివి ఈ లక్షణాల్లో భాగమే. అందుకే జాయింట్ నొప్పులు వచ్చి ఉండొచ్చు.

ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధి :

ఈ రెండూ కాకుండా, హషిమోటోస్ థైరాయిడిటిస్ మరియు గ్రేవ్స్ వ్యాధి  వంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధులు కీళ్ల నొప్పులకు కారణమవుతాయి. రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిపై  దాడి చేస్తుంది, అందువల్ల వాపు వస్తుంది. ఆ వాపు కీళ్లతో సహా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది, దీనివల్ల నొప్పి, వాపు మరియు చలనశీలత తగ్గుతుంది. థైరాయిడ్ రుగ్మతను నిర్ధారించడానికి కీళ్ల నొప్పులు మాత్రమే సరిపోదని గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అనేక ఇతర అంశాలు కీళ్ల నొప్పులకు దోహదం చేస్తాయి.

నివారించడం ఎలా ?:

థైరాయిడ్ రుగ్మతలతో సంబంధం ఉన్న కీళ్ల నొప్పులకు చికిత్స చేయడం ప్రాథమికంగా థైరాయిడ్ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించడం తో సమానం . హైపోథైరాయిడిజం తరచుగా సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ పునఃస్థాపన చికిత్సతో నివారించవచ్చు. హైపర్ థైరాయిడిజంలో, చికిత్సలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని కంట్రోల్ చేసేందుకు  మందులు లేదా కొన్ని సందర్భాల్లో అవసరం అయితే  శస్త్రచికిత్స చేయించడం ,  థైరాయిడ్ గ్రంధి కార్యకలాపాలను తగ్గించడానికి రేడియోధార్మిక అయోడిన్ థెరపీని చేయించడం వల్ల ఈ సమస్య కి పరిష్కారం దొరుకుతుంది. వ్యక్తిగత డాక్టర్లు ఇచ్చే సలహాలను అనుకరించి చికిత్స తీసుకోవడం మంచిది.