స్మోకింగ్ వల్ల చెవుడు వస్తుందా?

స్మోకింగ్  అనారోగ్యానికి ముఖ్య కారణం. రీసెంట్ గా స్మోకింగ్ వల్ల చెవుడు వస్తుందని కనిపెట్టారు. స్మోకింగ్ వల్ల చెవుడు వస్తుందని ఆధారాలు ఉన్నాయి.  స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే స్మోకింగ్ చేసే వారికి  ఏజ్ రిలేటెడ్ గా వినికిడి లోపం కలిగే అవకాశం ఎక్కువగా ఉందని  అధ్యయనాలు చెబుతున్నాయి. 2018లో, జర్నల్ ఆఫ్ ది అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఫోటో ఓటోలారింజాలజీ (JARO) లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, స్మోకింగ్ చేయని వ్యక్తులతో పోలిస్తే, […]

Share:

స్మోకింగ్  అనారోగ్యానికి ముఖ్య కారణం. రీసెంట్ గా స్మోకింగ్ వల్ల చెవుడు వస్తుందని కనిపెట్టారు. స్మోకింగ్ వల్ల చెవుడు వస్తుందని ఆధారాలు ఉన్నాయి. 

స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే స్మోకింగ్ చేసే వారికి  ఏజ్ రిలేటెడ్ గా వినికిడి లోపం కలిగే అవకాశం ఎక్కువగా ఉందని  అధ్యయనాలు చెబుతున్నాయి. 2018లో, జర్నల్ ఆఫ్ ది అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఫోటో ఓటోలారింజాలజీ (JARO) లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, స్మోకింగ్ చేయని వ్యక్తులతో పోలిస్తే, స్మోకింగ్ చేసే వారికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం 1.69 రెట్లు ఎక్కువ ఉందని తెలిసింది. స్మోకింగ్ లో డోస్ రెస్పాన్స్ రిలేషన్షిప్ ఉందని అధ్యయనం తెలియజేసింది. అంటే రోజుకు తాగే సిగరెట్ల సంఖ్య, స్మోకింగ్  క్వాంటిటీతో చెవుడు వస్తుందని తెలిసింది.

స్మోకింగ్ కి, చెవుడికి ఉన్న లింక్:

పెద్దవారికి, పిల్లలకు ఇద్దరికీ స్మోకింగ్ వల్ల చెవుడు రావచ్చు. స్మోకింగ్ గొంతు మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. దీనివల్ల చెవులకు చాలా ప్రాబ్లం ఉంటుంది. స్మోకింగ్ చేసే వాళ్ళ కంటే వాళ్ల దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. స్మోకింగ్ చేయడం వల్ల మీకే కాదు మీ చుట్టూ ఉన్నవాళ్ళకి చాలా ప్రాబ్లం. వీలైనంత వరకు స్మోక్ చేయకుండా ఉండడమే బెటర్. దీనివల్ల మనం సొసైటీ కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. 

స్మోకింగ్ వల్ల మన బ్లడ్ సర్కులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. మన రక్తప్రసరణ తగ్గడం వల్లనే చాలా  ప్రాబ్లమ్స్ వస్తాయి. సిగరెట్ లో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి, లోపలి చెవిలోని హెయిర్ సెల్స్ ను మరింత దెబ్బతీస్తాయి, ఇవి చాలా రకాలుగా ఇబ్బంది కలిగిస్తాయి. దీనివల్ల మన చెవులు పని చేయడం ఆగిపోతుంది. వినిపించకపోవడం వల్ల మనకు వందల సమస్యలు వస్తాయి

ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?:

స్మోకింగ్ మానేస్తే మనకు ఈ ప్రాబ్లమ్ రాదు. ఇలా ఆపేయడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి.  స్మోకింగ్ ఆపడం వల్ల మన బ్లడ్ సర్కులేషన్ పెరిగి మన చెవులు మళ్లీ సెట్ అవుతాయి. తర్వాత మనం చాలావరకు స్మోకింగ్ చేసే ఏరియాకు వెళ్లకూడదు. ఒకవేళ అత్యవసరమై వెళ్లాల్సి వచ్చినా మాస్క్ వేసుకొని వెళ్తే మనకు ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. మనకు వీలైతే మన ఫ్రెండ్స్ ని కూడా స్మోకింగ్ మాన్పించాలి. 

ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈఎన్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈఎన్టి డాక్టర్

దీని గురించి అద్భుతమైన సలహాలిస్తాడు. అవన్నీ పాటించడం వల్ల మన ఆరోగ్యం మెరుగవుతుంది. వీలైతే మన ఫ్రెండ్స్ ని కూడా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాలి. స్మోకింగ్ మనం మానేయడమే కాదు, మన ఫ్రెండ్స్ తో కూడా మానిపిస్తే మనం సొసైటీకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మన హెల్త్ తో పాటు వాళ్ళ హెల్త్ ని కాపాడిన వాళ్ళం అవుతాం. దీనివల్ల సొసైటీ కి మనం సేవ చేసిన వాళ్ళమే అవుతాం.